
అకౌంటింగ్ వ్యవస్ధ మెరుగుకు సలహాలివ్వండి
ఏ వ్యాపారానికైనా ఛార్టడ్ అకౌంటెంట్లు ఉత్తమ సలహాదారులని, ఏ సంస్ధకైనా పటిస్ఠ ఆర్ధిక వ్యవస్తకు వారు వెన్నెముక్క లాంటివారని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో మనోహర్ పారికర్
సాక్షి, న్యూఢిల్లీ: ఏ వ్యాపారానికైనా ఛార్టడ్ అకౌంటెంట్లు ఉత్తమ సలహాదారులని, ఏ సంస్ధకైనా పటిస్ఠ ఆర్ధిక వ్యవస్తకు వారు వెన్నెముక్క లాంటివారని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ) 67 సంవత్సరాల వృత్తి ప్రావీణ్యతను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి మనోహర్ పారికర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 1500 మంది నిపుణులు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంటింగ్ వ్యవస్ధ పనితీరును మరింత మెరుగు పర్చడానికి ఐసిఎఐ తగు సలహాలివ్వాలని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐసిఎఐ అధ్యక్షుడు ఎం. దేవరాజా రెడ్డి మాట్లాడుతూ గత 67 సంవత్సరాలుగా ఐసిఎఐ ప్రామాణికతలను పెంచి పోషిస్తూ, తటస్ధ నియంత్రకంగా, అకౌంటెన్సీ వృత్తికి మార్గదర్శకంగా పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ మొదటి చొరవ అయిన ఆదాయపు డిక్లరేషన్ పధకం, 2016 విజయం సాధించడానికి అనువుగా ఐసిఎఐ పాల్గొంటుందని దేవరాజా రెడ్డి చెప్పారు. శనివారం నుంచి ఈ పధకం పై దేశ వ్యాప్తంగా ఉన్న ఐసిఎఐ 154 శాఖలలో అవగాహనా కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు.