సీఏలపై ఉన్న అపోహను తొలగించుకోవాలి
సఏలకు కేఎం మణి సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఉన్న పన్ను బకాయిలను తక్షణం చెల్లించడానికి తమ క్లయింట్లను చార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ) సంసిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్ కేఎం మణి శుక్రవారం పేర్కొన్నారు. పన్నులను ఎలా తప్పించుకోవాలో చెప్పడమే సీఏల పనని కొందరిలో అపోహ ఉందని ఆయన పేర్కొంటూ... ఈ అపోహను తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే (సీఏ)నని కూడా మణి పేర్కొన్నారు. వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ), పరోక్ష పన్నులపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పరోక్ష పన్నుల కమిటీ ఇక్కడ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మణి మాట్లాడుతూ, తమ సభ్యుల్లో నైతిక ప్రమాణాలు పటిష్ట స్థాయిలో ఉండేలా ఐసీఏఐ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.