finance ministers
-
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
పీఎస్‌బీలతో సీతారామన్ భేటీ, ఎస్బీఐ మాజీ చీఫ్ లోన్ కుంభకోణంపై చర్చ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో సమావేశం కానున్నారు. దేశంలో రుణ లభ్యత, ఆర్థిక వ్యవస్థ పురోగతి తత్సంబంధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా సమీక్ష జరపనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థికాభివృద్ధికిగాను ఉత్పాదక రంగాలకు రుణ లభ్యతను పెంచాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్సహా పలు ప్రభుత్వ పథకాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. బ్యాంకర్లతోపాటు వివిధ మంత్రిత్వశాఖలు సీనియర్ అధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా మౌలిక, వ్యవసాయ సంబంధిత విభాగాల అధికారులు ఆయా రంగాలు ఎదుర్కొంటున్న రుణ సవాళ్లను బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళతారని సమాచారం. చర్చించే అంశాలివి... ►భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ పథకం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఇటీవలే ఒక ట్వీట్లో తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్నాయి. దీనిపై సమావేశంలో దృష్టి సారించే వీలుంది. ►బ్యాంకింగ్ రంగం పురోగతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిస్ట్రక్చరింగ్ 2.0 స్కీమ్ అమలు, రూ. 4.5 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పునరుద్ధరణ వంటి అంశాలపై సమీక్షించవచ్చు. ►మొండిబకాయిల సమస్యపై కూడా సమావేశం దృష్టి సారించే అవకాశం ఉంది. మొండిబకాయిలు 2019 మార్చి 31 నాటికి రూ.7,39,541 కోట్లకు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, ఆపై 2021 ముగిసే నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చాయని, తన వ్యూహాలు, సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంటోంది. గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల రికవరీ జరిగినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ►ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రతీప్ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో ఈ అంశాన్ని బ్యాంకర్లు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. బ్యాంకర్లు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. చదవండి: ప్రపంచ దేశాలన్ని భారత్‌ను ప్రశంసిస్తున్నాయి: సీతారామన్ -
రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 వ ఆర్ధిక సంఘం విధివిధానాలను మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు. కేంద్రం రాష్ట్రాలను అణిచి వేస్తోంది రాష్ట్రపతిని కలిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగపరంగా ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం స్వతంత్ర వ్యవస్థ. 14వ ఆర్థిక సంఘం సమయంలో కూడా 1971 జనాభా ప్రతిపాదనే పరిగణనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా 15వ ఆర్థిక సంఘంలో 1971 జనాభానే తీసుకోవాలని ఇపుడు కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక హక్కులకు కేంద్రం భంగం కలిగించరాదు. ఏపీ సర్కారు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు హక్కులున్నాయి, విధానాలున్నాయి. కేంద్రం బలవంతంగా ఆర్థిక విధానాలను రాష్ట్రాలపై రుద్దరాదు. కేంద్ర ప్రభుత్వ దయదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా కేంద్రం వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు భిక్షం వేసేలా 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తే అంగీకరించం. రాష్ట్రాలు రాజ్యాంగపరంగా హక్కులను కాపాడుకుంటాయి. రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్తో ఉపయోగం ఉండదు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయరాదు.15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జూన్‌లో జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేస్తాము. వెనుకబడిన రాష్ట్రాల పేరుతో కేంద్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను నాశనం చేయాలనుకుంటే చూస్తూ కూర్చోము. కేంద్రం కావాలనుకుంటే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలి. కేంద్రం రాష్ట్రాలను అణచి వేసేందుకు చూస్తోందనేందుకు కర్ణాటక ఉదాహరణ.’ అన్నారు -
అసంపూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ
ద్వంద్వ నియంత్రణపై చర్చించని కౌన్సిల్ న్యూఢిల్లీ: ఈసారి జీఎస్టీ భేటీలోనూ పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణ(కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి నియంత్రణ) అంశంలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఆదివారం జరిగిన భేటీలో ఆ అంశంపై చర్చే సాగకపోవడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు అసాధ్యంగా భావిస్తున్నారు. నమూనా చట్టాలైన సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీల్లో 195 సెక్షన్లు ఉండగా... 99 సెక్షన్లు, కొన్ని క్లాజులపై భేటీలో సభ్యులు చర్చించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, వచ్చే సమావేశంలోగా నమూనా చట్టాలకు సంబంధించి తుది మార్పులు పూర్తవుతాయని అన్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో తదుపరి భేటీ ఉంటుందన్నారు. కేరళ, తమిళనాడు ఆర్థిక మంత్రులు మాట్లాడుతూ... గడువులోగా బిల్లు అమలు సాధ్యం కాదని, వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి రావచ్చని పేర్కొన్నారు.ద్వంద్వ నియంత్రణపై ఏకాభిప్రాయం రాకుండా జీఎస్టీ అమలు సాధ్యం కాదని తమిళనాడు మంత్రి పేర్కొన్నారు. -
కొలిక్కి రాని జీఎస్టీ చర్చలు
కోలకతా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో మంగళవారం జరిగిన భేటీ లో మరోసారి నిరాశ తప్పలేదు. వివాదస్పద బిల్లుపై ఏకాభిప్రాయం సాధనకు తంటాలు పడుతున్న జైట్లీ ఇవాల్టి సమావేశంలో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించ లేకపోయారు. జీఎస్టీ బిల్లు కు రాష్ట్రాల ఏకాభిప్రాయ సాధనలో భాగంగా 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జైట్లీ సమావేశమయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీపై చర్చించారు. అన్ని రాష్ట్రాలు వాస్తవంగా జిఎస్టీ బిల్లును బలపరిచాయనీ, తమిళనాడు రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని జైట్లీ అన్నారు. రాజ్యంగ సవరణలతోపాటుగా రాష్ట్రాల మౌలిక మద్దతు కూడా అవసరమన్నారు. మరికొన్ని పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మళ్లీ భేటీ కానున్నట్టు జైట్లీ ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన జైట్లీ జీఎస్ టీ బిల్లు ఆమోదంపై ఆశావహ దృక్పథంతో ముందుకుపోతామని ఏప్రిల్ 1 గడువుపై ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య విరోధం, హాని కలిగించని రీతిలో రూపొందించేందుకు వీలుగా నిపుణులతో చర్చిస్తామన్నారు. ఇది వచ్చే ఆర్థిక మంత్రుల సమావేశానికి దోహదపడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య శాంతియుతంగా , స్పష్టమైన విధానం రూపొందాలని జైట్లీ నొక్కి చెప్పారు. వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)కు తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీకి తమిళనాడు మద్దతు తెలపకుండా కొన్ని రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతోందని చెప్పారు. ఆ అంశాల్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటికే లోక్ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలోనూ ఈ బిల్లును పాస్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మరోవైపు సాధికారిక కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి,మిత్ మిత్రా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో కమిటీ సభ్యులు హాజరయ్యారని అమిత్ మిత్రా అన్నారు. మంత్రుల బాధ్యతాయుత పనితీరును కొనియాడారు. మళ్లీ ఈ సమావేశం జులై రెండో వారంలో ఉండొచ్చని అమిత్ తెలిపారు. 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఉన్న పాత పన్ను విధానాల్లో సంస్కరణల కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
సీఏలపై ఉన్న అపోహను తొలగించుకోవాలి
సఏలకు కేఎం మణి సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఉన్న పన్ను బకాయిలను తక్షణం చెల్లించడానికి తమ క్లయింట్లను చార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ) సంసిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్ కేఎం మణి శుక్రవారం పేర్కొన్నారు. పన్నులను ఎలా తప్పించుకోవాలో చెప్పడమే సీఏల పనని కొందరిలో అపోహ ఉందని ఆయన పేర్కొంటూ... ఈ అపోహను తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే (సీఏ)నని కూడా మణి పేర్కొన్నారు. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ), పరోక్ష పన్నులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పరోక్ష పన్నుల కమిటీ ఇక్కడ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మణి మాట్లాడుతూ, తమ సభ్యుల్లో నైతిక ప్రమాణాలు పటిష్ట స్థాయిలో ఉండేలా ఐసీఏఐ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. -
సీఎస్టీ చెల్లించాకే జీఎస్టీ
ఆర్థిక మంత్రులతో సదస్సులో తెలంగాణ మంత్రి ఈటల కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్, అభివృద్ధి నిధులపై చర్చ కేంద్ర వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2016 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మొదట రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు ఇస్తే భరోసా కలుగుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో బుధవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ అమలును స్వాగతిస్తోందని, అయితే పొగాకు ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎకై్సజ్, ప్యాడీ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తోనూ ఈటల సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఏపీభవన్ గురజాడ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు సీఎస్టీ బకాయి మొత్తం రూ.7,049 కోట్లు రావాల్సి ఉండగా, మొదటి విడతగా 2010-11 బకాయి రూ. 454.6 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ఈటల పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని మరో రెండు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, కేంద్ర పథకాల నిధుల్లో కోత విధించడంతో తెలంగాణకు ఏటా రావాల్సిన ఆదాయానికి రూ. 2,389 కోట్లమేర గండి పడిందన్నారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణకు ఈ ఏడాది కేంద్ర నుంచి వచ్చే నిధులు రూ. 4,622 కోట్లు తగ్గాయని పేర్కొన్నారు. పేదలను 1.91 కోట్లుగా గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం తెలంగాణలో పేదల సంఖ్య 1.91 కోట్లుగా గుర్తించారని, తెలంగాణలో పేదల సంఖ్య వాస్తవానికి 2.86 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ కేంద్ర నుంచి బియ్యం కోటా ఇవ్వాలని ఈటెల కేంద్ర మంత్రి పాశ్వాన్‌ను కోరారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం కోటా పెంచాలని, చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపకంలో అక్రమాలకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే రూ. 225 కోట్లు కేటాయించాలని, హమాలీ చార్జీలను పెంచాలని, పాత లెవీ విధానాన్ని అమలు చేసేలా పునరాలోచించాలని కోరారు. కేంద్ర సాయం అందేవరకు రాష్ట్ర నిధులు వాడుకోండి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి రాధామోహ న్సింగ్ సూచించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రిని బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచామని, అప్పటి వరకు ఆ నిధులను వాడుకోవాలని ఆయన సూచించారు. త్వరలో బిల్లు తెస్తాం: జైట్లీ జీఎస్టీపై బుధవారం రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ...త్వరలోనే పార్లమెం టులో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని, అందరికీ లాభదాయకమైన ఏకీకృత జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వీలుగా రెండు, మూడు రోజుల్లో రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీ మూలంగా తమకు వాటిల్లే ఆదాయ నష్టానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పరిహారమివ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరాయి. మహారాష్ట్ర, గుజ రాత్ లాంటి రాష్ట్రాలు జీఎస్టీపై అదనంగా 2 శాతం పన్ను వేసుకునేందుకు రాష్ట్రాలకు వీలుండాలని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రాలకు ఒక శాతం మాత్రమే అదనంగా పన్ను వేసుకునే అధికారం ఉంది.