ద్వంద్వ నియంత్రణపై చర్చించని కౌన్సిల్
న్యూఢిల్లీ: ఈసారి జీఎస్టీ భేటీలోనూ పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణ(కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి నియంత్రణ) అంశంలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఆదివారం జరిగిన భేటీలో ఆ అంశంపై చర్చే సాగకపోవడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు అసాధ్యంగా భావిస్తున్నారు. నమూనా చట్టాలైన సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీల్లో 195 సెక్షన్లు ఉండగా... 99 సెక్షన్లు, కొన్ని క్లాజులపై భేటీలో సభ్యులు చర్చించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, వచ్చే సమావేశంలోగా నమూనా చట్టాలకు సంబంధించి తుది మార్పులు పూర్తవుతాయని అన్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో తదుపరి భేటీ ఉంటుందన్నారు. కేరళ, తమిళనాడు ఆర్థిక మంత్రులు మాట్లాడుతూ... గడువులోగా బిల్లు అమలు సాధ్యం కాదని, వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి రావచ్చని పేర్కొన్నారు.ద్వంద్వ నియంత్రణపై ఏకాభిప్రాయం రాకుండా జీఎస్టీ అమలు సాధ్యం కాదని తమిళనాడు మంత్రి పేర్కొన్నారు.
అసంపూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ
Published Mon, Dec 12 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
Advertisement