న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్‌ఎస్‌బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం.
చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం...
కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్.
ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్‌ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment