central bank governors
-
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
మౌలిక రంగంపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవరోజు వర్చువల్ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది. -
‘సుప్రీం ఆదేశాల’పై ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ఏదైనా కేసులో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు తక్షణం అనర్హత వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షకు అవకాశంగల ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితుడైన ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకు కానీ, ఎమ్మెల్సీకి కానీ తక్షణమే అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు జూలై 10వ తేదీన తన తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చిన విషయమూ విదితమే. ఈ ఆదేశాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చట్టాన్ని సవరించే లక్ష్యంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం (రెండో సవరణ) బిల్లు, 2013ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేదు. దీంతో.. సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్వీర్యం చేస్తూ చట్ట సవరణ స్థానంలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇటీవల అవి నీతి, ఇతర నేరాలకు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ ఎంపీ రషీద్మసూద్ను విచారణ కోర్టు దోషిగా నిర్ధారించిన నేపధ్యంలో ఆయనకు అనర్హత వర్తించే అవకాశాలున్న నేపధ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను ముందుకు తేవటం విశేషం. ఈ కేసుకు సం బంధించి సీబీఐ కోర్టు వచ్చే నెలలో శిక్షను ఖరా రు చేసిన వెంటనే.. మసూద్‌కు అనర్హత వర్తించి, ఆయ న రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశముంది. ఆర్డినెన్స్ దొడ్డిదారి పద్ధతి కాదు: కాంగ్రెస్ దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులకు తక్షణం అనర్హత వర్తించకుండా ఉండేలా ఆర్డినెన్స్ తేవటం దొడ్డిదారి పద్ధతి కాదని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై విమర్శలను కొట్టివేసింది. ఆర్డినెన్స్ కూడా పార్లమెంటుకు వెళ్లాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ‘ఆర్డినెన్స్ అనేది అప్రజాస్వామిక పద్ధతి కాదు. అది దొడ్డిదారి పద్ధతి కాదు.దానికి పార్లమెంటు ఆమోదం అవసరం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ఆర్డినెన్స్ పార్లమెంటుకు వెళ్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.సి.చాకో ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘బొగ్గు’వేలం పద్ధతికి ఆమోదం బొగ్గు బ్లాకుల వేలానికి అనుసరించాల్సిన పద్ధతిని కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. దీని ప్రకారం పర్యావరణ శాఖ సమీక్షించిన తర్వాతే బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టడం జరుగుతుంది. వేలంలో పాల్గొనే బిడ్డర్లు కనీస పని కార్యక్రమానికి అంగీకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.