Margadarsi Chits Chartered Accountant Shravan Arrested - Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ అక్రమాల కేసులో కీలక అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Published Thu, Mar 30 2023 8:49 PM | Last Updated on Thu, Mar 30 2023 9:11 PM

Margadarsi Chits Chartered Accountant Shravan Arrested - Sakshi

సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసులో మార్గదర్శి చిట్స్ చార్టెడ్ అకౌంటెంట్ కూడరవల్లి శ్రవణ్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, మోసాలు, నిధుల మళ్లింపు కేసులో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ల్యాప్‌టాప్‌, పలు రికార్డులను సీఐడీ పోలీసులు సీజ్ చేశారు. మార్గదర్శి చిట్స్ ఆడిటింగ్ నిర్వహించే బ్రహ్మయ్య అండ్ కో లో అఫీషియల్ పార్టనర్‌గా కూడరవల్లి శ్రవణ్ ఉన్నారు.

విజయవాడ 3వ మెట్రో పొలిటన్ కోర్టు మేజిస్ట్రేట్.. శ్రవణ్‌కి 14 రోజులు రిమాండ్ విధించింది. మార్గదర్శి మోసాలపై సంచలన విషయాలను శ్రవణ్‌ బయటపెట్టారు. వందల కోట్లకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలను శ్రవణ్‌ వెల్లడించలేకపోయారు. మార్గదర్శి చిట్స్ బ్యాంక్ బ్యాలన్స్‌ల ఆడిటింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించినట్టు శ్రవణ్‌ అంగీకరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాల ఆడిటింగ్‌లో నిబంధనలు పాటించలేదని సీఐడీ వద్ద శ్రవణ్‌ అంగీకరించారు.
చదవండి: ‘అందులో ఈనాడు రామోజీరావు పాత్ర ఉంది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement