హైకోర్టుకు వై. శ్రీలక్ష్మి నివేదన
సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజు మంజూరు వ్యవహారంలో ఊహాజనిత అంశాల ఆధారంగానే అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసిందని ఆమె తరఫు న్యాయవాది వై. శ్రీనివాసమూర్తి తెలిపారు. సున్నపురాయి లీజు మంజూరులో ఆమె నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తనపై సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు విచారణ జరిపారు.
ఈ సందర్భంగా శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది శ్రీనివాసమూర్తి తన వాదనలు వినిపిస్తూ, కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే లీజు మంజూరు జరిగిందేగాని, ఇందులో శ్రీలక్ష్మి నిర్ణయాలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే లీజు మంజూరు జరిగిందని వివరించారు. ప్రాస్పెక్టివ్ లీజు మొదట జయ మినరల్స్‌కు ఇచ్చారని, తర్వాత అది ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ అయిందన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ ఆ తర్వాత దాల్మియా సిమెంట్స్‌లో విలీనం అయిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేశారు.
ఊహాజనిత అంశాలతోనే నాపై కేసు
Published Fri, Feb 3 2017 2:20 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
Advertisement