'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది' | woman swallowed a teeth set in kurnool | Sakshi
Sakshi News home page

'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది'

Published Sat, Jun 28 2014 10:52 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది' - Sakshi

'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది'

నంద్యాల : ఓ మహిళ భోజనం చేస్తూ అనుకోకుండా పెట్టుడు పళ్ల సెట్ను మింగేసింది. వైద్యులు చాకచక్యంగా సర్జరీ చేసి దానిని బయటకు తీశారు. పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి (45) గురువారం రాత్రి భోజనం చేస్తుండగా నోటిలో బిగించిన పళ్ల సెట్ను మింగేసింది. దీంతో బంధువులు ఆమెను హుటాహుటీనా గాంధీచౌక్లోని నెరవాటి హాస్పటల్లో చేర్పించారు.

వైద్యులు వినోద్ కుమార్, మధుసూదన్ రెడ్డి, అరుణకుమారి ఎండోస్కోప్ ద్వారా 30 నిమిషాల సేపు సర్జరీ నిర్వహించి ఎలాంటి కోత, కుట్టు లేకుండా పళ్లసెట్ను బయటకు తీశారు. ఈ సందర్భంగా వైద్యుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పళ్లసెట్ను మింగటం ద్వారా రోగికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నారు. కడుపులో పేగుకు పళ్లసెట్ తీగ తగిలి రంధ్రం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement