సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. స్మృతివనం పనులను శ్రీలక్ష్మి గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 18.81 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, పాదపీఠం ఎత్తు 85 అడుగులు అని, దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందన్నారు.
ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం అని తెలిపారు. స్మృతివనంలోని అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు.
ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండం
ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన అంబేడ్కర్ విగ్రహ ప్రారం¿ోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment