
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో బంధువుల దగ్గరికి వెళ్తుండగా రైలు దిగుతున్న సమయంలో కాలు జారి చిన్నారి రైలుకింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన పీ చంద్రారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు శ్రీలక్ష్మి (3) మహమ్మదాబాద్ ఎంజల్‌వ్యాలీ పాఠశాలలో నర్సరీ చదువుతోంది.
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చంద్రారెడ్డి అన్న ఇంటికి భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బుద్వేల్‌కు రైల్లో వెళ్లారు. రైలు దిగుతున్న సమయంలో చిన్నారి శ్రీలక్ష్మి ప్రమాదవశాత్తు జారి ట్రైన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కూతురు మృతి చెందడంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment