బుల్లితెర నటి శ్రీలక్ష్మి కనకాల (40) మృతి చెందారు. గత రెండేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. దివంగత దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కుమార్తె, నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి. శ్రీ పెద్ది రామారావు భార్య అయిన శ్రీలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు కూడా. కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment