నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్‌ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్‌బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్‌ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది.
ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్‌మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్‌కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్‌గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్‌లో ఎర్త్‌డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది.
(చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...)
Comments
Please login to add a commentAdd a comment