న్యూయార్క్: చాలామంది ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా వాటిని ఏదో విధంగా వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదే తరహాలో ఒకామె కొన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి పువ్వులను తయారు చేసింది. పైగా వాటిని తన ఇంటి టెర్రస్ పై నుంచి కింద వరకు ఒక సన్న జాజి తీగ లత మాదిరిగా పూలన్ని పరుచుకుంటూ కింద నేలవరకు ఉంటాయి. అది ఎంత ఆకర్షణీయంగా ఉండటమే మనం మన దృష్టిని మరల్చకుండా అలా చూస్తుండేపోయేలా అందంగా ఉంటాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగిందో చూద్దాం రండి.
(చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?)
అసలు విషయంలోకెళ్లితే...అమరికాకు చెందిన ఫియోనా అనే 53 ఏళ్ల మహిళ క్రిస్మస్ సందర్భంగా తన ఇంటిని అలంరకరించే నిమిత్తం తన ఇరుగు పొరుగు వారి దగ్గర్నుంచి బాటిల్స్ సేకరిస్తోంది. ఆ తర్వాత ఆమె బాటిల్స్ అడుగు భాగన కత్తిరించి యాక్రిటిక్ పేయింటింగ్‌తో పువ్వుల్లా తయారు చేస్తుంది. చూడటానికి గుండ్రని విత్తన గుళికలతో కూడిన గుల్మకాండ మొక్కలు మాదిరి గసగసాల పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి.
నిజానికి అవి నిజమైన పూవులు మాదిరిగా ఉంటాయి. ఈ మెరకు ఫియోనా ఈ క్రాఫ్ట్‌ని 2014లో వేవ్ డిస్ ప్లే ప్రేరణతో తయారు చేసినట్టు చెప్పింది.పైగా అవి 12 అడుగులు పొడవుతో తన ఇంటి మొదటి అంతస్థు కిటికి నుండి కింద నేల వరకు పరుచుకుని అందమైన పూల లతలా ఉంటుంది. ఈ విధంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పూలతో తన ఇంటిని మొత్తం అందంగా అలంకరించింది.
(చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం)
Comments
Please login to add a commentAdd a comment