craft
-
ఇండిగో ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా బిజినెస్, ఎగబడి ఆర్టర్డ్స్ వస్తున్నాయి
మనకు నచ్చిన రంగు రంగుల చాక్లెట్ రేపర్స్ నుంచి మనం ఇష్టపడే వారు ఇచ్చిన పువ్వులు, నెమలీకల వరకు ప్రతి చిన్న వస్తువును పుస్తకాల్లో అపురూపంగా దాచుకునేవాళ్లం. అప్పుడప్పుడు వాటిని చూసుకుని తెగ మురిసిపోయిన సందర్భాలు ఎన్నో. ఇవి కొన్నేళ్ల పాటు ఉన్నప్పటికీ తర్వాత ఆ పుస్తకాలను దాచుకునే ప్లేసు లేక వాటన్నింటిని కోల్పోయి బాధపడుతుంటాము. ‘‘ఇక ముందు మీరు దిగులు పడాల్సిన పనిలేదు. మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని రెజిన్ ఆర్ట్‌లో ఎప్పటికీ దాచుకోవచ్చు’’ అని చెబుతోంది 31 ఏళ్ల ఆకాంక్ష సెహగల్. గులాబీ రేకులను సైతం ఏళ్ల పాటు దాచుకునేలా అందమైన ఆకృతిలో రెజిన్ క్రాఫ్ట్స్‌ను రూపొందిస్తోంది. రెజిన్ ఆర్టిస్ట్ అయ్యేందుకు ఇండిగో ఉద్యోగాన్నే వదిలేసింది ఆకాంక్ష. నాగపూర్‌కు చెందిన ఆకాంక్ష సెహగల్ అనుకున్నది సాధించేవరకు కష్టపడుతుంది. ఆ మనస్తత్వమే ఆమెని రెజిన్ క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్‌గా మార్చింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తయ్యాక రేడియో మిర్చిలో సెలబ్రెటీ మేనేజర్‌గా చేరింది. ఎందుకో గానీ ఆ ఉద్యోగం ఆమెకు తృప్తినివ్వలేదు. దాంతో విమానంలో ఎగరాలని చిన్నప్పటినుంచి తాను కంటున్న కలలను నెరవేర్చుకునేందుకు విమానంలో ఉద్యోగం చేయాలనుకుంది. అందుకు తగ్గట్టుగా కష్టపడి ఇండిగోలో క్యాబిన్ క్రూ ఉద్యోగాన్ని సాధించింది. కల నిజమైనప్పటికీ... క్యాబిన్ క్రూగా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆకాంక్షకు క్రూగా కొంతకాలం మాత్రమే పనిచేస్తామని ఆ తరువాత పేపర్ వర్క్ పనిచేయాల్సి ఉంటుంది అని తెలిసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఆవిరైంది. కొంతకాలం పనిచేసిన తరువాత నేను క్రూ గా ఉండలేను. పేపర్ వర్క్ చేయడం ఇష్టం లేదు. దీంతో తనకు నచ్చిన, ఎప్పటికీ ఉండే వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుని మళ్లీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒకపక్క క్యాబిన్ క్రూగా బాధ్యతలు నిర్వహిస్తూనే తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. యునిక్ రెజిన్ క్రియేషన్స్.. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌పై మక్కువ ఉన్న ఆకాంక్ష.. తనకి కాబోయే భర్తకు రెజిన్ క్రాఫ్ట్ తయారు చేసి బహుమతిగా ఇచ్చింది. అది చూసిన ఆకాంక్ష కాబోయే భర్త చాలా బావుంది. రెజిన్ క్రాఫ్ట్స్ తయారీలో నీకు మంచి నైపుణ్యం ఉంది. క్రాఫ్ట్స్ కోర్సు చెయ్యి అని ప్రోత్సహించాడు. దీంతో ఇండిగోలో ఉద్యోగం చేస్తూనే చిన్నచిన్న రెజిన్ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా తయారు చేసేందుకు ఇండిగో ఉద్యోగాన్ని వదిలేసి యూనిక్ రెజిన్ క్రియేషన్స్ పేరిట బ్రాండ్‌ను ప్రారంభించింది. తడిసినా పాడవకుండా ఉండే రెజిన్ పదార్థానికి రంగులు జోడించి అందమైన ఆకృతుల్లో ప్రత్యేకంగా ఉండే గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ కుటుంబం సహాయంతో తన బ్రాండ్‌ను చక్కగా నిర్వహిస్తోంది ఆకాంక్ష. మరింత ప్రత్యేకంగా... మిగతా బహుమతులకంటే రెజిన్క్రాఫ్ట్స్ ద్వారా అపురూప జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. పెళ్లిదండలు, ఇష్టమైన వారు ఇచ్చిన పూలు, వాటి తాలుకా రేకులు, పుష్పగుచ్ఛాలు, శిశువు బొడ్డు తాడు వంటి వాటిని మరింత ప్రత్యేకంగా దాచుకునేలా రూపొందిస్తోంది. ఈ క్రాఫ్ట్స్ ఆకర్షణీయంగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి మరీ ఆర్డర్లు ఇస్తున్నారు ఆకాంక్షకు ఇంత చిన్నవయసులో రెండు ఉద్యోగాలను అవలీలగా సాధించి, తనని తాను నిరూపించుకుంది. చివరికి తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తూ రెజిన్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్‌గా మారి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
10 పాసైతే చాలు కోర్సులో చేరిపోవచ్చు.. అదిరేటి రుచులతో ఆదాయం మీ సొంతం
వంట చేయడం గొప్ప కళ. ఆ కళను ఉపాధి మార్చుకుని అదిరేటి రుచులు అందించే వారే ఆధునిక నలభీములు. ఆతిథ్య రంగంలో చెఫ్‌లకు అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికత, కొత్త ఆవిష్కరణలతో రాణిస్తే.. కాకా హోటల్ నుంచి కార్పొరేట్ కిచెన్ వరకు విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. పాకశాస్త్రంలో సిద్ధహస్తులను తయారు చేస్తున్న సంస్థలెన్నో ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఒక్కటే ఉంది. అదే విశాఖలో నిర్వహిస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. ఈ నలభీముల తయారీ సంస్థకు 35 ఏళ్లు పూర్తయింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో దేశ, విదేశాల్లో చెఫ్‌లుగా రాణిస్తూ.. ఆహా అనిపించే కమ్మని రుచులను అందిస్తున్నారు. విశాఖపట్నం: నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని రూరల్ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. అతి తక్కువ ఫీజుతో ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్కు 35 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఏకైక ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కనీస అర్హత 10వ తరగతి ఈ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కనీస అర్హత పదో తరగతి. 25 ఏళ్లు లోపు ఉండాలి. దీన్ని ఈ ఏడాది నుంచి 30 ఏళ్లకు పెంచాలని వినతులు వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కోర్సు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇక్కడ మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన ల్యాబ్ (ప్రయోగశాల)ను ఇటీవల ఆధునికీకరించారు. ప్రైవేట్ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లకు దీటుగా ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని రకాలైన వంటకాల్లోనూ తరీ్ఫదు ఇచ్చి వారితోనే తయారు చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు తయారు చేస్తున్న వంటకాలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఎప్పటికప్పుడు రుచులు చూసి.. మరింత మెరుగు కోసం సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ అందించే కోర్సులివే.. ప్రస్తుతం ఇక్కడ ఫుడ్ ప్రొడెక్షన్ అండ్ పెటిసరీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, ఫుడ్ సరీ్వస్ ఆపరేషన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఏడాదిన్నర కాల వ్యవధి గల కోర్సులు. ఏడాది పాటు థియరీ, ఆరు నెలల పాటు ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా నగరంలో స్టార్ హోటళ్లలో ఇండ్రస్టియల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. ఇక్కడ ప్రయోగశాలలో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడ విశాలమైన వంట గది(ప్రయోగశాల) ఉంది. ఇందులో శిక్షణ పొందే వారికి వివిధ రకాల వంటకాలు తయారు చేయడంలో తరీ్ఫదు ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ వంటకాలు, దక్షిణ, ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి వంటకాలు చేయడం నేర్పుతారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు నగరంతో పాటు వివిధ ముఖ్య పట్టణాలు, దేశ విదేశాల్లోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య రంగంలో ఉపాధి పొందుతున్నారు. షిప్‌ల్లో కూడా పనిచేస్తున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ.. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి ఇక్కడ తక్కువ ఫీజుతో కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇదొక్కటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. అందుకే ఇక్కడ కోర్సులకు డిమాండ్ ఉంది. 10 తరగతి చదువుకుని 25 ఏళ్ల వయసు లోపు వారికి ప్రవేశాలు కలి్పస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి విదేశాల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే 25 ఏళ్లు దాటిన వారు కూడా శిక్షణ కావాలని కోరుతున్నారు. కనీస అర్హత 30 ఏళ్లకు పొడిగిస్తే మరింత మంది శిక్షణ తీసుకుని అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభిస్తాం. ప్రవేశాలు పొందాలనుకునే వారు నేరుగా వచ్చి ఇన్స్టిట్యూట్లో సంప్రదించవచ్చు. – రవి, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ -
చేనేతకు బ్రాండింగ్
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ పెంచేందుకు ప్రభుత్వ రంగ సంస్థ.. ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణిలతో కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు మంగళవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ అతిపెద్ద ఉపాధి రంగంగా ఉందన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పని కల్పిస్తూ జీవనోపాధికి తోడ్పడుతోందన్నారు. అయితే తగిన ప్రచారం లేక ఇబ్బంది ఎదుర్కొంటోందని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు ఆప్కో.. ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్‌తో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకుందన్నారు. ఆప్కో ఎండీ నాగరాణి మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యా సంస్థలతోపాటు ఇతర సంస్థల్లో అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ సహకరిస్తుందన్నారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన డిజైన్లకు రూపకల్పన చేస్తామని తెలిపారు. -
పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!
న్యూయార్క్: చాలామంది ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా వాటిని ఏదో విధంగా వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదే తరహాలో ఒకామె కొన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి పువ్వులను తయారు చేసింది. పైగా వాటిని తన ఇంటి టెర్రస్ పై నుంచి కింద వరకు ఒక సన్న జాజి తీగ లత మాదిరిగా పూలన్ని పరుచుకుంటూ కింద నేలవరకు ఉంటాయి. అది ఎంత ఆకర్షణీయంగా ఉండటమే మనం మన దృష్టిని మరల్చకుండా అలా చూస్తుండేపోయేలా అందంగా ఉంటాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...అమరికాకు చెందిన ఫియోనా అనే 53 ఏళ్ల మహిళ క్రిస్మస్ సందర్భంగా తన ఇంటిని అలంరకరించే నిమిత్తం తన ఇరుగు పొరుగు వారి దగ్గర్నుంచి బాటిల్స్ సేకరిస్తోంది. ఆ తర్వాత ఆమె బాటిల్స్ అడుగు భాగన కత్తిరించి యాక్రిటిక్ పేయింటింగ్‌తో పువ్వుల్లా తయారు చేస్తుంది. చూడటానికి గుండ్రని విత్తన గుళికలతో కూడిన గుల్మకాండ మొక్కలు మాదిరి గసగసాల పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. నిజానికి అవి నిజమైన పూవులు మాదిరిగా ఉంటాయి. ఈ మెరకు ఫియోనా ఈ క్రాఫ్ట్‌ని 2014లో వేవ్ డిస్ ప్లే ప్రేరణతో తయారు చేసినట్టు చెప్పింది.పైగా అవి 12 అడుగులు పొడవుతో తన ఇంటి మొదటి అంతస్థు కిటికి నుండి కింద నేల వరకు పరుచుకుని అందమైన పూల లతలా ఉంటుంది. ఈ విధంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పూలతో తన ఇంటిని మొత్తం అందంగా అలంకరించింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
Quilt Craft: పాత బట్టలను జ్ఞాపకాల బొంతలుగా మార్చిన తోబుట్టువులు...
నేటి తరానికి క్విల్ట్గా పరిచయమైన నిన్నటి తరం బొంతను జ్ఞాపకాల పుంతలా అందిస్తున్నవారిని గుర్తించింది ఢిల్లీ ఎన్‌సిఆర్. అంతేకాదు, ఈ అందమైన కళను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీతో పాటు అక్కడి చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే ఎన్‌సిఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) ఇటీవల పాత బట్టలతో కొత్తగా రూపొందించే రెండు క్విల్ట్ (బొంతల తయారీ) క్రాఫ్ట్ వెంచర్లను గుర్తించి, ఈ తయారీకి సపోర్ట్‌గా నిలిచింది. మెమరీ క్విల్ట్‌లుగా గతకాలపు జ్ఞాపకాలతో నిండిన పెట్టెలుగా మనల్ని హత్తుకునేలా తీర్చిదిద్దుతున్నారు వీటి రూపకర్తలైన మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్. నలభై ఏళ్ల మనీషా దేశాయ్, నలభై మూడేళ్ల ఆయేషా దేశాయ్‌లు తోబుట్టువులు. ఇద్దరూ గురుగ్రామ్‌లోని గార్డెన్ ఎస్టేట్‌లో ఉంటున్నారు. వారి ట్రంక్ పెట్టెల నిండా గత కాలంలో ఉపయోగించిన అత్యుత్తమ దుస్తులు దొంతర్లుగా ఉంటాయి. మనీషా మాట్లాడుతూ ‘నేను పూణెలో ఉన్నప్పుడు 2016లో కర్ణాటక బెల్గాంలో ఉన్న మా పుట్టింటికి వచ్చాను. మా చిన్ననాటి నుంచి మేం వాడిన పాతబట్టలతో నిండిన పెద్ద ట్రంకు పెట్టె ఉంది. ఆ డ్రెస్సులన్నీ తీసేస్తానన్నప్పుడు మా అమ్మ పెద్ద గొడవ చేసింది. వాటిని ఏదైనా చేయాలనుకుంటే కూతుళ్లు అని కూడా చూడనని బెదిరించింది. ఎంత చెప్పినా తను వినలేదు. మా ఇంట్లో అందరం కూర్చొని వాటిని ఏం చేయాలో చర్చించుకున్నాం’ అని తమ క్రాఫ్ట్స్ తయారీ మూలం గురించి వివరించింది మనీషా. గతంలో తాము ధరించిన దుస్తులకు మరింత ప్రత్యేకత జత చేయాలనే ఉద్దేశ్యంతో ఓ కుట్టు మిషన్‌ని కొని, కొన్ని బట్టలను ఎంచుకొని, వాటిలోని నాణ్యమైన భాగాలను ఎంపిక చేసుకుంటూ ఓ బొంతను కుట్టాం. అది చూసి అమ్మ ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ బాగా నచ్చింది. అడిగారు అని మా స్నేహితుల కోసం కొన్ని బొంతలు కుట్టి ఇచ్చాం’ అని తెలిపిన ఈ సోదరీమణులు ఆ మరుసటి ఏడాది ఎంతగా అంటే, ఇదే కాన్సెప్ట్‌తో ‘కార్నోకోపియా’ అనే పేరుతో ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. గతం ఇచ్చిన కానుకగా జత కట్టి ‘చాలా మంది తమ పాత బట్టలను వదులుకోవడానికి ఇష్టపడరు. వాటితో వారికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తమ కుటుంబసభ్యులు ప్రేమగా ఇచ్చినవి, ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేసినవి, తమకు తాముగా కుట్లు అల్లికలు చేసుకున్నవి.. ఇలా వాడిన దుస్తుల జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ జ్ఞాపకం దూరం చేసుకున్నట్టే అని భావిస్తారు. అలాగే ఉంచేయాలనుకుంటే వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ‘థీమ్ ఆధారిత ఎంబ్రాయిడరీ బొంతల’ను నాలుగేళ్ల క్రితం నుంచి తయారుచేయడం మొదలుపెట్టాం. ‘మెమరీ క్విల్ట్’లుగా పిల్లల పాత బట్టల నుండి ప్యాచ్‌లను తయారుచేయడం ప్రారంభించాం. టీ షర్టుల నుంచి ప్యాంటు వరకు అన్నీ వీటిల్లో ఉపయోగించాం. కొన్ని సమయాల్లో షాపుల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలు కూడా సేకరించాం. గురుగ్రామ్ గార్డెన్ ఎస్టేట్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఢిల్లీ–ఎన్‌సిఆర్ పాల్గొంది. నివాసితులకు ఇవ్వడానికి కొన్ని బొంతలను తయారుచేయించింది. 4 అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఉండే మెత్తని బొంత రూ.7,500 ఉంటుంది. బొంత పరిమాణాన్ని బట్టి ధర పెరుగుతుంది’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. అంతే కాదు పాత వస్త్రాలను, క్లాత్ ముక్కలను నూలుగా మార్చడం, వీటి నుండే దారాలు తీయడంతో పాటు ప్యాకేజీకి పనికివచ్చే బ్యాగులను కూడా తయారుచేస్తారు ఈ అక్కాచెల్లెళ్లు. జ్ఞాపకాలకే డిమాండ్ ‘ఫ్యాబ్రిక్ వ్యర్థాల నుండి తయారుచేసిన క్విల్ట్‌ల కంటే మెమరీ క్విల్ట్లకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత ఈ తరహా మెత్తని బొంతల తయారీకి ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. జ్ఞాపకాలకు న్యాయం చేయడం అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. కానీ, కుటుంబాలు తమ జీవితాంతం ఉపయోగించుకునేలా మనపై నమ్మకం ఉంచినప్పుడు దానినే గౌరవంగా భావిస్తున్నాం. చంటిపాప అయినా, జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ, తాతయ్య అయినా వారు చెప్పే అందమైన కథలో మేమూ భాగం అవుతున్నాం. ఆ జ్ఞాపకాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు ఈ తోబుట్టువులు. మనసు లోతులను తడమాలే కానీ ఇలాంటి ఎన్నో మధురానుభూతులను మిగిల్చే కళలు లోకంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటాయి. వీరి కళ నచ్చితే ఎవరైనా ఓ ప్రయత్నంతో ఈ జ్ఞాపకాల బొంతను సొంతంగా తయారుచేసుకోవచ్చు. బిడ్డలను కథలా అల్లుకుపోయేలా.. ఫరీదాబాద్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ రాశీ మాలిక్ తన సోదరి కోసం మొట్టమొదటి జ్ఞాపకాల బొంతను సృష్టించినట్టు గుర్తుచేసుకుంది. ‘మా అక్క లండన్‌లో ఉంది. ఆమె బిడ్డ కోసం తన దుస్తులను ఉపయోగించి, ఒక అందమైన మందపాటి దుప్పటిని రూపొందించాను. అది ఎంత అందంగా అంటే, కొన్ని కథలు రోజూ కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉంటాయి. హృదయానికి హత్తుకున్న దృశ్యమవుతుంది. మా అక్క ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేను’ అని తన మొదటి జ్ఞాపకాల క్విల్ట్ రూపకల్పన గురించి వివరిస్తుంది రాశీ. ‘మామ్–ఎంటోస్’ పేరుతో క్విల్ట్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి, బేబీ క్విల్ట్‌లను సృష్టిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా తన వెంచర్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు తన వెంచర్ నుంచి పాత దుస్తులను ఉపయోగిస్తూ కుషన్లు, దిండు కవర్లు, బొమ్మలను కూడా తయారుచేస్తోంది. దుప్పట్లు, బొంతలు జ్ఞాపకాలను ఎలా స్పర్శిస్తాయో చెబుతూ ‘మంచం మీద పొరలుగా ఉన్నప్పడు చిన్ననాటి కథలు, మధురమైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ప్రదర్శిస్తాయి. పిల్లలకి వారు పెద్దయ్యాక తమ బాల్యం గురించి తెలుసుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. పెద్దలకు కానుక ఇస్తే.. పిల్లలు తల్లిదండ్రులకు తమ డిగ్రీపట్టాను కానుక ఇచ్చినంత సంబరాన్నిస్తుంది’ అని చెబుతుంది రాశీ మాలిక్. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
క్రాప్ట్ అండ్ ఆర్ట్ ఉద్యోగులకు భరోసా కల్పించిన వైఎస్ జగన్
-
‘రైతాంగాన్ని ఆదుకోవాలి’
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. ఆదుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలో దెబ్బతిన్న వరి చేనును సోమవారం ఆయన పరిశీలించారు. మండలంలోని బాలాజీనగర్, అంగడిపేట గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను రైతులతో కలిసి కలియతిరిగారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని వారికి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే కనీసం సీఎం కేసీఆర్ స్పందించలేదని పేర్కొన్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు చెప్పుకోవడం తప్పితే రైతులకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో మహారాష్ట్ర తరహా ఉద్యమం చేస్తా మని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టిం చి పంట పండించిన అన్నదాతపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూ డడం తగదన్నారు. రాబోయేది కాంగ్రెస్ పాలన అని కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు జగన్‌లాల్‌నాయక్,బిల్యానాయక్, కిషన్‌నాయక్, వడ్లపల్లి చంద్రారెడ్డి, కర్నాటి రవికుమార్, కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
హస్తకళలను కాపాడుకోవాలి
హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఏడీ మురళీకృష్ణ కరీమాబాద్ : ఎంతో విలువైన భారతీయ హస్తకళలను కాపాడుకోవాలని హ్యండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఏడీ కే.ఆర్ మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం నగరంలోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో కంచే నర్సింగరావు అధ్యక్షతన ‘పెహచాన్ ఆర్టిజన్ ఎన్ రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ఎన్ రోల్ చేయించుకున్న హస్త కళాకారులకు ఐడీ కార్డు ఇస్తారని, ఎల్ఐసీ సదుపాయం, ముద్రా లోన్ లభిస్తాయన్నారు. అలాగే ఇందులోని సభ్యులకు మరింత శిక్షణతో పాటు తగిన వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, మేనేజర్ కమలాకర్, మల్లికార్జున్ , దస్తగిరి, నర్సింహాచారి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, వీరబ్రహ్మం, రవి పాల్గొన్నారు. -
రైతాంగానికి రాయితీల వర్షం
సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ శాఖ నేరడిగొండ : అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీల వర్షం కురిపిస్తోంది. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంకల్పించుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక పరికరాల ఉపయోగంతో అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ ఉద్ధేశ్యం. దీని కోసం చిన్న సన్నకారు రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీ పైన యంత్రాలు, యంత్రసామగ్రిని అందజేస్తోంది. రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. రాయితీపై ఇప్పటికే ఎరువులు, విత్తనాలు డ్రిప్, స్పింక్లర్లు, పురుగుల మందులు, రసాయన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ఇలా ఎన్నో అందిస్తోంది. వర్షాలు మోస్తారుగా పడిన నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. పనులు మొదలు పెట్టి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాయితీలతో యంత్ర పరికరాలు అందజేస్తోంది. ఈ వివరాలను వ్యవసాయధికారి సురేఖ రైతులకు వివరించారు. రోటవేటర్ దీనిని మెట్ట నేలల్లో దుక్కి దున్నడానికి, మాగాణిలో దమ్ముచేయడానికి ఉపయోగిస్తారు. ట్రాక్టరుకు అమర్చి రోజుకు ఆరు నుంచి ఏడు ఎకరాల్లో దుక్కి దమ్ము చేసుకోవచ్చు. పెసర, మినుము, మొక్కజొన్న పంట చేతికి వచ్చాక ఎండిపోయిన మొక్కలను రోటవేటరుతో దున్నడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారి నేలలో కలిసి తిరిగి సారవంతమవుతాయి. దీన్ని 50 శాతం రాయితీపై వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తారు. విలువ సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మినీ ట్రాక్టర్.. మినీ ట్రాక్టర్లు 15 హెచ్‌పీ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతుల కోసం తయారు చేశారు. ఈ ట్రాక్టర్‌తో రోటోవేటర్, కేజీవీల్స్, కల్టివేటర్, నాగళ్లు అమర్చడానికి వీలుగా ఉంటుంది. ఎరువులు, పంట ఉత్పత్తులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని విలువ రూ.3 లక్షలు ఉండగా ప్రభుత్వం రూ.లక్ష రాయితీ కల్పిస్తోంది. కలుపు తీసే యంత్రాలు పెట్రోల్, డీజీల్‌తో పనిచేసే కలుపుతీసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. 4హెచ్‌పీ నుంచి 6హెచ్‌పీ వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్ర సహాయంతో కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా తగ్గుతుంది. పత్తి, మిరుప పంటలో కలుపు తీయడానికి దాన్ని బ్లేడ్లను సర్దుబాటు చేసి ఉపయోగించుకోవచ్చు. దీని విలువ రూ.70వేల నుంచి 80 వేల రూపాయలు ఉండగా ప్రభుత్వం దీనిని 50 శాతం రాయితీ పై అందజేస్తోంది. ఫోర్‌వీల్ డ్రై వ్ ట్రాక్టర్ కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్లడంతో రోడ్లు §ð బ్బతింటాయి. ఫోర్‌వీల్ డ్రై వ్, ట్రాక్టర్ చక్రాలకే కేజీవీల్స్ అమర్చి ఉంటాయి. దీంతో అవి రోడ్లపై వెళ్లినా కూడా రోడ్డుకు ఏమాత్రం నష్టం జరగదు. కేజీవీల్స్‌తో పొలాలు దమ్ము చేసినప్పుడు బ్లేడు కింద నుంచి పైకి రావడం వల్ల పంట దిగుబడి కూడా తగ్గుతుంది. కానీ, ఫోర్‌వీల్ డ్రై వ్ ట్రాక్టర్ వల్ల ఆ ఇబ్బంది ఉండదు. దీని విలువ రూ. 5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం రైతులకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు అందజేస్తోంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మొక్కజొన్న నూర్పిడి యంత్రం ఎండిన మొక్కజొన్న కంకులపై పొట్టును తొలగించి యంత్రంలో వేస్తే గింజను మార్పింగ్ చేసి శుభ్రం చేస్తోంది. ట్రాక్టర్‌కు జత చేయడం వల్ల ఈ యంత్రం పని చేస్తుంది. ఈ యంత్రంపై ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పిస్తొంది. దీనివిలువ రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది. మొబైల్ వరి విత్తన ప్రాసెసింగ్ యూనిట్ రైతులు విత్తనాలు పండించి తిరిగి రైతులకు విక్రయించడానికి ఉపయోగపడుతుంది. గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా అందించే విత్తనాలను రైతులు సాగు చేసి పండిన పంటను ఈ యంత్రం ద్వారా ప్రాసెసింగ్ చేయడం ద్వారా నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి. ఈ యంత్రం 90 శాతం రాయితీపై లభిస్తోంది. పవర్ ట్రిల్లర్ సన్న, చిన్నకారు రైతులు పొలాలు దమ్ము చేసుకోవడానికి, ఎరువులు, పంట ఉత్పత్తులు రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యంత్రం సహాయంతో రోజుకు 4 నుంచి 5 ఎకరాల పొలాన్ని దమ్ము చేసుకొవచ్చు. ఈ యంత్రాన్ని ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తోంది. దీని విలువ రూ.1.60 లక్షలు ఉండగా రూ.80 వేల రాయితీ అందిస్తోంది. తైవాన్ స్ప్రేయర్ పురుగులు, శిలీంధ్ర నాశక మందులను నివారించడానికి ఉపయోగపడుతుంది. పెట్రోలుతో పనిచేసే ఈ యంత్రం తక్కువ బరువుంటుంది. గంటలో 4 ఎకరాల్లో పురుగుమందును దీంతో పిచికారీ చేయవచ్చు. దీనివిలువ రూ.20 వేల వరకు ఉండగా ప్రభుత్వం 50 శాతం రాయితీతో అందిస్తోంది. ఇంకా ఎరువులు, విత్తనాలు వేసే పరికరాలు, తుంపర సేద్యం పరికరాలు, డ్రమ్‌సీడర్, విత్తనశుద్ధి పరికరాలు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు సబ్సిడీని వినియోగించుకోవాలి ప్రభుత్వం అందజేస్తున్న యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధ్యమే. – ఈ.సురేఖ, ఏడీఏ, బోథ్ -
వృత్తి విద్యకోసం ఉద్యోగాలొదిలేస్తున్నారు!
ఇప్పటిదాకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలకోసం పోటీపడ్డ యువత... ఇటీవల కార్యాలయాల్లో కూర్చొని చేసే మూస ఉద్యోగాలను వదిలేసి మరీ... వృత్తి విద్యను నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. దాదాపు పదిలో ఎనిమిది మంది వృత్తి విద్యను నేర్చుకుంటున్నారని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. డబ్బు ముఖ్యం కాదని, యువత వృత్తి విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారని బాల్వెనీ విస్కీ అందించిన నివేదికల్లో వెల్లడైంది. ఉద్యోగాలను వదిలేసి మరీ వృత్తి విద్యను నేర్చుకునేందుకు నేటి యువత ఇష్టం చూపిస్తున్నారని బాల్వెనీ విస్కీ తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ చదువులను, ఉద్యోగాలను వదిలిపెట్టి 77శాతం మంది ప్రజలు ప్రాచీన కళలు, వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అభివృద్ధి విషయంలో క్రాఫ్ట్ భారీ సమయం తీసుకుంటుందన్న అపోహలను వదిలి, నిజానిజాలను నిర్థారించుకొంటున్నారు. పదివేలమందిపై చేసిన సర్వేలో ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, కుండల తయారీ వంటి వృత్తులు అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే వృత్తి విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలపాలని ప్రశ్నించినపుడు మాత్రం... అదో ప్రతిభావంతమైన విద్య అని, చికిత్సా పద్ధతిగా కూడ పని చేస్తుందని, కార్యాలయాల్లో కూర్చొని పనిచేసే సాధారణ ఉద్యోగాల కంటే.. వృత్తి విద్య ఒత్తిడిని సైతం నివారిస్తుందని కనుగొన్నట్లు తెలిపారు. దీనికి తోడు చెఫ్, జ్యువెలరీ డిజైన్, తోటపని వంటి ఇతర కళాత్మక విద్యలు కూడ జాబితాలో అత్యధికంగా నిలుస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కళాత్మక వృత్తుల్లోకి అడుగిడిన యువత... వారి జీవితంలో పూర్తిశాతం గాని, కనీసం సగభాగమైనా వృత్తి కళలు నేర్చుకునేందుకు సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో ఫొటోగ్రఫి 12 శాతం, ఛెఫ్, బేకింగ్ 7 శాతం, సంగీతం 6 శాతం, గార్డెనింగ్ కు 3 శాతం, ప్రాధాన్యత పెరిగిందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఎక్కువశాతం సెక్యూరిటీ అటెండెంట్స్, ఐటి కన్సల్టెంట్స్, అకౌంటెంట్లు తమ ఉద్యోగాలను వదిలి వృత్తి విద్యల్లో చేరుతున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. .బాల్వెనీ విస్కీ సిరీస్ లో భాగంగా కళాకారుడు డిన్నర్ రూపొందించిన లఘు చిత్రం ప్రారంభం సందర్భంగా ఈ కొత్త విషయాలను వెల్లడించారు. -
ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం?
గత ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ట్, క్రాఫ్ట్ విద్యను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. తద్వారా విద్యార్థులు కళా, వృత్తి నైపుణ్యాలకు దూరమయ్యారు. వీరి వృత్తి కౌశల్యాన్ని ప్రోత్సహించక పోవడం వల్ల సుమారు లక్ష మంది అర్హతలు న్నప్పటికీ నిరుద్యోగులుగా వీధుల్లో పడ్డారు. మూడు దశాబ్దా లకు పూర్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ డ్రాయింగ్, లలితక ళలు, మ్యూజిక్, టైలరింగ్, కుట్లు, అల్లికలు, మెకానిజం, ఎలక్ట్రీ షియన్ మొదలగు నైపుణ్యతలను నేర్పించేవారు. తద్వారా ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులు సైతం తమ కాళ్లపై తామే నిలబడేవారు. ప్రతీ డీఎస్సీ ద్వారా ఖాళీలను పూర్తి చేసేవారు. కానీ మూడు దశాబ్దాలుగా ఖాళీ స్థానాలను ఖాళీ గానే చూపుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికి ప్రతీ సంవత్సరం లోయర్, హయ్యర్ పరీక్షలు నిర్వహించి ప్రతీ వేసవిలో టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ) నిర్వహిస్తున్నారు. ఈ సర్టిఫికెట్లు ఉన్నప్పటికి ఏమాత్రం ఉపయోగంలో ఉండవు. ఉపాధి మార్గాన్ని చూపించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలు ఏనాడు చేయలేదు. ముప్ఫై ఏళ్లుగా శిక్షణ పొందిన ఏ ఒక్కరికి ఈ సర్టిఫికెట్ ద్వారా ఏ లాభం జరుగలేదు. విద్యాహక్కు చట్టం మార్గదర్శకాలను కూడా పట్టించుకో వడం లేదు. 2009లో చట్టం అమలులోకి వస్తే విద్యార్థులకు కళా, వృత్తి విద్యలను అందించేందుకు నేటికీ జాప్యం కొనసాగు తోంది. 2012 చివరలో తెలంగాణలో కేవలం 1,500 మందిని కూడా నియమించలేదు. 5 వేలకు పైచిలుకు పాఠశాలల్లో నియామకాలు చేయాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు సర్వశిక్షా అభియాన్ పథకం ప్రవేశపెట్టారు. విద్యాహక్కు చట్టం అమలులో రాష్ట్రానికో పద్ధతి, జిల్లాకో పద్ధతి కొనసాగుతోంది. 2010 నుంచే ఇతర రాష్ట్రాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించారు. వారికి వేతనాలు సరిపడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో ఒక్కపూట మాత్రమే పనులు చేస్తుంటే తెలంగాణలో రోజంతా బడిలోనే ఉండాలి, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో జిల్లాకో పద్ధతి అనుసరిస్తున్నారు. ఇచ్చిన ఉద్యోగాలనే ఏడాదికోసారి ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో టర్మినేట్ లెటర్ ఇచ్చి ఎలక్షన్లలో బడిబాట కార్యక్రమాల్లో ఇతర పనులు చేయించుకుంటారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కాకుండా రీ ఎంగేజ్ మాత్రం జిల్లాకో పద్ధతిని అనుసరిస్తారు. నిజామాబాద్ జిల్లాలో జూన్ 15 నుంచి, కరీంనగర్ జిల్లాలో జూన్ 20 నుంచి, కొన్ని జిల్లాల్లో ఆగస్టులో రీ ఎంగేజ్ చేశారు. వేతనాలను ఇవ్వడంలోనూ తీవ్ర జాప్యం చేశారు. ఏ ఒక్క జిల్లాలో కూడా సక్రమంగా వేతనాలు వేయరు. టీఎస్ఎస్లోనే పని చేసే ఇతర విభాగాల ఉద్యోగులకు మాత్రం క్రమం తప్పకుండా వేతనాలు అంద జేస్తారు. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఉద్యోగి సొంత ఖాతాల్లో వేతనాలు వేస్తే నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యాకమిటీ అకౌంట్లో వేతనాలు వేశారు. మరికొన్ని జిల్లాల్లో ఇంకా వేతనాలే వేయలేదు. పండుగ సంబరాలను కూడా జరుపుకోని దుస్థితి కొనసాగింది. విభజనానంతరం ఏపీలో కూడా ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల పరిస్థితి మెరుగ్గాలేదన్నది వాస్తవం. తెలంగాణ సర్వశిక్షా అభియాన్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఇతర ఉద్యోగులకన్నా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యాబోధన చేస్తున్న టీచర్లకు అతి తక్కువ వేతనాలు అందజేస్తారు. పాఠశాలల్లో తోటి ఉపాధ్యాయులతో సమాన పనులు చేసినప్పటికి ఒక్క రోజుకు రెండు వందల రూపాయల చొప్పున కూలీ రేటు కట్టి ఇస్తారు. పేరుకు పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లుగా నియామకం చేపట్టి కాలాంశాలను పెంచాలని జీవోలు జారీచేశారు. బోధనా సామ గ్రిని కూడా సొంత ఖర్చులతో భరించాలి. పాఠ్యపుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చెప్పేది. తోటి ఉపాధ్యాయులతో సమానంగా బోధన చేస్తుంటే పార్ట్‌టైం పేరుతో, అగౌరవ వేతనంతో అవమానించడం ఎంతవరకు సమంజసం. వేసవిలో ఏప్రిల్ 23న టర్మినేట్ లెటర్ ఇచ్చి, కొందరిని జూన్ 20, మరి కొందరిని ఆగస్టులో నియామకం చేశారు. ఇదేనా విద్యాహక్కు చట్టం అమలు చేయడమంటే. విద్యార్థులను తమకాళ్లపై తామే నిలబడే ఆత్మస్థయిర్యాన్ని నింపగలిగే ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు, విద్యార్థి దశలోనే సృజనాత్మకశక్తి వెలికితీసి కళాకారులుగా, వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దగలిగే విద్యను ఇతర పాఠ్యాంశాలతో పాటు ఎందుకు నేర్పించకూ డదు. విద్యాహక్కు చట్టం జాతీయ స్థాయిలో ఈ విద్యలను నేర్పించడం అత్యంత అవసరమని చెబుతుండగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. 2009లో అమలైన చట్టం నిబంధనలను 5 సంవత్సరాలుగా జాప్యం చేయడం వల్ల చాలా మంది సీనియా రిటీ కోల్పోయారు. కొందరు వయస్సు దాటి పోయారు. అందుకే ప్రస్తుతం పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి తీరాలి. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ఉన్నత విద్యల్లో కూడా ఈ విద్యలను ప్రవేశ పెట్టాలి, కస్తూర్బా, ఆదర్శ, ఆశ్రమ, గురు కుల, నవోదయ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలి. ప్రైవే టు విద్యా సంస్థల్లో విద్యను అందించేలా చొరవ తీసుకోవాలి. కనుకుంట్ల కృష్ణహరి ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సైదాపూర్, కరీంనగర్