ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం?
గత ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ట్, క్రాఫ్ట్ విద్యను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. తద్వారా విద్యార్థులు కళా, వృత్తి నైపుణ్యాలకు దూరమయ్యారు. వీరి వృత్తి కౌశల్యాన్ని ప్రోత్సహించక పోవడం వల్ల సుమారు లక్ష మంది అర్హతలు న్నప్పటికీ నిరుద్యోగులుగా వీధుల్లో పడ్డారు. మూడు దశాబ్దా లకు పూర్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ డ్రాయింగ్, లలితక ళలు, మ్యూజిక్, టైలరింగ్, కుట్లు, అల్లికలు, మెకానిజం, ఎలక్ట్రీ షియన్ మొదలగు నైపుణ్యతలను నేర్పించేవారు. తద్వారా ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులు సైతం తమ కాళ్లపై తామే నిలబడేవారు. ప్రతీ డీఎస్సీ ద్వారా ఖాళీలను పూర్తి చేసేవారు. కానీ మూడు దశాబ్దాలుగా ఖాళీ స్థానాలను ఖాళీ గానే చూపుతున్నారు.
ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికి ప్రతీ సంవత్సరం లోయర్, హయ్యర్ పరీక్షలు నిర్వహించి ప్రతీ వేసవిలో టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ) నిర్వహిస్తున్నారు. ఈ సర్టిఫికెట్లు ఉన్నప్పటికి ఏమాత్రం ఉపయోగంలో ఉండవు. ఉపాధి మార్గాన్ని చూపించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలు ఏనాడు చేయలేదు. ముప్ఫై ఏళ్లుగా శిక్షణ పొందిన ఏ ఒక్కరికి ఈ సర్టిఫికెట్ ద్వారా ఏ లాభం జరుగలేదు.
విద్యాహక్కు చట్టం మార్గదర్శకాలను కూడా పట్టించుకో వడం లేదు. 2009లో చట్టం అమలులోకి వస్తే విద్యార్థులకు కళా, వృత్తి విద్యలను అందించేందుకు నేటికీ జాప్యం కొనసాగు తోంది. 2012 చివరలో తెలంగాణలో కేవలం 1,500 మందిని కూడా నియమించలేదు. 5 వేలకు పైచిలుకు పాఠశాలల్లో నియామకాలు చేయాల్సి ఉంది.
విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు సర్వశిక్షా అభియాన్ పథకం ప్రవేశపెట్టారు. విద్యాహక్కు చట్టం అమలులో రాష్ట్రానికో పద్ధతి, జిల్లాకో పద్ధతి కొనసాగుతోంది. 2010 నుంచే ఇతర రాష్ట్రాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించారు. వారికి వేతనాలు సరిపడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో ఒక్కపూట మాత్రమే పనులు చేస్తుంటే తెలంగాణలో రోజంతా బడిలోనే ఉండాలి, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో జిల్లాకో పద్ధతి అనుసరిస్తున్నారు. ఇచ్చిన ఉద్యోగాలనే ఏడాదికోసారి ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో టర్మినేట్ లెటర్ ఇచ్చి ఎలక్షన్లలో బడిబాట కార్యక్రమాల్లో ఇతర పనులు చేయించుకుంటారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కాకుండా రీ ఎంగేజ్ మాత్రం జిల్లాకో పద్ధతిని అనుసరిస్తారు. నిజామాబాద్ జిల్లాలో జూన్ 15 నుంచి, కరీంనగర్ జిల్లాలో జూన్ 20 నుంచి, కొన్ని జిల్లాల్లో ఆగస్టులో రీ ఎంగేజ్ చేశారు. వేతనాలను ఇవ్వడంలోనూ తీవ్ర జాప్యం చేశారు. ఏ ఒక్క జిల్లాలో కూడా సక్రమంగా వేతనాలు వేయరు. టీఎస్‌ఎస్‌లోనే పని చేసే ఇతర విభాగాల ఉద్యోగులకు మాత్రం క్రమం తప్పకుండా వేతనాలు అంద జేస్తారు. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఉద్యోగి సొంత ఖాతాల్లో వేతనాలు వేస్తే నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యాకమిటీ అకౌంట్‌లో వేతనాలు వేశారు. మరికొన్ని జిల్లాల్లో ఇంకా వేతనాలే వేయలేదు. పండుగ సంబరాలను కూడా జరుపుకోని దుస్థితి కొనసాగింది. విభజనానంతరం ఏపీలో కూడా ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల పరిస్థితి మెరుగ్గాలేదన్నది వాస్తవం.
తెలంగాణ సర్వశిక్షా అభియాన్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఇతర ఉద్యోగులకన్నా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యాబోధన చేస్తున్న టీచర్లకు అతి తక్కువ వేతనాలు అందజేస్తారు. పాఠశాలల్లో తోటి ఉపాధ్యాయులతో సమాన పనులు చేసినప్పటికి ఒక్క రోజుకు రెండు వందల రూపాయల చొప్పున కూలీ రేటు కట్టి ఇస్తారు. పేరుకు పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లుగా నియామకం చేపట్టి కాలాంశాలను పెంచాలని జీవోలు జారీచేశారు. బోధనా సామ గ్రిని కూడా సొంత ఖర్చులతో భరించాలి. పాఠ్యపుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చెప్పేది. తోటి ఉపాధ్యాయులతో సమానంగా బోధన చేస్తుంటే పార్ట్‌టైం పేరుతో, అగౌరవ వేతనంతో అవమానించడం ఎంతవరకు సమంజసం. వేసవిలో ఏప్రిల్ 23న టర్మినేట్ లెటర్ ఇచ్చి, కొందరిని జూన్ 20, మరి కొందరిని ఆగస్టులో నియామకం చేశారు. ఇదేనా విద్యాహక్కు చట్టం అమలు చేయడమంటే.
విద్యార్థులను తమకాళ్లపై తామే నిలబడే ఆత్మస్థయిర్యాన్ని నింపగలిగే ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు, విద్యార్థి దశలోనే సృజనాత్మకశక్తి వెలికితీసి కళాకారులుగా, వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దగలిగే విద్యను ఇతర పాఠ్యాంశాలతో పాటు ఎందుకు నేర్పించకూ డదు. విద్యాహక్కు చట్టం జాతీయ స్థాయిలో ఈ విద్యలను నేర్పించడం అత్యంత అవసరమని చెబుతుండగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. 2009లో అమలైన చట్టం నిబంధనలను 5 సంవత్సరాలుగా జాప్యం చేయడం వల్ల చాలా మంది సీనియా రిటీ కోల్పోయారు. కొందరు వయస్సు దాటి పోయారు. అందుకే ప్రస్తుతం పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి తీరాలి. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ఉన్నత విద్యల్లో కూడా ఈ విద్యలను ప్రవేశ పెట్టాలి, కస్తూర్బా, ఆదర్శ, ఆశ్రమ, గురు కుల, నవోదయ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలి. ప్రైవే టు విద్యా సంస్థల్లో విద్యను అందించేలా చొరవ తీసుకోవాలి.
కనుకుంట్ల కృష్ణహరి ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సైదాపూర్, కరీంనగర్