నల్లగొండ టూటౌన్ : జిల్లాలో కళా విద్యను పోత్సహించాలని ఆర్‌ఐఓ ఎన్. ప్రకాశ్‌బాబు అన్నారు. గురువారం పట్టణంలోని డైట్‌లో కళాఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంగీతం, నాటిక పోటీల్లో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీలకు సంగీతంలో 5 టీంలు, నాటికలో మూడు టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ వై.చంద్రమోహన్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కళా విద్యను పోత్సహించాలి : ఆర్‌ఐఓ
Published Thu, Sep 15 2016 10:27 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement