encourage
-
సైనికుల భార్యలే అత్యాచారాలు చేయమనడం దారుణం!
లండన్: ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ.. రష్యా సైనిక కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ ఒలెనా ఆక్రోశించారు. సంఘర్షణ సమయంలో జరుతుగున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం లండన్‌లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో ఒలెనా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి రష్యా బలగాలు ఇలా బహిరంగంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. యుద్ధ సమయంలో లైంగిక వేధింపులనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలా మృగంలా పాశవికంగా ప్రవర్తించి తమ గొప్పతనాన్ని చాటుకోవడం అమానుషం అని రష్యా దళాలపై ఒలెనా విరుచుకుపడ్డారు. యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉండదని, ఇదే అదనుగా చేసుకుని మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోవడం అనేది అనైతికం అన్నారు.అంతేగాదు రష్యా బలగాలు దీన్ని ఒక అతిపెద్ద ఆయుధంగా, తమ ఇష్టరాజ్యంగా ఉపయోగిస్తున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా స్పందన రావాలన్నారు. దీన్ని యుద్ధ నేరంగా గుర్తించి, నేరస్తులందర్నీ జవాబుదారీగా చేయడం అత్యంత ముఖ్యం అని ఒలెనా అన్నారు. (చదవండి: యుద్ధ సమయంలో ఆఫ్రికన్ దేశాలకు ఉక్రెయిన్ చేయూత) -
ఆ హీరోలతో మాట్లాడబోతున్న: అనన్య పాండే
మనలో చాలా మంది సోషల్ మీడియాని వాడుతుంటాం గానీ నెగిటివ్‌గా చూస్తున్నాం, అందులోనూ పాజిటివ్ ఉందంటోంది బాలీవుడ్ మద్దు గుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో కొందరు మానవత్వంతో పలువురికి సహాయం చేయడం సోషల్ మీడియాలో చూశాను. ఎటువంటి పరిచయం లేని వాళ్లకు నిస్వార్థంగా సహాయం చేయడం, సమాచారం పంచుకోవడం లాంటివే గాక ఎంతోమంది ప్రాణాలను కూడా మనం దీని కారణంగానే కాపాడుకోగలిగామని తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసింది. ఇటీవల పలువురు సోషల్ మీడియాని ద్వారా స్వచ్చందంగా చేసిన పనులు చూసి నాకు దానిపై మరింత నమ్మకాన్ని పెరిగేలా చేశాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ‘సోషల్ మీడియా ఫర్ సోషల్ గుడ్’ అనే ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా నేను కొంతమంది సోషల్ మీడియా హీరోలతో మాట్లాడబోతున్నాను’’ అంటూ తెలిపింది. కాగా.. అనన్య వస్త్రధారణ విషయంలో గతంలో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం గమనార్హం. దానిపై స్పందించిన ఆమె తాను ఏ దుస్తులు ధరించినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది. తెలుగులోనూ సందడి చేసేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి: వెరైటీ లుక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్ -
అరటి, దానిమ్మ ఎగుమతికి ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్ : అరటి, దానిమ్మ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి సారించినట్లు ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్ చౌదరి తెలిపారు. ఇందుకు గాను ముంబయికి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, ఐఎన్ఐ ఫార్మ్ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ‘ఫ్యూచర్ గ్రూప్ అండ్ ఐఎన్ఐ ఫార్మ్స్ ఆన్ వాల్యూ ఛైన్ డెవలప్మెంట్ బనానా అండ్ పొమగ్రనేట్’ అనే అంశంపై అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఉద్యానశాఖ డీడీ, ఏడీలు, కొందరు రైతులతో బుధవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తీర్ణ పరంగా ఉద్యానతోటలు భారీగానే ఉన్నాయని, పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి అవసరమైన ఇన్పుట్స్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌లో పేరున్న కార్పొరేట్ కంపెనీలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు జిల్లాల పరిధిలో అరటి, దానిమ్మ పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించునున్నట్లు చెప్పారు. 10 వేల ఎకరాల్లో అరటి, 600 ఎకరాల దానిమ్మ తోటలను గుర్తించి సదరు రైతులకు సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతో పాటు పండిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారన్నారు. భవిష్యత్తులో బొప్పాయి, క్యాప్సికం, బ్రిటిష్ కుకుంబర్ (దోస), మిరప లాంటి మరికొన్ని పంటలకు మరికొన్ని కంపెనీల ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ లోపం, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీకి చెందిన సీజీఎం ఫంకజ్‌ఖండేల్‌వాల్, సుమిత్, అజిత్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, కమిషనరేట్ డీడీలు హనుమంతరావు, అశోక్‌కుమార్, పద్మావతి, నాలుగు జిల్లాకు చెందిన అధికారులు వైవీఎస్ ప్రసాద్, జి.సతీష్, జి.చంద్రశేఖర్, బీవీ రమణ, సుహాసిని, రఘునాథరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిద్దాం
అనంతపురం అర్బన్ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో 21 రోజుల్లో అనుమతులివ్వాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అందించే క్రమంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీపీఐసీ) సమావేశం కలెక్టర్ అధ్యోతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో జాప్యం చేయడం వల్ల లక్ష్యం నెరవేదన్నారు. సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్‌బాబు వివరించారు. ఆన్లైన్లో నమోదైన ప్రతి దరఖాస్తుని కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుడు స్థాపించిన పరిశ్రమ, దాని పనితీరుని పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు. లబ్ధిదారుల యూనిట్లను జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 31 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 27 పరిశ్రమలకు రూ.4.27 కోట్లు పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదం తెలిపారు. నాలుగింటిని తిరస్కరిస్తూ వాటిని మరోమారు విచారణ చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మీ సేవ ద్వారా నమోదైన దరఖాస్తుల్లో 821 ప్రతిపాదనల్లో 104 ప్రతిపాదనలను మళ్లీ సమీక్షిస్తామన్నారు. హిందూపురం, గుడిపల్లి, గుత్తిలో ఉన్న పారిశ్రామిక వాడలో పరివ్రమలు స్థాపించేందుకు ఎనిమిది ప్లాట్లు కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పరిధిలో నిరంత విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్రెస్ ఫీడర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఎల్డీఎం జయశంకర్, డీపీఓ జగదీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ హస్తకళలను ఆదరించాలి
అనంతపురం కల్చరల్ : ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అనంత వేదికగా 12 రోజుల పాటు సాగే లేపాక్షి హస్తకళా ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోన శశిధర్‌తో పాటు ఏపీ హసక్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాళీ ప్రసాద్, ఆర్డీఓ మలోల తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కళాకారులు అనంతకు విచ్చేయడం ఆనందంగా ఉందని, వినూత్నంగా ఉన్న వారి ఉత్పత్తులు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. కళలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరముందన్నారు. లేపాక్షి ఎంపోరియం మేనేజర్ సుధీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి వచ్చేనెల 5 వరకు ప్రదర్శన సాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగే ప్రదర్శనలో నిర్మల్ పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, బంజారా ఉత్పత్తులు, వివిధ చేనేత వస్త్రాలు వంటి సంప్రదాయక హస్తకళలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపోరియం మేనేజర్ వెంకటరమణప్ప, అనంతపురం లేపాక్షి ఎంపోరియం సిబ్బంది సురేష్, అమర్నాథ్, వెంకట్రాముడు, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
– ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – ముగిసిన జిల్లాస్థాయి ఖోఖో పోటీలు హుజూర్నగర్ : గ్రామీణ ప్రాంతాల క్రీడాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్–14 ఖోఖో పోటీలు సోమవారం ముగిసాయి. ముగింపు సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయాడని విమర్శించారు. సుదీర్ఘ కాలంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను శాసనసభలో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. అలాగే వర్షాలతో కూలిపోయిన పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ కోసం రూ.లక్ష కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఖోఖోలో విజేతలైన జట్లకు షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్, గరిడేపల్లి జడ్పీటీసీలు హఫీజానిజాముద్దీన్, పెండెం శ్రీనివాస్‌గౌడ్, నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్‌రావు, కీతా మల్లికార్జున్, ఎంఈఓ లక్పతినాయక్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, బాలుర విభాగంలో ఫైనల్ తలపడిన మిర్యాలగూడ డివిజన్– దేవరకొండ డివిజన్లలో మిర్యాలగూడ డివిజన్ గెలుపొంది. అలాగే బాలికల విభాగంలో భువనగిరి–సూర్యాపేట డివిజన్లు తలపడగా భువనగిరి డివిజన్ విజయం సాధించింది. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
కర్నూలు(రాజ్‌విహార్): పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సాహిస్తామని, సమస్యలుంటే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రాజేంద్ర తెలిపారు. శనివారం స్థానిక ఐలా అసోసియేషన్ భవనంలో వివిధ పారిశ్రామికవేత్తలు, సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటైన, కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమల స్థితిగతులు తెలుసుకునేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. అనుమతులు పొందడం, ఇతర టెక్నికల్ కారణాల సమస్యలు ఎదురైతే తన దష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఫ్యాప్సీయా అధ్యక్షుడు జిఆర్కె రెడ్డి, కార్యదర్శి ఎం జగన్మోహన్రెడ్డి, జనరల్ మేనేజరు సోమశేఖర్‌రెడ్డి, మధుసూదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కళా విద్యను పోత్సహించాలి : ఆర్ఐఓ
నల్లగొండ టూటౌన్ : జిల్లాలో కళా విద్యను పోత్సహించాలని ఆర్ఐఓ ఎన్. ప్రకాశ్‌బాబు అన్నారు. గురువారం పట్టణంలోని డైట్లో కళాఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంగీతం, నాటిక పోటీల్లో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీలకు సంగీతంలో 5 టీంలు, నాటికలో మూడు టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ వై.చంద్రమోహన్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి
కోయిల్‌కొండ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ అథ్లెట్ శంకర్, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు సుందర్రాజు అన్నారు. సోమవారం వారు మండలంలోని మనికొండ ఉన్నతపాఠశాలలో ఆజాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతీ, యువకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తున్నారని వారిని ప్రభుతంతోపాటు గ్రామాల్లో ఉండే వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యం పెట్టుకొని కషి చేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలమన్నారు. అనంతరం వారిని పాఠశాల బందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి బాలరాజు, సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు గోరిసతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహమాన్, పీఈటీ నిరంజన్, రాజు, శేఖర్, మురళీ పాల్గొన్నారు. -
రేపు సబ్‌జూనియర్ అత్యపత్య ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఈ నెల 31న నిర్వహించనున్నట్లు జిల్లా అత్యపత్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్ ఉర్రహెమాన్, ముంతాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు సెల్ నెం.9985313150, 9985979007 లను సంప్రదించాలని వారు కోరారు. -
యువ శాస్త్రవేత్తకు కేంద్ర ప్రోత్సాహం
* పథకానికి ఎంపికైన డాక్టర్ శివకిరణ్ విజ్ఞాన్ వర్సిటీ శాస్త్రవేత్త * రూ.34 లక్షల నగదు మంజూరు చేబ్రోలు: కేంద్ర ప్రభుత్వం నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కిందని రెక్టార్ డాక్టర్ బి.రామ్మూర్తి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి వర్సిటీలో ఆదివారం రెక్టార్ రామ్మూర్తి విలేకర్లతో మాట్లాడుతూ తమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ శివకిరణ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకున్నారని తెలిపారు. ఎర్లీ కెరీర్ రీసెర్చి అవార్డు కింద కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం రూ. 34లక్షల విలువైన ప్రాజెక్టును తమ వర్సిటీకి మంజూరుచేసిందని చెప్పారు. ఈ ప్రోత్సాహం వల్ల శివకిరణ్ తన పరిశోధనలను ముమ్మరం చేయనున్నారని తెలిపారు. రీకాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా.. ప్రాజెక్టు దక్కించుకున్న శివకిరణ్ మాట్లాడుతూ టైఫాయిడ్, రక్తవిరోచినాలు, మూత్ర, జీర్ణకోశ సంబంధ వ్యాధులకు కారణమైన బాక్టీరియాను మానవ శరీరం నుంచి తరిమేసేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన పరిశోధనా నివేదికను చూసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. సమర్థవంతమైన వ్యాక్సిన్, ఔషధాలను కనుగొనేందుకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం రీకాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధి కారక బాక్టీరియా జన్యువులను రెండు మూడు కలిపి.. ఒకేరకపు ప్రతిజనకాలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగ ప్రయోగశాలలను వాడుకుంటున్నట్లు తెలిపారు. శివకిరణ్‌ను విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్‌చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తన చాంబర్లో ఘనంగా సత్కరించారు. -
కబడ్డీ క్రీడను ప్రోత్సహించాలి
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు నల్లగొండ టూటౌన్ : గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఐబీసీ, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలతో పోటీతత్వం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. క్రీడాసంఘాలు గ్రామీణ క్రీడల వైపు యువతను మల్లించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మ్యాచ్ రిఫరీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, డాక్టర్ నరహరి, రోహిత్, వేణు సంకోజు, సీపీఐ జిల్లా కార్యరద్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, డాక్టర్ అనూష శ్రీనివాస్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
యాంత్రీకరణపై సర్కార్ నజర్
మహబూబ్‌నగర్ వ్యవసాయం: సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్నదే తమ లక్ష్యం అంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతువస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా గడిచిన రెండేళ్ల కాలంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలలో లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. సదరు పరికరాలు రైతులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ఇంటర్ డిస్ట్రిక్ స్వా్కడ్ టీంలను నియమించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. 2015–16 వార్షిక ఏడాదిలో జిల్లాలో వ్యవసాయాంత్రీకరణకు రూ. 5 కోట్ల రాయితీ యంత్ర పరికరాలను, ఆర్కేవీవై కింద రూ. 3.6 కోట్ల విలువలగల పరికరాలపై క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో పంపిణీ చేసిన పరికరాలు,ట్రాక్టర్లపై విచారించేందుకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఒక ఏడీఏ,ఒక ఎంఏఓతో కూడిన రెండు బృందాలు జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలో విచారణ చేట్టాయి.మంగళవారం షాద్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమొదలైంది. -
విద్యారంగం పరిరక్షణ కోసమే సైకిల్‌యాత్ర
గట్టు : విద్యారంగ పరిరక్షణ కోసమే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. గత నెల 29న కొల్లాపూర్‌లో ప్రారంభించిన సైకిల్ యాత్ర వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మంగళవారం గట్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, అన్ని వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుర్మయ్య, నాగమణి, కుమా ర్, గద్వాల డివిజన్ అధ్యక్షుడు వీరేష్‌సాగర్, నాయకులు రా మాంజనేయులు, భాస్కర్, నాగరాజు, హరిబాబు పాల్గొన్నారు. -
చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి
గద్వాల : వ్యవసాయం తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని గద్వాల చేనేత సహకార సంఘం చైర్మన్ రామలింగేశ్వర కాంళ్లే కోరారు. మంగళవారం స్థానిక మార్కండేయస్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గద్వాలలో పాలమూరు జిల్లా చేనేత మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు సైతం చేనేత రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉత్పాదక రంగంలో వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీలు, రాయితీలు, రుణాలు తదితరవి చేనేతకు సైతం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను చేనేత కళాకారులుగా గుర్తించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు మహా సమ్మేళనానికి తరలిస్తున్నారని వివరించారు. ఆభఃదివారం ఉదయం 10 గంటలకు స్థానిక రాఘవేంద్ర కాలనీలో నిర్వహించే మహా సమ్మేళనానికి జెడ్పీచైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యే డీకే అరుణ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్పర్సన్ విమలక్క, పలువురు సంఘ సంస్కర్తలు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పాలమూరు జిల్లా చేనేత మహా సమ్మేళనం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నాయకులు సత్యమ్మ, ఆదినారాయణ, నర్సింహ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీహబ్‌తో పరిశ్రమలకు ప్రోత్సాహం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్‌తో పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని అమెరికా ప్రభుత్వ మధ్య, దక్షిణ ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అంజెలా ఆంగ్లర్ కొనియాడారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..రెండేళ్లలో హైదరాబాద్‌లో 27శాతం పెట్టుబడులు పెరగటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల క్రితం తాను వచ్చినప్పడు ఉన్న హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు ఎంతో తేడా ఉందని..ఇప్పుడు నగరం గణనీయమైన అభివృద్ది సాధించిందని ఆమె చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం...తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని...రెండు ప్రభుత్వాల సంప్రదింపులతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. -
‘బ్యాంకులు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి’
బోట్‌క్లబ్(కాకినాడ), న్యూస్‌లైన్: సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికరంగ ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుండాలని రిజర్వు బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్ఎన్ డాష్ పేర్కొన్నారు. స్థానిక ఐశ్వర్యగ్రాండ్ హోటల్లో బుధవారం రిజర్వుబ్యాంక్ , చిన్న తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు బ్యాంకు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి అడ్వైజరి కమిటీతో పాటు, రిజర్వు బ్యాంక్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అదే తరహాలో జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీలో తప్పని సరిగా చర్చించాలన్నారు. లీడ్ బ్యాంక్, జిల్లా పరిశ్రమల కేంద్రం నమూనా ప్రాజెక్టులను తయారు చేసి వారికి అవగాహన కల్పించాలని సూచిం చారు. అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై విసృ్తత ప్రచారం చేయాలన్నారు. ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీ కన్నన్ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు రుణాలు కల్పించేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కోయంబత్తూరు, ఫరీదాబాద్ వంటి జిల్లాల్లో కంటే తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్‌లు అత్యధిక క్రెడిట్ రేషియో పాటిస్తూ రుణాలు ఇస్తున్నాయన్నారు. అయినా అక్కడ కనిపించే చిన్న తరహా పరిశ్రమల పురోగతి ఇక్కడ లేదన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బీవీ రామారావు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయడానికి పారిశ్రామికవేత్తలను తిప్పతున్నారన్నారు. ఎస్బీహెచ్ డీజీఎం కె. రమేష్‌బాబు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వి. సత్యనారాయణమూర్తి, ఎస్బీఐ ఏజీఎం మూర్తి, సూక్ష్మ చిన్న పరిశ్రమల కేంద్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ సుభాష్ ఇన్గేవర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎన్. లక్ష్మణరావు, ఎల్డీఎం జగన్నాథస్వామి పాల్గొన్నారు. -
వితంతు వివాహాలను ప్రోత్సహించండి
అందాల తార త్రిష ఈ మధ్య అడ్వైజ్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. మూడు దశాబ్దాల వయసులో పడ్డా చెరగని అందంతో వెలిగిపోతున్న ఈ చెన్నై చిన్నదానికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. ఆమెకు ప్రస్తుతం విజయమనేది చాలా అవసరం. త్రిష కావాలనే చిత్రాలను తగ్గించుకుంటున్నారని, ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనే ప్రచారం హోరెత్తుతోంది. మొన్నటి వరకు శునక ప్రేమ కురిపించిన త్రిష, తాజాగా వితంతువులపై మమకారం చూపిస్తున్నారు. వితంతు వివాహాలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ఉచిత సలహాలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి వితంతువును వివాహమాడడంతోపాటు ఆమె బిడ్డను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడనే వార్తను చదివిన త్రిష ఎంతో ఎడ్మైర్ అయ్యారట. వెంటనే వితంతువుల వివాహాలను ప్రోత్సహించండంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మహిళల రెండవ వివాహానికి సహకరించాలని తన అభిమానులకు హితవు పలికారు. -
ఏడాదికే మూత
పోలవరం, న్యూస్‌లైన్ : రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలశీతలీకరణ కేంద్రాలు పలు కారణాలతో మూతపడుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారడమే కాకుండా లక్షల నిధులు వెచ్చించి నెలకొల్పిన మెషినరీ, భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. పోలవరం మండలం కార్మల్‌పురం వద్ద ఏర్పాటు చేసిన గోదావరి మిల్క్‌గ్రిడ్ పాలశీతలీకరణ కేంద్రానికి నిర్వహణ లోపం శాపంగా మారింది. దీంతో ఏడాదికే మూతపడింది. ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని 2011 నవంబర్ 22న ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో భవనాన్ని, మెషనరీని నెలకొల్పారు. మండలంలో 18 పాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పాలమిత్రలను నియమించారు. పాల సేకరణ కేంద్రాలకు ఒక ఇన్వర్టర్, ఒక వెయింగ్ మెషిన్, లాక్టో మీటర్, వెన్నశాతం కొలిచే పరికరం అందజేశారు. ప్రారంభ దశలో పాలమిత్రలు రోజూ 600 లీటర్ల నుంచి 800 లీటర్ల వరకు పాలు సేకరించి కేంద్రానికి అందజేసేవారు. అప్పట్లో పాలు పోసిన రైతులకు పది రోజులకు ఒకసారి సొమ్ము అందజేసేవారు. కొన్నాళ్లు 20 రోజులకు, తరువాత నెల రోజులకు రైతులకు సొమ్ములు చెల్లించేవారు. తదనంతరం సొమ్ము చెల్లింపులు మరీ ఆలస్యం అవుతుండడంతో రైతులు పాలు పోయడం మానివేశారు. దీంతో పాల సేకరణ 200 లీటర్లకు పడిపోయింది. క్రమేణా పాల సేకరణ తగ్గిపోవడంతో మొత్తానికి ఈ ఏడాది జనవరి 2న ఈ కేంద్రాన్ని మూసివేశారు. పారంభ దశలో కేంద్రం నిర్వహణకు రూ.5 లక్షలను బ్యాంకులో జమ చేశారు. ఈ నిధులన్నీ కూడా ఖర్చయిపోయాయి. వాస్తవానికి ఈ నిధులను నిర్వహణ కోసం అవసరమైనప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి డ్రా చేసి తిరిగి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇటువంటి నిబంధనలు ఐకేపీ అధికారులు పాటించకుండా రూ.5 లక్షలు ఖర్చుచేసేశారు. నిర్వహణకు డబ్బులు లేవంటూ పాలశీతలీకరణ కేంద్రాన్ని మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల మిత్రలకు ఇచ్చిన ఇన్వర్టర్లు, ఇతర సామగ్రి ఏమయ్యాయో తెలియడం లేదు. ప్రైవేట్ కేంద్రాలకు పాలు పోస్తున్నా సొమ్ముకు గ్యారెంటీ ఉండటం లేదని, ఇప్పటికైనా గోదావరి మిల్క్గ్రిడ్ను తిరిగి ప్రారంభించి సక్రమంగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. -
దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర: మోడీ
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిగా పని చేయలేదని, తాను ఏర్పాటు చేసిన వ్యవస్థే గుజరాత్ అభివృద్ధికి దోహదం చేసిందని బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పార్క్ హయత్ హొటల్లో తనను కలిసిన తెలుగు సినీ ప్రముఖులతో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. తన విజయంలో ఆరు కోట్ల గుజరాతీయుల పాత్ర ఉందన్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు, గుజరాత్ పని అయిపోయిందని, ఇక ఆ రాష్ట్రం వెనుకబడిపోతుందని అన్నారన్నారు. కానీ ఇప్పుడు గుజరాత్ ఎంత అభివృద్ధి చెందిందో చూడవచ్చని చెప్పారు. గుజరాత్లో వ్యాపారాలు చేసేవారిలో 30 శాతం మంది ఆంధ్ర ప్రదేశ్ వారే ఉన్నట్లు తెలిపారు. యువత వద్ద దమ్ము ఉందని, వారిని ప్రోత్సహించాలన్నారు.