విద్యారంగం పరిరక్షణ కోసమే సైకిల్‌యాత్ర
Published Wed, Aug 3 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
గట్టు : విద్యారంగ పరిరక్షణ కోసమే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. గత నెల 29న కొల్లాపూర్‌లో ప్రారంభించిన సైకిల్ యాత్ర వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మంగళవారం గట్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, అన్ని వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుర్మయ్య, నాగమణి, కుమా ర్, గద్వాల డివిజన్ అధ్యక్షుడు వీరేష్‌సాగర్, నాయకులు రా మాంజనేయులు, భాస్కర్, నాగరాజు, హరిబాబు పాల్గొన్నారు.
Advertisement