కబడ్డీ క్రీడను ప్రోత్సహించాలి
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
నల్లగొండ టూటౌన్ : గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఐబీసీ, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలతో పోటీతత్వం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. క్రీడాసంఘాలు గ్రామీణ క్రీడల వైపు యువతను మల్లించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మ్యాచ్ రిఫరీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, డాక్టర్ నరహరి, రోహిత్, వేణు సంకోజు, సీపీఐ జిల్లా కార్యరద్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, డాక్టర్ అనూష శ్రీనివాస్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.