టీహబ్‌తో పరిశ్రమలకు ప్రోత్సాహం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్‌తో పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని అమెరికా ప్రభుత్వ మధ్య, దక్షిణ ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అంజెలా ఆంగ్లర్ కొనియాడారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..రెండేళ్లలో హైదరాబాద్‌లో 27శాతం పెట్టుబడులు పెరగటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇరవై ఏళ్ల క్రితం తాను వచ్చినప్పడు ఉన్న హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు ఎంతో తేడా ఉందని..ఇప్పుడు నగరం గణనీయమైన అభివృద్ది సాధించిందని ఆమె చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం...తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని...రెండు ప్రభుత్వాల సంప్రదింపులతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు.