యాంత్రీకరణపై సర్కార్‌ నజర్‌ | governament encourage to mechanise | Sakshi
Sakshi News home page

యాంత్రీకరణపై సర్కార్‌ నజర్‌

Published Tue, Aug 9 2016 11:38 PM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

governament encourage to mechanise

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం: సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్నదే తమ లక్ష్యం అంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతువస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా గడిచిన రెండేళ్ల కాలంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలలో లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం నజర్‌ పెట్టింది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. సదరు పరికరాలు రైతులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ఇంటర్‌ డిస్ట్రిక్‌ స్వా్కడ్‌ టీంలను నియమించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. 
  2015–16 వార్షిక ఏడాదిలో జిల్లాలో వ్యవసాయాంత్రీకరణకు రూ. 5 కోట్ల రాయితీ యంత్ర పరికరాలను, ఆర్‌కేవీవై కింద రూ. 3.6 కోట్ల విలువలగల పరికరాలపై  క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో పంపిణీ చేసిన పరికరాలు,ట్రాక్టర్‌లపై విచారించేందుకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఒక ఏడీఏ,ఒక ఎంఏఓతో కూడిన రెండు బృందాలు జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలో విచారణ చేట్టాయి.మంగళవారం షాద్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement