పీఏపల్లి మండలం అంగడిపేటలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న కోమటిరెడ్డి
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. ఆదుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలో దెబ్బతిన్న వరి చేనును సోమవారం ఆయన పరిశీలించారు. మండలంలోని బాలాజీనగర్, అంగడిపేట గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను రైతులతో కలిసి కలియతిరిగారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని వారికి మనోధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే కనీసం సీఎం కేసీఆర్ స్పందించలేదని పేర్కొన్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు చెప్పుకోవడం తప్పితే రైతులకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో మహారాష్ట్ర తరహా ఉద్యమం చేస్తా మని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టిం చి పంట పండించిన అన్నదాతపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూ డడం తగదన్నారు. రాబోయేది కాంగ్రెస్ పాలన అని కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు జగన్‌లాల్‌నాయక్,బిల్యానాయక్, కిషన్‌నాయక్, వడ్లపల్లి చంద్రారెడ్డి, కర్నాటి రవికుమార్, కున్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment