సాక్షి, హైదరాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. మా సోదరుడు చేరిక విషయం నాతో మాట్లాడలేదు.. అధిష్టానంతో మాట్లాడారు’’ అని పేర్కొన్నారు.
‘‘కర్ణాటకలో హామీలిచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయి. మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సెకండ్ లిస్ట్ ఈ రోజు పూర్తవుతుంది. రేపు విడుదలవుతుంది. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయ్.. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం 119 సీట్లపై రేపు ఉదయం ప్రకటన ఉంటుంది. కాంగ్రెస్‌కు 70-80 సీట్లు వస్తాయి. పొత్తులపై సాయంత్రం క్లారిటీ వస్తుంది. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం’’ అని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
‘‘గతంలోనే కాళేశ్వరంపై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాశా. రాహుల్ గాంధీ పేరు చెప్పే అర్హత కేటీఆర్‌కు లేదు. రాహుల్ కుటుంబానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్’’ అంటూ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.
చదవండి: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment