Komatireddy Venkat Redd
-
కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. మా సోదరుడు చేరిక విషయం నాతో మాట్లాడలేదు.. అధిష్టానంతో మాట్లాడారు’’ అని పేర్కొన్నారు. ‘‘కర్ణాటకలో హామీలిచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయి. మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సెకండ్ లిస్ట్ ఈ రోజు పూర్తవుతుంది. రేపు విడుదలవుతుంది. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయ్.. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం 119 సీట్లపై రేపు ఉదయం ప్రకటన ఉంటుంది. కాంగ్రెస్‌కు 70-80 సీట్లు వస్తాయి. పొత్తులపై సాయంత్రం క్లారిటీ వస్తుంది. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం’’ అని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘గతంలోనే కాళేశ్వరంపై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాశా. రాహుల్ గాంధీ పేరు చెప్పే అర్హత కేటీఆర్‌కు లేదు. రాహుల్ కుటుంబానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్’’ అంటూ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా -
కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. కాంగ్రెస్‌లోకి లైన్‌క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ముందే పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో కీలక నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పక్రియను వేగవంతం చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఇక, వీరి భేటీ అనంతరం కోమటిరెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను. నల్లగొండలో 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ అంటే ఏంటో చూడండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీలో చేరే ముందు జూపల్లి ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, నేడు కోమటిరెడ్డితో భేటీ అయ్యారు జూపల్లి. ఇది కూడా చదవండి: ఖమ్మంలో అమిత్‌షా సభ అదిరిపోవాలి.. -
జగదీష్‌రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : మూడు సంవత్సరాలుగా ఆగిపోయిన చత్తీస్ఘడ్-సిరోంచ రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి మూడు నెలల్లో సాధించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నెల రోజుల్లో రోడ్డు పనులు ప్రాంరంభం కానున్నాయన్నారు. సూర్యాపేట 7 స్టార్ హోటల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి దేశం కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే అర్హత మంత్రి జగదీష్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలలో ఓడిపోయినప్పటి నుంచి మంత్రి జగదీష్ మానసిక పరిస్థితి బాలేదని, హుజూర్‌నగర్‌లో గెలుపు కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిసికట్టుగా పనిచేసి హుజుర్‌నగర్‌ల్‌లో విజయం సాధిస్తామని వెంకట్‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. దీనికి ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, నాయిని నర్సింహరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వంద గ్రామాలకు కూడా అందడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ మొత్తం దోపిడీ పథకాలేనని, శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉంటే మరోవైపు నూతన భవనాలు ఎందుకు కడుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, వందల కొద్ది లారీల ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. -
యుద్ధం చేసేవాడికే కత్తి ఇవ్వాలి: కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట: యుద్ధం చేసే వాడికి కత్తి ఇవ్వకుండా.. ఇంట్లో కూర్చున్నోడికి ఇస్తే ఏమి లాభం అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, రాష్ట్రంలో పార్టీ గట్టిగా ఉండాలంటే టీపీసీసీ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కాకుండా కొత్త వాళ్లను పెట్టాలని, రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచి అంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ఎప్పుడు మారినా సీనియర్ నాయకుడిగా ఉన్న తనకే వస్తుందనే నమ్మకం ఉందని వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్సార్, వైఎస్ జగన్ ఇద్దరూ పోరాడినట్లు ప్రజా సమస్యలపై తాను అలాగే ఉద్యమిస్తానన్నారు. అధిష్టానం అనుమతితో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, బస్సు యాత్ర చేపడతానని వెల్లడించారు. అందరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నా రని అంటున్నారు.. ఎవరు ఎక్కడికి పోయినా తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ కక్ష కట్టారని అన్నారు. -
వేడెక్కిన ప్రచారం!
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మండలానికి ఒక ప్రచార వాహనం ఏర్పాటు చేసి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ పాటల ద్వారా ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ రోజు తమ కార్యకర్తలను వెంట తెచ్చుకొని బలనిరూపణ చేసుకున్నారు. మునుగోడుకు సాగు జలాలే ప్రధాన అజెండాగా అన్నిపార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరో దఫా నియోజకవర్గంలో ప్రతిరోజు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి, ప్రత్యర్థుల లోపాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ హయాంలో ఏవిధంగా అభివృద్ధి చేశారో చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం ఇలా.. బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి బీజేపీ జాతీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామితో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. మండలం వారీగా ప్రణాళిక రూపొందించుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే ఏవిధంగా అభివృద్ధి చేస్తానో చూపిస్తాను అంటూ అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దూకుడు.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వం ప్రకటించడం ఆలస్యమైనప్పటికీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చాలా రోజులుగా చాపకింద నీరులా తమ కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారిలో జోష్ నింపారు. మిత్రపక్షాలైన సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి మిత్రధర్మం పాటిస్తామని హామీ ఇచ్చి ప్రచారానికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వివిధ పార్టీల అసంతృప్త నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రోడ్డుషోలతో పాటు, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బీఎల్ఎఫ్, ఇతరుల ప్రచారం.. బీఎల్ఎఫ్ అభ్యర్థి కరుణాకర్ నియోజకవర్గంలో ఆలస్యంగా ప్రచారం మొదలు పెట్టారు. వీరు కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో అన్నిపార్టీల అభ్యర్థులతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. -
‘మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లకు పెన్షన్’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ మ్యానిఫెస్టో మోసాలతో కూడుకున్నది.. మాది వాస్తవాలతో కూటుకున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన హామీలతో పాటు మ్యానిఫెస్టోలో ఇంకా ఏ అంశాలు చేర్చి తెలంగాణ ప్రజలకు అండగా ఉండగలమనే దాని గురించి చర్చిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ప్రతి జిల్లా హెడ్ కార్వర్టర్‌లో ఓ మెడికల్ కాలేజీ.. అమరవీరుల త్యాగాల గుర్తుగా ఓ స్మారక చిహ్నానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లే తమకు కూడా వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలనే బీసీల మనవి గురించి కూడా చర్చించామని తెలిపారు. చేనేతల రుణమాఫీ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. పక్క రాష్ట్రంలో లోటు బడ్జెట్ అయినప్పటికి ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటి పద్దతినే తెలంగాణలో తీసుకొచ్చే ఆలోచన చేస్తునట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చినట్లే మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు కూడా పెంచన్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో మ్యానిఫెస్టో ఫైనల్ అవుతదని తెలిపారు. కేసీఆర్ మ్యానిఫెస్టో మోసాలతో కూడుకున్నది అయితే.. తమ మ్యానిఫెస్టో వాస్తవాలతో కూడినదని వెల్లడించారు. పైనా కట్టే ప్రాజెక్ట్‌లను చంద్రబాబు ఎలా ఆపుతాడు.. కేవలం ఒటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు ఇలా అబద్దాలు ప్రచార చేస్తున్నారని కోమటిరెడ్డి మండి పడ్డారు. మహిళా మంత్రి లేని టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై విచారణ వాయిదా
-
‘రైతాంగాన్ని ఆదుకోవాలి’
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. ఆదుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలో దెబ్బతిన్న వరి చేనును సోమవారం ఆయన పరిశీలించారు. మండలంలోని బాలాజీనగర్, అంగడిపేట గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను రైతులతో కలిసి కలియతిరిగారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని వారికి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే కనీసం సీఎం కేసీఆర్ స్పందించలేదని పేర్కొన్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు చెప్పుకోవడం తప్పితే రైతులకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో మహారాష్ట్ర తరహా ఉద్యమం చేస్తా మని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టిం చి పంట పండించిన అన్నదాతపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూ డడం తగదన్నారు. రాబోయేది కాంగ్రెస్ పాలన అని కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు జగన్‌లాల్‌నాయక్,బిల్యానాయక్, కిషన్‌నాయక్, వడ్లపల్లి చంద్రారెడ్డి, కర్నాటి రవికుమార్, కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
రణరంగం
⇔ పోటాపోటీ నినాదాలతో రాళ్లు రువ్వుకున్న శ్రేణులు ⇔ పగిలిన తలలు, చిరిగిన చొక్కాలు.. కార్లు, బైక్‌లు ధ్వంసం ⇔ యుద్ధభూమిని తలపించిన ఎస్సెల్బీసీ ప్రాంగణం ⇔ కోమటిరెడ్డిని బలవంతంగా బయటకు పంపించిన పోలీసులు ⇔ వైఎస్ విగ్రహం వద్ద వెంకట్‌రెడ్డి ధర్నా.. ‘మిర్యాల’కు తరలింపు ⇔ బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు ⇔ హరీశ్ రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి సాక్షి, నల్లగొండ : సాయంత్రం 4 గంటలు.. నల్లగొండ నుంచి సాగర్ వెళ్లే రహదారిలో గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వస్తుండడంతో టెంట్లు,మైకులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. తెలంగాణ పాటలు, ఉపన్యాసాలతో అక్కడ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుండగానే ఉన్నట్టుండి గాల్లోకి రాళ్లు లేచాయి. ఏంటీ... రాళ్ల వాన ఏమైనా కురుస్తుందా అని ఆలోచించేలోపే ఆ వాన యుద్ధంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు, గుండ్లు గాలిలో రయ్యిమని వచ్చి తలలు పగులగొట్టాయి. అవే రాళ్లు కార్ల అద్దాలు, బైక్‌లను ధ్వంసం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసినంత తేలికగా రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రదేశం అరగంటకు పైగా యుద్ధభూమిగా మారింది. కర్రలు ఓ చేత్తో, రాళ్లు మరో చేత్తో పట్టుకుని ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండలో మంగళవారం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ రణరంగమే జరిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లా రైతుల చిరకాల కోరిక అయిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. తొలుత మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మర్రిగూడ బైపాస్ నుంచి కోమటిరెడ్డి బైక్‌ర్యాలీతో క్లాక్‌టవర్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి ర్యాలీగా బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసే ప్రదేశం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డిని చూసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా కార్యక్రమంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు వచ్చే సమయం సమీపిస్తుండడం, టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో పట్టణం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి వస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకట్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా వెళ్లిపోతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు. గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో రాళ్లు గాల్లోకి లేచాయి. అటునుంచి రాళ్లు రావడంతో సభాప్రాంగణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న రాళ్లను కి విసిరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల వైపు నుంచి కూడా రాళ్లు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. ఇరు పార్టీల కార్యకర్తలు తమకు దొరికిన కార్లు, బైక్‌లను ధ్వంసం చేశారు. ఇలా అరగంటకు పైగా సాగర్ రోడ్డు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మాటల యుద్ధం రాళ్ల యుద్ధం ముగిసి కోమటిరెడ్డి అరెస్ట్.. ఆ తర్వాత బత్తాయి మార్కెట్ శంకుస్థాపన.. అనంతరం కూడా ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. తన అరెస్ట్ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిలాల్లో టీఆర్ఎస్ నేతలందరూ నయీం అనుచరులేనని, రౌడీల్లా మారి జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, బత్తాయి మార్కెట్ బహిరంగసభలో మాట్లాడిన ఎంపీ సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, జగదీశ్ కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డిని ఎంపీ సుఖేందర్‌రెడ్డి కల్లుతాగిన కోతితో పోల్చారు. ప్రతిపక్షాలు పాటించాల్సిన సంప్రదాయాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తెలియవని, చీప్ పాపులారిటీ కోసం ఆయన పాకులాడుతున్నాడని విమర్శించారు. హీరో అనిపించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన కోమటిరెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఆగమాగం ఎందుకు చేసిండు.. : మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే, మంచి పేరు తమకు వస్తుందనే దుగ్ధతోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మీ ఎమ్మెల్యేకు ఎందుకంత తొందరో అర్థమైతలేదు. మేమేమీ ఏసీలో కూర్చోలేదు కదా.. 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ అడుగుతున్నా కాంగ్రెసోళ్లు చేయలేదు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే కుండీలు ఎత్తేసుడు.. ఫ్లెక్సీలు చించుడు.. ఎందుకింత ఆగమాగం చేసిండో అర్థం కావడం లేదు. రసాభాస చేస్తే పేరు రాకుండా పోతుందనే ఉద్దేశంతోనే.’ అని ఆయన వ్యాఖ్యానించారు. మేం కరవలేదు.. బుస మాత్రమే కొట్టాం : మంత్రి జగదీశ్ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన గొడవపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డిని కోతి అనడానికి కూ డా లేదని, అంతకన్నా దరిద్రం గా ఆయన తయారయ్యాడని అ న్నారు. మీడియాలో కనిపిం చాల నే ఆలోచనతో చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. అరాచకా లు, చిల్లర వ్యవహారాలను జిల్లాలో సాగనీయబోమని, అలా చే యాలని చూస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించా రు. ‘ఇవి ఇంక మీ జాగీర్లు కావు. తెలంగాణ ప్రజల అడ్డాలు. మేం పూర్తిగా కరవలేదు. కేవలం బుస మాత్రమే కొట్టాం.’ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ధర్నా తనను శంకుస్థాపన ప్రదేశం నుంచి బలవంతంగా పోలీసులు పంపించివేయడాన్ని, తమ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవరిస్తున్నారని, వారి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. ఇంతలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకుని కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు ఆయనను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే, కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించాయి. కోమటిరెడ్డిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోమటిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మార్కెట్ వద్దకు చేరుకుని శంకుస్థాపన చేశారు.