సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ మ్యానిఫెస్టో మోసాలతో కూడుకున్నది.. మాది వాస్తవాలతో కూటుకున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన హామీలతో పాటు మ్యానిఫెస్టోలో ఇంకా ఏ అంశాలు చేర్చి తెలంగాణ ప్రజలకు అండగా ఉండగలమనే దాని గురించి చర్చిస్తున్నామన్నారు.
ఈ క్రమంలో ప్రతి జిల్లా హెడ్ కార్వర్టర్‌లో ఓ మెడికల్ కాలేజీ.. అమరవీరుల త్యాగాల గుర్తుగా ఓ స్మారక చిహ్నానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లే తమకు కూడా వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలనే బీసీల మనవి గురించి కూడా చర్చించామని తెలిపారు. చేనేతల రుణమాఫీ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
పక్క రాష్ట్రంలో లోటు బడ్జెట్ అయినప్పటికి ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటి పద్దతినే తెలంగాణలో తీసుకొచ్చే ఆలోచన చేస్తునట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చినట్లే మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు కూడా పెంచన్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో మ్యానిఫెస్టో ఫైనల్ అవుతదని తెలిపారు. కేసీఆర్ మ్యానిఫెస్టో మోసాలతో కూడుకున్నది అయితే.. తమ మ్యానిఫెస్టో వాస్తవాలతో కూడినదని వెల్లడించారు.
పైనా కట్టే ప్రాజెక్ట్‌లను చంద్రబాబు ఎలా ఆపుతాడు.. కేవలం ఒటమి భయంతోనే టీఆర్‌ఎస్ నాయకులు ఇలా అబద్దాలు ప్రచార చేస్తున్నారని కోమటిరెడ్డి మండి పడ్డారు. మహిళా మంత్రి లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మా గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment