హైదరాబాద్: బీసీలు సంఘటితమైతే రాజ్యాధికారం దానంతట అదే వస్తుందని టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ కులసంఘాల జేఏసీ కన్వీనర్ కుందారం గణేశాచారి అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘బీసీల అలయ్–బలయ్’ పేరిట ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో ఐక్యత లేకపోతే పాలకులు అసలు పట్టించుకోరన్నారు.
బీసీలకు ఈరోజు కాకున్నా ఎప్పుడో ఒకరోజు రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. బీసీల్లో ఐకమత్యం రానంత వరకు అగ్రకులాల పెత్తనం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నా రు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు బీసీ క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. సహేతుకమైన నిర్ణయంతో బీసీలందరూ ముందుకు వెళ్లాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సూచించారు. కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment