Decorating items
-
మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..
ఇటీవల కాలంలో వివిధ సాంప్రదాయ భారతీయ కళారూపాలు గృహాలంకరణ ద్వారా కొత్త వ్యక్తీకరణ, గుర్తింపును పొందాయి. ఇవి మన దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘లైఫ్ ఎన్ కలర్స్’ దేశం గుర్తింపుతో రూపొందించిన విభిన్న కళారూపాలను అందిస్తోంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని తిరిగి ఊహించుకోవడానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్స్ బెస్పోక్ వాల్పేపర్లు, వాల్ ఆర్ట్, ప్రాచీన వారసత్వ కట్టడాలు కళ్లకు కడతాయి. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తాయి. భారతీయ కళాత్మకతకు ప్రపంచవ్యాప్త ప్రశంసను అందిస్తున్నాయి. రాజస్థాన్ రాజభవన కుడ్యచిత్రాలు, క్లిష్టమైన పెయింటింగ్స్ చాలా కాలంగా మన దేశీయ సంపదకు పర్యాయపదంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ గంభీరమైన కోట గోడలను అలంకరించాయి. శౌర్యం, శృంగారం, ఆధ్యాత్మికత కథలను కళ్లకు కడుతున్నాయి. ఉదాహరణకు.. మేవార్ ఇండియన్ ఎంబ్రాయిడరీ వాల్ ఆర్ట్ తీసుకుంటే ఇది రాజ్‌పుత్ పెయింటింగ్స్ శైలిలో పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపుల స్పష్టమైన చిత్రణతో ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ రాజస్థానీ కళాత్మకత కాలాతీత ఆకర్షణను కలిగిస్తుంది. ఇవి ఏ ఇంటికి అయినా అందమైన వెలుగును నింపుతున్నాయి.పహారీ కళ.. ప్రతి స్ట్రోక్‌లో ప్రశాంతతపహారీ (కాంగ్రా) మినియేచర్ పెయింటింగ్ స్కూల్ వివరణాత్మక ప్రకృతి దృశ్యాలు, రాధా–కృష్ణ ఇతివృత్తాల భావోద్వేగ చిత్రణలకు ప్రసిద్ధి చెందింది. ఈ సున్నితమైన కళాత్మకత లైఫ్ ఎన్ కలర్స్ సృష్టిలో సజీవంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లో ప్రకృతి, పహారీ కళ ప్రశాంతత ఏ గదినైనా స్వర్గధామంగా మారుస్తుంది.సంప్రదాయాల కోల్లెజ్భారతీయ మినియేచర్ పెయింటింగ్‌లు, వాటి శక్తివంతమైన రంగులు, సంక్లిష్టమైన వివరాలతో, చాలా కాలంగా రాజ న్యాయస్థానాలు, దైవిక ప్రేమ, ప్రకృతి సౌందర్యం కథలను చెబుతున్నాయి. మొఘల్, రాజ్‌పుత్, ఇత ప్రాంతీయ కళా పాఠశాలల నుండి ఉద్భవించిన ఈ మినియేచర్ కళాఖండాలు, వాటి గొప్ప షేడ్స్‌తో ఆధునిక డిజైన్‌ను ప్రేరేపిస్తాయి. లైఫ్ ఎన్ కలర్స్ ఈ గొప్ప సంప్రదాయాలను దాని శుద్ధి చేసిన సేకరణల ద్వారా జీవం ΄ోస్తున్నాయి. షాన్, ఇండియన్ సీనిక్ డిజైన్ కస్టమైజ్డ్ వాల్‌పేపర్ మొఘల్ మినియేచర్ల సున్నితమైన ఆకర్షణ నుండి తీసిన పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపు చిత్రణను అద్భుతంగా అందిస్తుంది. (చదవండి: ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!) -
ఇంటి డెకరేషన్లో ఇవి పాటిస్తే... రాజసం ఉట్టిపడుతుంది
ఇల్లు రాజుల కోటలా తలపించాలన్నా.. మన సృజన కళగా కనిపించాలన్నా.. ఓల్డ్ స్టైల్ విండో ఫ్రేమ్స్‌ని ఫిక్స్ చేయాల్సిందే! గుజరాత్, రాజస్థాన్ కోట గోడలపై ఉండే కిటికీలను పోలిన ఈ ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఇంటి డెకార్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఫొటో ఫ్రేమ్ మోడల్ అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంట్లో వారి ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి గోడకు అలంకరించాలి. వాల్ విండో అయితే ఆ గదికి గంభీరమైన సొగసును ఇస్తుంది. వుడెన్ హ్యాంగింగ్ పాతకాలం నాటి విండో మోడల్స్‌లో కలపతో తయారైన హ్యాంగింగ్స్ కూడా లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. బ్రాస్ మెటీరియల్ వుడెన్ విండో ఫ్రేమ్స్ ప్రాచీన కళ ఉట్టిపడేలా చేస్తాయి. మందిరం స్టైల్లో.. పూజా మందిరం స్టైల్లో ఉండే విండ్ ఫ్రేమ్స్ కూడా గోడపైన కొలువుదీరుతున్నాయి. వీటిలో దేవతావిగ్రహాలు, లేదా దీపాలంకరణ.. ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. కాగితాలతోనూ... వుడ్, ప్లాస్టిక్, ఐరన్ మెటీరియల్‌తోనే కాదు మందపాటి అట్ట ముక్కలతోనూ విండో వాల్ ఆర్ట్ పీసెస్‌ను తయారుచేయవచ్చు. క్రాఫ్ట్ తయారీలో ఇదీ భాగమైందిప్పుడు. -
పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!
న్యూయార్క్: చాలామంది ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా వాటిని ఏదో విధంగా వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదే తరహాలో ఒకామె కొన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి పువ్వులను తయారు చేసింది. పైగా వాటిని తన ఇంటి టెర్రస్ పై నుంచి కింద వరకు ఒక సన్న జాజి తీగ లత మాదిరిగా పూలన్ని పరుచుకుంటూ కింద నేలవరకు ఉంటాయి. అది ఎంత ఆకర్షణీయంగా ఉండటమే మనం మన దృష్టిని మరల్చకుండా అలా చూస్తుండేపోయేలా అందంగా ఉంటాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...అమరికాకు చెందిన ఫియోనా అనే 53 ఏళ్ల మహిళ క్రిస్మస్ సందర్భంగా తన ఇంటిని అలంరకరించే నిమిత్తం తన ఇరుగు పొరుగు వారి దగ్గర్నుంచి బాటిల్స్ సేకరిస్తోంది. ఆ తర్వాత ఆమె బాటిల్స్ అడుగు భాగన కత్తిరించి యాక్రిటిక్ పేయింటింగ్‌తో పువ్వుల్లా తయారు చేస్తుంది. చూడటానికి గుండ్రని విత్తన గుళికలతో కూడిన గుల్మకాండ మొక్కలు మాదిరి గసగసాల పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. నిజానికి అవి నిజమైన పూవులు మాదిరిగా ఉంటాయి. ఈ మెరకు ఫియోనా ఈ క్రాఫ్ట్‌ని 2014లో వేవ్ డిస్ ప్లే ప్రేరణతో తయారు చేసినట్టు చెప్పింది.పైగా అవి 12 అడుగులు పొడవుతో తన ఇంటి మొదటి అంతస్థు కిటికి నుండి కింద నేల వరకు పరుచుకుని అందమైన పూల లతలా ఉంటుంది. ఈ విధంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పూలతో తన ఇంటిని మొత్తం అందంగా అలంకరించింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
సెకండ్ వేవ్: లగ్గాలపై కరోనా పగ్గాలు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డా రు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. 29 నుంచి జూలై 4 వరకు ముహూర్తాలు.. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్డౌన్, అనంతరం అన్‌లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి.. ఎంత మందిని పిలవా లి.. ఎంత మందికి భోజనాలు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. వస్త్ర వ్యాపారులు ఖాళీగా కూర్చునే పరిస్థితి.. వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్నాయి. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్‌తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియ డం లేదని వ్యాపారులు అంటున్నారు. రవాణా వ్యవస్థపై ప్రభావం.. శుభకార్యాల వల్ల ఆర్టీసీతోపాటు పలు ప్రైవేట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్టీసీ అద్దె బస్సుల చార్జీలను ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఆదాయం అంతగా రావడం లేదు. ప్రైవేటులో ఒక్కో వాహనానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సుమారు 5 వేల వరకు ఉంటాయి. వీటిపై ఆధారపడిన వాహన యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధికి సెకండ్ వేవ్‌తో గండి పడింది. మూగబోనున్న బ్యాండ్ మేళం.. గృహప్రవేశాలు, వివాహాల్లో బ్యాండ్ మేళం అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక్కో శుభకార్యానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో టీంలో నలుగురి నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాండ్ మేళం మూగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెకరేషన్ వారిదీ ఇదే పరిస్థితి.. శుభకార్యాల్లో డెకరేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ఇందుకోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. కరోనాతో ఈ రంగంపై ఆధారపడి బతికేవా రు ఉపాధి కోల్పోనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేల మందిపై సెకండ్ వేవ్ ప్రభావం పడనుంది. వంటవాళ్లకు గడ్డు పరిస్థితులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద కల్యాణ మండపాలు 100, మధ్య తరహావి 150 వరకు, సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థలకు అనుబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది శుభకార్యాల సందర్భంగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, భోజనాలు తయారు చేయిస్తుంటారు. 1,000 మందికి భోజనం వడ్డించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో 15 నుంచి 20 శాతం నిర్వాహకులకు ఆదాయంగా మిగులుతుంది. కరో నా కారణంగా వంట చేసేవాళ్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. -
ముచ్చటైన మూతలు
ఇటీవలి కాలంలో వస్తువుల రీసైక్లింగ్‌ను అందరూ ఆదరిస్తున్నారు. ఇంట్లోకి డెకరేటింగ్ ఐటమ్స్‌లో అయితే అసలు చెప్పనక్కర్లేదు. మరి మీకూ ఇంట్లోనే రీసైకిల్డ్ బొమ్మలను తయారు చేసి... అందరి చేత వహ్వా అనిపించుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం... ఓ సారి పక్కనున్న ఫొటోలను చూడండి. తాగేసిన కూల్ డ్రింక్ మూతలతో డెకరేటింగ్ ఐటమ్స్ (ఉదాహరణకు పక్షుల బొమ్మలు)ను తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... ఒక్కో మూతకు గ్లూ (పవర్ఫుల్ గ్లూ) పెట్టి, ఇంకో మూత ను దానికి అతికించాలి. అలా ఏ ఆకారంలోని పక్షులనైనా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫొటోలు, గోడకు తగిలించే అద్దాల ఫ్రేములుకు ఈ మూతలను అతికిస్తే.. అవి అందంగా చిత్రంగా కనిపిస్తాయి. ఇంకా వీటితో చేసిన డబ్బాలను వంట గదిలో వాడుకోవచ్చు. అంతేకాకుండా.... వీటికి రంధ్రాలు పెట్టి, అన్నింటినీ తాడు లేదా తీగకు గుచ్చి విండ్ చైమ్స్గానూ మార్చుకోవచ్చు. పెరట్లోని చెట్టుకు లేదా వరండాలో తగిలిస్తే... చూసే వారికి ఇవి భలేగా నచ్చుతాయి. అలాగే పెరట్లో చెట్ల మధ్య ఉండే దారిలో ఈ మూతలను పేర్చినా, టేబుళ్లకు డిజైన్‌గా అతికించినా ఆ అందమే వేరు. ఫొటోలను చూస్తుంటేనే.. ఎప్పుడెప్పుడు వీటిని తయారు చేసుకోవాలా అని ఉంది కదూ..