ఇల్లు రాజుల కోటలా తలపించాలన్నా.. మన సృజన కళగా కనిపించాలన్నా.. ఓల్డ్ స్టైల్ విండో ఫ్రేమ్స్‌ని ఫిక్స్ చేయాల్సిందే! గుజరాత్, రాజస్థాన్ కోట గోడలపై ఉండే కిటికీలను పోలిన ఈ ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఇంటి డెకార్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఫొటో ఫ్రేమ్ మోడల్
అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంట్లో వారి ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి గోడకు అలంకరించాలి. వాల్ విండో అయితే ఆ గదికి గంభీరమైన సొగసును ఇస్తుంది.
వుడెన్ హ్యాంగింగ్
పాతకాలం నాటి విండో మోడల్స్‌లో కలపతో తయారైన హ్యాంగింగ్స్ కూడా లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. బ్రాస్ మెటీరియల్ వుడెన్ విండో ఫ్రేమ్స్ ప్రాచీన కళ ఉట్టిపడేలా చేస్తాయి.
మందిరం స్టైల్‌లో..
పూజా మందిరం స్టైల్‌లో ఉండే విండ్ ఫ్రేమ్స్ కూడా గోడపైన కొలువుదీరుతున్నాయి. వీటిలో దేవతావిగ్రహాలు, లేదా దీపాలంకరణ.. ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి.
కాగితాలతోనూ...
వుడ్, ప్లాస్టిక్, ఐరన్ మెటీరియల్‌తోనే కాదు మందపాటి అట్ట ముక్కలతోనూ విండో వాల్ ఆర్ట్ పీసెస్‌ను తయారుచేయవచ్చు. క్రాఫ్ట్ తయారీలో ఇదీ భాగమైందిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment