సాధారణంగా మంచి మాటలు, మంత్రాలు, కొటేషన్స్‌ను బడులు, గుడులలో చూస్తుంటాం. వాటినిప్పుడు ఇళ్లల్లోనూ ప్లేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. ఎలాగంటే.. రీడింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఏదైనా ఒక గోడను ఎంపిక చేసుకుని.. సానుకూల ఆలోచనలను ప్రేరేపించే మంచి మాటలతో ఒక వాల్ పేపర్‌ను ఆ గోడ మీద అలంకరించవచ్చు. ఇది పెద్దల పెంపకాన్నీ.. పిల్లల ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఆ గది వాతావరణాన్ని మారుస్తుంది.
ఫొటో ఫ్రేమ్స్..
కోట్స్ లేదా చాంట్స్‌తో ఫొటో ఫ్రేమ్స్‌ను తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో లభించే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటివల్ల ఆ గది హుందాగా కనపడుతుంది.
పూజ గది..
ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గది ఉంటే.. నచ్చిన శ్లోకాలతో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అందమైన అక్షరాలతో కార్నర్ ప్లేస్‌లో గోడను తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ అలంకరణల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఇవి చదవండి: ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment