సాక్షి, విద్యానగర్(కరీంనగర్): గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డా రు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది.
29 నుంచి జూలై 4 వరకు ముహూర్తాలు..
ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్‌డౌన్, అనంతరం అన్‌లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి.. ఎంత మందిని పిలవా లి.. ఎంత మందికి భోజనాలు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.
వస్త్ర వ్యాపారులు ఖాళీగా కూర్చునే పరిస్థితి..
వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్నాయి. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్‌తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియ డం లేదని వ్యాపారులు అంటున్నారు.
రవాణా వ్యవస్థపై ప్రభావం..
శుభకార్యాల వల్ల ఆర్టీసీతోపాటు పలు ప్రైవేట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్టీసీ అద్దె బస్సుల చార్జీలను ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఆదాయం అంతగా రావడం లేదు. ప్రైవేటులో ఒక్కో వాహనానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సుమారు 5 వేల వరకు ఉంటాయి. వీటిపై ఆధారపడిన వాహన యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధికి సెకండ్ వేవ్‌తో గండి పడింది.
మూగబోనున్న బ్యాండ్ మేళం..
గృహప్రవేశాలు, వివాహాల్లో బ్యాండ్ మేళం అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక్కో శుభకార్యానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో టీంలో నలుగురి నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాండ్ మేళం మూగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెకరేషన్ వారిదీ ఇదే పరిస్థితి..
శుభకార్యాల్లో డెకరేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ఇందుకోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. కరోనాతో ఈ రంగంపై ఆధారపడి బతికేవా రు ఉపాధి కోల్పోనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేల మందిపై సెకండ్ వేవ్ ప్రభావం పడనుంది.
వంటవాళ్లకు గడ్డు పరిస్థితులు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద కల్యాణ మండపాలు 100, మధ్య తరహావి 150 వరకు, సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థలకు అనుబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది శుభకార్యాల సందర్భంగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, భోజనాలు తయారు చేయిస్తుంటారు. 1,000 మందికి భోజనం వడ్డించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో 15 నుంచి 20 శాతం నిర్వాహకులకు ఆదాయంగా మిగులుతుంది. కరో నా కారణంగా వంట చేసేవాళ్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment