
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంధువులు, స్నేహితులందరి మధ్య వైభవోపేతంగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు లైవ్ షోల ద్వారా జరుగుతుండటంతో బంధువులు కూడా ఆన్ లైన్ లోనే దీవెనలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బెక్కల్ గ్రామానికి చెందిన చౌదరి వెంకటమ్మ–కనకయ్య దంపతుల కూతురు ఆమనికి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీలా నిర్మల – మల్లేశం దంపతుల కుమారుడు జీలా అనిల్ (మై విలేజ్ ఫేం)తో వివాహం నిర్ణయించారు.
మండల పరిధిలోని బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం కేవలం 30 మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ వివాహాన్ని ఆన్ లైన్ లో ద్వారా లైవ్ ఇవ్వగా... బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారానే కొత్తజంటను ఆశీర్వదించారు. కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ వివాహానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment