ముచ్చటైన మూతలు
ఇటీవలి కాలంలో వస్తువుల రీసైక్లింగ్‌ను అందరూ ఆదరిస్తున్నారు. ఇంట్లోకి డెకరేటింగ్ ఐటమ్స్‌లో అయితే అసలు చెప్పనక్కర్లేదు. మరి మీకూ ఇంట్లోనే రీసైకిల్డ్ బొమ్మలను తయారు చేసి... అందరి చేత వహ్వా అనిపించుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం... ఓ సారి పక్కనున్న ఫొటోలను చూడండి. తాగేసిన కూల్ డ్రింక్ మూతలతో డెకరేటింగ్ ఐటమ్స్ (ఉదాహరణకు పక్షుల బొమ్మలు)ను తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... ఒక్కో మూతకు గ్లూ (పవర్‌ఫుల్ గ్లూ) పెట్టి, ఇంకో మూత ను దానికి అతికించాలి. అలా ఏ ఆకారంలోని పక్షులనైనా తయారు చేసుకోవచ్చు.
అలాగే ఫొటోలు, గోడకు తగిలించే అద్దాల ఫ్రేములుకు ఈ మూతలను అతికిస్తే.. అవి అందంగా చిత్రంగా కనిపిస్తాయి. ఇంకా వీటితో చేసిన డబ్బాలను వంట గదిలో వాడుకోవచ్చు. అంతేకాకుండా.... వీటికి రంధ్రాలు పెట్టి, అన్నింటినీ తాడు లేదా తీగకు గుచ్చి విండ్ చైమ్స్‌గానూ మార్చుకోవచ్చు. పెరట్లోని చెట్టుకు లేదా వరండాలో తగిలిస్తే... చూసే వారికి ఇవి భలేగా నచ్చుతాయి. అలాగే పెరట్లో చెట్ల మధ్య ఉండే దారిలో ఈ మూతలను పేర్చినా, టేబుళ్లకు డిజైన్‌గా అతికించినా ఆ అందమే వేరు. ఫొటోలను చూస్తుంటేనే.. ఎప్పుడెప్పుడు వీటిని తయారు చేసుకోవాలా అని ఉంది కదూ..