Recycling goods
-
Home Creations: ఒంటి అలంకరణ వస్తువులతో ఇంటి అలంకరణ
ఇంటిని అందంగా అలంకరించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. ఉన్న వస్తువులతో రీ సైక్లింగ్ చేసే పద్ధతులు తెలుసుకుంటే చాలు ఇంటిని వినూత్నంగా మార్చుకోవచ్చు. అందుకు ఫ్యాషన్ యాక్ససరీస్ అదేనండీ ఒంటి అలంకరణ వస్తువులను చూపులను ఆకట్టుకునే విధంగా ప్రతి పీస్‌ను ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. చెవి రింగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్, వేసుకునే హై హీల్స్, పట్టుకొనే గొడుగు.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం. ఫ్యాషన్ యాక్ససరీస్ ఉపయోగించేవాటికన్నా పక్కన పెట్టేసేవి ఎక్కువే ఉంటాయి. అంతగా కొని దాచిపెట్టేస్తారు కాబట్టి, వీటితోనే ఇంటి అలంకరణ చేసేస్తే.. ఇంట్లో వారి మెప్పుతో పాటు ఇంటికి వచ్చే అతిథులు మార్కులు కూడా కొట్టేయొచ్చు. అయితే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం... సిల్క్ స్కార్ఫ్ బయటకు వెళితే కుర్తీ, టాప్‌కి కాంబినేషన్‌గా మెడలో స్కార్ఫ్ ఉండాల్సింది. అందమైన స్కార్ఫ్‌లు ఎన్నో మీ వద్ద ఉండే ఉంటాయి. కొన్ని స్కార్ఫ్ల డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రేమ్‌లో స్కార్ఫ్‌ని సెట్ చేస్తే, అందమైన వాల్ ఆర్ట్ అలంకరణకు రెడీ. ఇందుకు ఫ్రేమ్ ఎంపిక ఒక్కటే మీ ఛాయిస్. మీ అభిరుచిని బట్టి ఎన్ని స్కార్ఫ్‌లు అయినా మార్చుకుంటూ రోజుకో ఆర్ట్‌ని ఆస్వాదించవచ్చు. వేలాడే జూకాలు అతివల హృదయానికి చేరువగా ఉండేది ఆర్ట్. అందుకే, వారికి కావల్సిన ప్రతీ వస్తువూ కళాత్మకంగా ఉండేది ఎంచుకుంటారు. వాటిలో చెవి రింగులు ప్రధానమైనవి. ఒక మంచి ఫ్రేమ్‌లో అమర్చి, లివింగ్ రూమ్‌లో అలంకరించి, ఆ అందమైన తేడాను మీరే గమనించవచ్చు. బరువైన బ్యాంగిల్.. పేపర్‌వెయిట్ ఇత్తడి, రాగి, గాజు మెటీరియల్‌తో తయారైన సింగిల్ హెవీ బ్యాంగిల్స్‌ను మన దగ్గర చాలానే ఉంటాయి. బరువుగా ఉందనో, మరోసారి వాడుదామనో పక్కన పెట్టేసిన ఇలాంటి గాజును టేబుల్ పెపర్వెయిట్గా ఉపయోగించుకోవచ్చు. వీటి డిజైన్ కూడా చాలా కళాత్మకంగా ఉండటంతో చూడగానే ఆకట్టుకుంటుంది. గొడుగు దీపాల జిలుగులు ఎండ, వానల సమయాల్లో అందమైన గొడుగుల సంఖ్య మన దగ్గర చేరుతూనే ఉంటాయి. ఏదైన టూర్లకు వెళ్లినప్పుడు కూడా చిన్న చిన్న గొడుగులను సేకరించే అలవాటు ఉంటుంది. వీటిని ఇలా విద్యుత్ దీపాలకు అడ్డుగా పెట్టి, ఇంటి అలంకరణలో రెట్టింపు కళ తీసుకురావచ్చు. బ్యాగులే శిల్పాలు పాడైన ఫ్యాన్సీ బ్యాగులు, క్లచ్‌లు, శాండల్స్, ఉపయోగించని లిప్‌స్టిక్ వంటివి కవర్లో పెట్టి, మూలన పడేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంచెం సృజనాత్మకత జోడించి, శిల్పాలుగా మార్చుకోవచ్చు. ఇంటి గ్లాస్ షోకేస్‌లో అందంగా అలంకరించుకోవచ్చు. మీకు కావల్సిందల్లా కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత.. ఇలా మీ ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉన్న వస్తువులతోనే ఇంటిని కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: Home Creations: అలంకరణలో ఇదో విధం..! -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
ప్లాస్టిక్ భూతం.. అంతానికి పంతం
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణవిుంచింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచి్చన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అనర్థాలపై పౌరసమాజం స్పందిస్తోంది. ఇదిలా ఉద్యమరూపం సంతరించుకుంటే ఉపద్రవం తొలగుతుందన్న భరోసా కలుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్ ఫోమ్ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్ పీనట్స్, కోట్ హ్యాంగర్స్, యోగర్ట్ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. రీసైక్లింగ్ మేనేజ్ చేయగలిగినవి ప్యాకేజింగ్ ఫిలిం, షాపింగ్ బ్యాగ్స్, బబుల్ ర్యాప్, ఫ్లెక్సిబుల్ బాటిల్స్, వైర్ అండ్ కేబుల్ ఇన్సులేషన్, బాటిల్ టాప్స్, డ్రింకింగ్ స్ట్రాస్, లంచ్ బాక్సులు, ఇన్సులేటెడ్ కూలర్లు, ఫ్య్రాబ్రిక్ అండ్ కార్పెట్ టారప్స్, డైపర్స్. తెనాలి (గుంటూరు జిల్లా): ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్ అండ్ త్రో’ ప్లాస్టిక్ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువులకు కూరగాయలు... గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి తెనాలిలో రోజుకు అర టన్ను చొప్పున నెలకు 15 టన్నులు ప్లాస్టిక్ చెత్త వస్తోంది. రీసైక్లింగ్‌కు వీలుకాని 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను మున్సిపాలిటీ నిషేధించింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తడిచెత్త, పొడిచెత్త పేరుతో వేర్వేరుగా చెత్తను సేకరించటమే కాకుండా ప్లాస్టిక్ చెత్తను కూడా సేకరిస్తున్నారు. ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత ఇక్కడి గాంధీనగర్ రైతుబజారులో ‘ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి వెళ్లండి...కూరగాయలు తీసుకెళ్లండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా చేపట్టారు. స్వచ్ఛందంగా ముందు కొచ్చిన రైతులు షేక్ అబ్దుల్ రషీద్, రావిపూడి శ్రీనివాసరావు స్టాల్స్‌లో అమలు చేస్తున్నారు. ‘ప్లాస్టిక్‌కు బదులుగా కూరగాయలు’ ప్రారంభంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ బీవీ రమణ తదితరులు ఉచితంగా క్లాత్ బ్యాగులు.. ప్రతిరోజూ 10 కిలోలకు పైగా వస్తువులను ఇచ్చి కూరగాయలు తీసుకెళుతున్నట్టు రైతుబజారు ఏస్టేట్ అధికారి గుంటూరు రమేష్ చెప్పారు. ప్లాస్టిక్‌ను శానిటేషను సిబ్బంది తీసుకెళుతున్నారు. స్పందించిన శారదా సర్వీస్ సొసైటీ నిర్వహించిన వైద్యశిబిరంలో, గుడ్డతో చేసిన చేతిసంచులను ప్రజలకు పంపిణీ చేయటం విశేషం. ఇదేరీతిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ సంస్థ పేరుతో 500 చేతిసంచులను రూపొందించి, సభ్యులకు, స్థానికులకు పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ వస్తువులకు నోటుపుస్తకాలు... నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు సహకారంతో కృష్ణా బాలకార్మిక విద్యాలయ పథకం ఇదే తరహాలో ప్లాస్టిక్ సేకరణకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలోని పాఠశాలలో విద్యార్థులను కలిశారు. ఎవరైతే ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను సేకరించి తీసుకొస్తారో వారికి నోటు పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాఠశాల్లోని 120 మంది విద్యార్థులు కాలనీలో తిరిగి, వ్యర్థాలను సేకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయరెడ్డికి అందజేశారు. తొలిరోజునే ఆ విధంగా 50 కిలోల ప్లాస్టిక్ చెత్త వచ్చింది. కిలోకు లాంగ్ సైజ్ నోటుబుక్ చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ విధానాన్ని కొనసాగిసూ్తనే కృష్ణాజిల్లాలోని 16 బాల కార్మిక పాఠశాలల్లో అమలు చేస్తామని ఆంజనేయరెడ్డి ప్రకటించారు. సేకరించిన ప్లాస్టిక్ చెత్తను విజయవాడ నగర పాలక సంస్థకు అప్పగిస్తున్నారు. ఎక్స్పైరీ తేదీ లేని ప్లాస్టిక్... ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది...ప్లాస్టిక్ మినహా అని చెప్పాలి. వీటిలో ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్ మూతలు, స్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్లెట్లు, చిప్స్ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని వెల్లడెంది. రీసైక్లింగ్ చేయదగిన వస్తువులు... బేవరేజ్ బాటిల్స్, ఫుడ్ జార్స్, క్లాతింగ్ అండ్ కార్పెట్ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్ బాటిల్స్.డిటర్జంట్, బ్లీచ్ బాటిల్స్, స్నాక్ బాక్సులు, మిల్కా జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్ ఫర్నిచర్, చెత్త కుండీలు రీసైక్లింగ్ అతికష్టం క్రెడిట్ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్స్, వైర్, కేబుల్, సింథటిక్ లెదర్, నైలాన్ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్ డిసు్కలు, మెడికల్ స్టోరేజి కంటైనర్స్, కార్ పార్ట్స్, వాటర్ కూలర్ బాటిల్స్. ఉడతా భక్తి సాయం... ఆరేళ్లుగా రైతుబజారులో ఉంటున్నా...ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఆ చెత్త సేకరణకు నేనూ, మరో రైతు ఉడతాభక్తిలా సహకరించాలని ప్లాస్టిక్‌ను తీసుకుని కూరగాయలు ఇస్తున్నాం. కనీసం ఒక నెలరోజులు ఇస్తాం. – షేక్ అబ్దుల్ రషీద్, రైతు రాష్ట్రంలోనే తొలిసారి... రైతుబజారులో ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని కూరగాయలు ఉచితంగా ఇవ్వడం ఇదే తొలిసారి. సామాజిక బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం. – గుంటూరు రమేష్, ఏస్టేట్ అధికారి, రైతుబజారు -
టీడీపీ నేత అవినీతి గుట్టురట్టు
వినుకొండ టౌన్ / రూరల్ : అధికార పార్టీ నాయకుని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రిసైక్లింగ్ జరుగుతుండగా కార్మికుడు మృతి చెందడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సనిశెట్టి లక్మీనారాయణ మండలంలోని తిమ్మాయిపాలెం దళితవాడలో కొంత కాలంగా సాయి శరణ్య రైస్‌మిల్లు నడుపుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసి వాటిన రైస్‌గా తయారు చేసి విక్రయించాల్సిన ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. రేషన్ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి మిల్లులో పాలిష్ చేసి ఇతర ప్రదేశాలకు రవాణా చేస్తున్నాడు. బియ్యాన్ని రిసైక్లింగ్ చేస్తుండగా బడ్డీ ఒక్కసారిగా కూలిపోయి మిల్లు డ్రైవర్ షేక్‌హుస్సేన్(35) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. అధికారుల కనుసన్నల్లో రేషన్ బియ్యం రవాణ అధికారుల కనుసన్నల్లో పేదల బియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఉదయం 8 నుంచి 9గంటల మధ్య జరిగితే సాయంత్ర 4గంటల వరకు ఏఒక్క అధికారి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీఆర్వో సునీతకు ఉదయం 10గంటల సమయంలో వీఏవో కోటయ్య సమాచారం అందిచాడని చెబుతున్నారు. సమాచారాన్ని ఆమె తహసీల్దారు గౌస్బుడేసాహెబ్కు 12గంటల ప్రాంతలో చెప్పినట్లు విలేకర్లతో చెప్పారు. రైస్ మిల్లు డ్రైవర్ బడ్డి కింద ఇరుక్కు పోయి ఉంటే హుటాహుటిన అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నేతల బెదిరిపులకు తలొగ్గిన అధికారులు వీఆర్వో సునీత మిల్లును సందర్శించి అక్కడకు అధికారులను రప్పించాల్సి ఉండగా, అక్కడ ఎందుకులేరన్న వాదనలు విన్పిస్తున్నాయి. కొందరు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల మిల్లును ఏ అధికారి కూడా వెంటనే సందర్శించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు సంఘటన జరిగిన సమయంలో లారీలకు బియ్యం లోడుచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మిల్లులో దాదాపు 350 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి నెలా గ్రామాల్లో బియ్యాని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి రవాణా చేయడం పరిపాటిగా మారింది. గత ఏడాది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అధికారుల పట్టుకున్న రేషన్ బియ్యం ఇక్కడ నుంచే రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. యాజమానికి కొమ్ముకాస్తున్న అధికారులు మిల్లు డ్రైవరు మృతిచెందిన విషయాన్ని యాజమాన్యం మధ్యాహ్నం వరకు గోప్యంగా ఉంచింది. మృతదేహన్ని వినుకొండకు తరలించిన తర్వాత మిల్లులో ఉన్న సుమారు మూడు లారీల బియ్యాన్ని మార్కెటు యార్డులోని కూలీలతో బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమ రేషన్ బియ్యానికి కాపలా కాచిన సీఎస్‌డీటీ మృతి చెందిన హుస్సేన్‌ను వినుకొండ ప్రభుత్వవైద్యశాలకు తరలించిన అనంతరం సీఎస్‌డీటీ జాన్‌సైదులు మిల్లు వద్దకు వచ్చారు. అదే సమయంలో కూలీలు బియ్యాన్ని సంచులకు ఎత్తుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. మిల్లు వద్ద ఆయనే నిలబడి బియ్యాన్ని బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి వినుకొండ తహసీల్దార్ గౌస్ బుడేసాహెబ్, ఆర్ఐ మురళీ, వీఆర్వో సునీత మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని చూసి అవాక్కయ్యారు. మిల్లును పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన వైనాన్ని తెలుసుకొనేందుకు వినుకొండ టౌన్, రూరల్ సీఐలు టి.వి. శ్రీనివాసరావు, బి. కోటేశ్వరరావు మిల్లును పరిశీలించారు. కొంతకాలంగా రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముచ్చటైన మూతలు
ఇటీవలి కాలంలో వస్తువుల రీసైక్లింగ్‌ను అందరూ ఆదరిస్తున్నారు. ఇంట్లోకి డెకరేటింగ్ ఐటమ్స్‌లో అయితే అసలు చెప్పనక్కర్లేదు. మరి మీకూ ఇంట్లోనే రీసైకిల్డ్ బొమ్మలను తయారు చేసి... అందరి చేత వహ్వా అనిపించుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం... ఓ సారి పక్కనున్న ఫొటోలను చూడండి. తాగేసిన కూల్ డ్రింక్ మూతలతో డెకరేటింగ్ ఐటమ్స్ (ఉదాహరణకు పక్షుల బొమ్మలు)ను తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... ఒక్కో మూతకు గ్లూ (పవర్ఫుల్ గ్లూ) పెట్టి, ఇంకో మూత ను దానికి అతికించాలి. అలా ఏ ఆకారంలోని పక్షులనైనా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫొటోలు, గోడకు తగిలించే అద్దాల ఫ్రేములుకు ఈ మూతలను అతికిస్తే.. అవి అందంగా చిత్రంగా కనిపిస్తాయి. ఇంకా వీటితో చేసిన డబ్బాలను వంట గదిలో వాడుకోవచ్చు. అంతేకాకుండా.... వీటికి రంధ్రాలు పెట్టి, అన్నింటినీ తాడు లేదా తీగకు గుచ్చి విండ్ చైమ్స్గానూ మార్చుకోవచ్చు. పెరట్లోని చెట్టుకు లేదా వరండాలో తగిలిస్తే... చూసే వారికి ఇవి భలేగా నచ్చుతాయి. అలాగే పెరట్లో చెట్ల మధ్య ఉండే దారిలో ఈ మూతలను పేర్చినా, టేబుళ్లకు డిజైన్‌గా అతికించినా ఆ అందమే వేరు. ఫొటోలను చూస్తుంటేనే.. ఎప్పుడెప్పుడు వీటిని తయారు చేసుకోవాలా అని ఉంది కదూ..