wonder
-
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తన స్వగ్రామమైన ఉజ్జయిని సందర్శించారు. నగరవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఒక విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా నేతలెవరూ రాత్రి వేళ ఉజ్జయినిలో బస చేయరు. దీనివెనుక వందల ఏళ్లుగా అనేక మూఢనమ్మకాలు స్థానికులలో నాటుకుపోయాయి. అయితే వీటన్నింటినీ కాదని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి గడిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రిపూట ఉండటం ద్వారా వందల సంవత్సరాల నాటి మూఢనమ్మకాన్ని బద్దలు కొట్టారు. ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లోని ఒక ధార్మిక నగరం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరం ఇక్కడే ఉంది. మహాకాళేశ్వరుడు ఉజ్జయినికి రాజు అని స్థానికులు నమ్ముతారు. మహాకాళేశ్వరుడు తప్ప మరే నాయకుడు లేదా మంత్రి ఇక్కడ రాత్రివేళ ఇక్కడ ఉండకూడదని చెబుతారు. ఈ నమ్మకాన్ని కాదని ఎవరైనా ప్రవర్తిసే వారికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని స్థానికులు అంటారు. నేటికీ ఉజ్జయినిలో ఏ నాయకుడు గానీ, మంత్రిగానీ బస చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి బస చేయడం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అతను ఈ నగర నివాసి అని, పైగా మహాకాళీశ్వరుని భక్తుడైనందున అతను ఇక్కడ సాధారణ వ్యక్తిగా పరిగణలోకి వస్తారని స్థానిక పండితులు అంటున్నారు. ఈ నియమం నగరవాసులకు వర్తించదని, అందుకే ముఖ్యమంత్రి యాదవ్ తన స్వస్థలమైన ఉజ్జయినిలో ఎటువంటి సంకోచం లేకుండా రాత్రి బస చేయవచ్చని వారంటున్నారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయినికి రాజు మహాకాళీశ్వరుడు మాత్రమేనని, తాను అతని సేవకుడినని, తాను ఇక్కడ రాజుగా కాకుండా మహాకాళీశ్వరుని భక్తునిగా కొనసాగుతానన్నారు. ఇది కూడా చదవండి: సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి! -
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?
మనిషి అంతరిక్షంలోకి వెళ్లడంలో విజయం సాధించాడు. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే భూమిపైగల అనేక రహస్యాల చిక్కుముడులు నేటికీ వీడటం లేదు. వాటి గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్‌లో డార్క్ ఎర్త్‌ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్‌లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్‌ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు. డార్క్ ఎర్త్‌ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్‌లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్‌లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్‌ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్‌ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్‌లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు? -
అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్కు చెందిన తాజెవెల్ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్లో దాచివుంచిన లెటర్ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్ ఈ లెటర్‌ను గమనించాడు. తరువాత ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్‌గా మారింది. కార్పెంటర్‌కు ఎలా దొరికిందంటే.. ఫేస్బుక్ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్ అనే ఈ కార్పెంటర్ ఇంటి మెయింటనెన్స్ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్ రూమ్‌లోని తలుపు ఫ్రేమ్‌వర్క్‌పై పడింది. దానిపై ‘నోట్ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్మెంట్ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్‌లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’ జర్నల్ స్టార్‌తో మాట్లాడిన డకోటా మోహ్న్..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్ రూమ్‌లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్’ అని ఉంది. నేను నా సెల్‌ఫోన్‌ను అక్కడ ఫోకస్ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్లోని లెటర్ తెరిచి నోట్ చదివాను’అని తెలిపారు. లెటర్ ఎవరు రాశారంటే.. సోషల్ మీడియాలో ఈ లెటర్ షేర్ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్ రాస్తూ..‘ఈ లెటర్ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్ కాప్స్యూల్ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే.. -
600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!
ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకే పెట్టింది పేరుగా కూడా ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతకి కళలు, శాస్త్రలను ప్రోత్సహింస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న యునెస్కో 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది. ఆ నృత్యకళ మన కళ్లను ఆర్పడమే మర్చిపోయాలా కట్టిపడేస్తుంది. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. ఇది మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తుంటారు. దీన్ని వారు సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల తమకున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది. ఈ నృత్యం చేసేటప్పడూ కొంతమంది పురుషులు బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చొంటారు. అందులో వ్యక్తి స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ..ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్ని ఆక్రమించి కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా..ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ..నలు దిశల్లో తిరుగుతారు. ఆ తర్వాత క్రమంగా కిందకి దిగిపోతారు. అద్భతంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఈ మేరకు యునెస్క్ ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ..వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది. View this post on Instagram A post shared by UNESCO (@unesco) (చదవండి: టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క) -
దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే.. మీరు జీనియస్!
ప్రపంచంలో అనేక చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటి గురించి విన్నప్పుడు,చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే న్యూజిలాండ్‌లోని ఒక పట్టణం పేరు. ఇది ఎంతపెద్దగా ఉంటుందంటే, దానిని పూర్తిగా చదవాలంటే పెద్ద జీనియస్ అయి ఉండాలి. ఆ పొడవైన పేరుగల పట్టణం గురించి, దాని వెనుకగల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పట్టణం ఎక్కడుంది? ఈ విచిత్రమైన పేరు గల పట్టణం న్యూజిలాండ్‌కి దక్షిణాన గల Porangahau పర్వత శ్రేణుల సమీపంలో ఉంది. ఈ పట్టణం పేరు Taumatawhakatangihangako auauotamateaturipukakapikikungungororukupokaiaienuakitanatahu. ఈ అక్షరాలను చూస్తే.. ఎవరో కీబోర్డును అడ్డదిడ్డంగా ఒకేసారి టైప్ చేశారేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఇది ఎంతో ఓపికతో చేసిన టైపింగ్ పదమే. ఇది ఎప్పటిదో అనుకుంటున్నారేమో..నేడు కూడా ఆ పట్టణం పేరు ఇదే. అయితే ఈ పట్టణం పేరును సులభంగా పలికేందుకు Taumata అని పిలుస్తారు. ఈ పట్టణం పేరులో మొత్తం 85 అక్షరాలున్నాయి. ఈ పట్టణం పేరు ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ కారణంగానే ఈ పట్టణం పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యింది. ఈ పేరు అర్థం ఏమిటంటే.. Taumatawhakatangihangakoauauotamateaturipukakapikiku ngungororukupokaiaienuakitanatahu.. ఇంత పెద్ద పేరు చూడగానే ఎవరికైనా దీని అర్థం ఏమిటని మనసులో సందేహం తలెత్తుతుంది. ఈ పదానికి అర్థం ఏమిటంటే..‘ఇది ఎటువంటి ప్రాంతమంటే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, పర్వతాలు అధిరోహించేవారు, ప్రపంచాన్నంతా కలియతిరిగేవారు, సుందరమైన Koauau ఫ్లూట్ వాయించే Tamatea ప్రజలు ఉండే ప్రాంతం’. అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి గురించి తెలుసుకుందాం. అత్యంత పొడవైన పేరు కలిగినందున యువతి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ యువతి పేరు 1000 అక్షరాలకు మించి ఉంటుంది. ఈ పేరు పూర్తిగా చదవాలంటే ఎవరికైనా చెమటలు పడతాయి. ఇంత పెద్ద పేరు కలిగిన ఈ యువతి బర్త్ సర్టిఫికెట్ రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ యువతి పూర్తి పేరు.. Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae renquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive'onchellecaundenesh eaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneya vondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicanneles ciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea'shauwneorali aevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccalovelia tyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloies alynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetia quaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarl inaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequcka gailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiat angoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquin ettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana. ఇది కూడా చదవండి: 56 కి.మీ మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ.. -
తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..
సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్ గుండెను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది. 1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది. ¿SABÍAS QUÉ?EL PRIMER TRANSPLANTE DE CORAZÓNEn el año de 1971 se dió un paso gigante en la historia de la medicina, pues se realizó con éxito el primer trasplante de corazón.La operación fue llevada por el Doctor Christiaan Barnard en la Ciudad del Cabo, capital de #Sudáfrica. pic.twitter.com/5T24TACYmF— Énfasis Comunica (@EnfasisComunica) June 17, 2023 ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్ నార్మన్ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్ గుండెను అమర్చారు. డెనిస్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్‌లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రామ్‌నాయక్ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్ పి వేణుగోపాల్ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు! -
వింత వాహనం.. నేల మీద, నీటిపైనా ఎక్కడైనా ప్రయాణించగలదు!
న్యూజీలాండ్‌కు చెందిన పడవల తయారీ కంపెనీ ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ ఈ పోర్టబుల్ మల్టీయూజ్ పాడ్‌ను రూపొందించింది. చూడటానికి ఇది ఏదో విచిత్ర గ్రహాంతర వాహనంలా కనిపిస్తుంది గాని, ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటి మీద ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ నిపుణులు సునామీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) ఈ వాహనం కిటికీలకు దృఢమైన అద్దాలు, మిగిలిన భాగాలను భారీ నౌకల తయారీకి ఉపయోగించే నాణ్యమైన అల్యూమినియం ఉపయోగించారు. వాహనం లోపల విశాలమైన స్థలం, వాహనంలోనే వివిధ పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా 350 వాట్స్ సామర్థ్యం గల ఇన్వర్టర్ వంటివి ఏర్పాటు చేశారు. వాహనం పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇది పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడుస్తుంది. దీని ధర 61,243 డాలర్లు (రూ.50.40 లక్షలు) మాత్రమే! (sleepisol: ఈ హెడ్సెట్ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!) -
Visakhapatnam: 7 వండర్స్ ఇన్ వైజాగ్
ఏడు ప్రపంచ వింతలు.. వీటిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఒక్కో దిక్కున ఉన్న వీటిని చూసేందుకు చాలా సమయం పడుతుంది. రెక్కలు కట్టుకుని చుట్టుకు రావాలనే కోరిక ఆర్థిక స్తోమత లేక కాళ్లకు బంధాలు వేస్తుంది. ఈ వింతలన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందా? ఇది అసాధ్యమని మాత్రం అనుకోవద్దు. మన వైజాగ్‌లోనే ఉంటూ ఈ వింతలన్నింటినీ ఒకేసారి చూసి ఎంజాయ్ చేసే అవకాశం త్వరలోనే మీ ముందుకు రానుంది. ఏడు వింతలను ప్రతి సృష్టి చేసి.. సరికొత్త అనుభూతిని అందించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఏడు వింతల పార్కే కాదు.. విభిన్న రకాల థీమ్ పార్కులకు శ్రీకారం చుడుతోంది. – సాక్షి, విశాఖపట్నం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న పుడమి తల్లికి పచ్చల హారాన్ని అలంకరించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నగరవాసులకు ఒత్తిడి దూరం చేసి.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలు మేరకు విశాఖ నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మియావాకీ తరహా చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించిన జీవీఎంసీ.. తాజాగా పంచతత్వ పార్కులు, థీమ్ పార్కులు, స్వింగ్ గార్డెన్స్, నక్షత్ర వనాలు.. ఇలా విభిన్న పార్కులను అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 9.88 ఎకరాల్లో రూ.10.92 కోట్లతో తొలివిడతలో 11 పార్కులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. తొలి విడతలో 9 థీమ్ పార్కులు... ►ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ ఆలోచన చేసింది. ఇందుకోసం ఆయా జోన్లలో ఉన్న జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి.. సీఎం ఆలోచనల మేరకు ఆ స్థలాల్లో థీమ్ పార్కులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ►వివిధ దేశాల్లో ఉన్న ఏడు వింతలను ఎంచక్కా.. సిటీలోనే సరదాగా ఎంజాయ్ చేసేలా సెవన్ వండర్స్ పార్క్ రానుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ స్థాయిలో థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా మినియేచర్స్‌తో సెవన్ వండర్స్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వండర్‌ను 22 నుంచి 30 అడుగుల ఎత్తు ఉండేలా ఆవిష్కరించనున్నారు. అన్ని వింతలూ రాత్రి పూట విద్యుత్ కాంతుల్లో ధగధగలాడేలా ఈ పార్కు రూపుదిద్దుకోనుంది. ►వర్షపు నీటిని ఎన్ని రకాలుగా భూమిలోకి ఇంకించవచ్చు అనే అంశం వివరిస్తూ.. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పార్కు రానుంది. ప్రజలకు నీటి విలువను తెలియజెప్పడం, భూగర్భ జలాలు పెంపొందించుకోవడంపై అవగాహనతో పాటు పిల్లలు ఆడుకునేలా పచ్చదనంతో ఈ పార్కు కళకళలాడనుంది. ►పార్కులో బెంచ్‌లు కాకుండా వివిధ రకాల ఫ్రూట్ షేప్‌లు ఏర్పాటు చేసి వాటిపై సేదతీరేలా ఫ్రూట్ థండర్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, డాగ్ పార్కు, లేక్ పార్కు... ఇలా విభిన్న థీమ్ పార్కులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార మొదలైన ప్రాంతాల్లో ఉన్న పెద్ద పార్కుల్లో కొన్నింటిని, మిగిలిన పార్కుల కోసం ఇప్పటికే గుర్తించిన ఖాళీ స్థలాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని పంచే పంచతత్వ వాక్‌వేలు ►ఉరుకుల పరుగుల జీవితంలో అలిసిపోతున్న నగరవాసుల ఒత్తిడి దూరం చేసేలా నగరంలో ఆస్ట్రో గార్డెన్తో కూడిన పంచతత్వ వాక్‌వేలను ఏర్పాటు చేయనుంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలినిచ్చేలా ఈ పంచతత్వ పార్కులు వేదికగా మారనున్నాయి. ఆరోగ్యకరమైన గాలికి చిరునామాగా.. మందులు లేకుండానే రక్తపోటు, కీళ్ల నొప్పులు మొదలైన వ్యాధులను దూరం చేసే ఆస్పత్రుల్లా... ఒత్తిడి మటుమాయం చేసే ధ్యాన కేంద్రంలా ఆస్ట్రో గార్డెన్తో కూడిన పంచతత్వ వాక్‌వే పార్కులు ఉపయోగపడనున్నాయి. ఈ తరహా పార్కులను జీవీఎంసీ పరిధిలో మొత్తం 6 ఏర్పాటు చేయనున్నారు. నక్షత్ర, రాశివనాల కలయికతో ఆస్ట్రోగార్డెన్స్‌తో పాటు పంచతత్వ వాక్‌వేలు ఈ పార్కుల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ►ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన 27 రకాల మొక్కలను ఓ చోట చేర్చితే నక్షత్రవనంగా మారుతుంది. అదేవిధంగా రాశులకు అనుగుణంగా 12 రకాల చెట్లను పెంచనున్నారు. ►పంచతత్వ వాక్‌వే పార్కు ఎనిమిది భాగాలుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర భాగాలు నీటితో నిండి ఉంటాయి. మిగిలిన భాగాల్లో నల్లమట్టి, ఇసుక, 6ఎంఎం మెటల్ చిప్స్, సాగర్‌రాయి, 12ఎంఎం చిప్స్, 20 ఎంఎం గుండ్రని చిప్స్‌తో నింపుతారు. ►రెండో వరసలో చక్కెర మొక్క, సదాపాకు, నిమ్మగడ్డి, తమలపాకు, దవనం, తులసి, కలబంద, సరస్వతి, రణపాల మొదలైన మూలిక, వైద్య మొక్కలు ఏర్పాటు చేస్తారు. ►మూడో వరసలో ఆక్యుపంక్చర్ అంటే సిమెంట్, కాంక్రీట్‌తో కూడిన 6 ఎంఎం మెటల్ చిప్స్‌తో ఉంటాయి. ►నాలుగో వరసలో పునాది రాయితో కూడిన గడ్డి ఉంటుంది. ►ఐదో వరసలో ఎనిమిది బాక్స్‌ల్లో మూలిక, ఔషధ మొక్కలుంటాయి. ►ఆరో వరసలో నక్షత్రవనం, రాశివనాలుంటాయి. ►ప్రతి జోన్లో ఒక పార్కు ఉండేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా, హెచ్‌బీ కాలనీలోని ఆదర్శనగర్ పార్కులో, బుచ్చిరాజుపాలెం, షిప్‌యార్డు కాలనీ, అగనంపూడిలోని జనచైతన్య లే అవుట్, కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌తో పాటు భీమిలి, అనకాపల్లిలో మొత్తం 8 పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ►పంచతత్వ వాక్‌వేతో నిద్రలేమి సమస్య తీర్చుట, కంటి చూపు, నరాల బలహీనత మెరుగుపడుతుంది. రుతు సమస్య, హోర్మన్ల సమస్య తీరుతుంది. హృదయనాళ కార్యకలాపాలను మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పంచతత్వ పార్కులో నడవడం వల్ల ఆక్యుపంక్చర్ వైద్యంగా ఉపయోగపడుతుంది. వినూత్న కాన్సెప్ట్‌లు సిద్ధం విశాఖ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జీవీఎంసీ వినూత్న కాన్సెప్ట్‌లను సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వందలాది ఖాళీ స్థలాలను గుర్తించాం. వాటిని వివిధ రకాల పార్కుల కోసం వినియోగించాలని నిర్ణయించాం. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ సహకారంతో 5 శాతం ఎస్టిమేట్ కాస్ట్‌తో ఫీజ్ తీసుకునే ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ డ్రాయింగ్ మొత్తం వారి ద్వారా జరిగేలా నిబంధనలు పాటిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా థీమ్‌తో పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తయితే నగర వాసులకు పంచతత్వ పార్కులు పంచప్రాణాలుగా నిలుస్తాయి. ఆక్యుపంచర్ వైద్యం అందించే వైద్యశాలలుగా పార్కులు మారనున్నాయి. మొత్తంగా విశాఖనగరాన్ని సిటీ ఆఫ్ పార్క్స్‌గా తీర్చిదిద్దుతాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
వేపచెట్టుకు కల్లు..!
రఘునాథపాలెం : మండలంలోని వీవీ.పాలెంలో టి.దానయ్య అనే వ్యక్తి ఇంటి పెరడులోని వేపచెట్టుకు కల్లు పారుతోంది. సహజంగా తాటి, ఈత చెట్లకు కల్లును గీత కార్మికులు గీస్తారు. అయితే..ఇక్కడ వేపచెట్టు కాండం నుంచి కొన్ని రోజులుగా ద్రవం కారుతుండడంతో..ఇది కల్లు అని గుర్తించి ఇంటి యజమాని లొట్టిలోకి ఆ కల్లు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఇది తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి వెళుతున్నారని దానయ్య తెలిపాడు. -
నాలుగేళ్లకే స్విమ్మింగ్‌లో వండర్ కిడ్
-
నాట్యమంటే ప్రాణం
కాకినాడ కల్చరల్ : వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులు సాధించిన స్థానిక జగన్నాథపురానికి చెందిన మోకాన మహాలక్ష్మి నృత్యమే శ్వాస అన్నారు. తాను నేర్చుకొన్న నృత్యాన్ని పదిమందికి పంచి కళామాతల్లి రుణం తీర్చుకుంటున్నారు. సూర్య నృత్యనికేతన్ ఏర్పాటు చేసి నృత్యంపై ఆసక్తి ఉన్న పేద విద్యార్థులను గుర్తించి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె కూచిపూడి నృత్యం రంగంలో సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకున్నారు. ఈమె కంచెర్ల వీరభద్రరావు, జయలక్ష్మి ద్వితీయ పుత్రిక, చిన్నప్పటి నుంచి ఆమెకు నృత్యంపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రముఖ నాట్యాచార్యులు ఎంవీ రమణ వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ నాట్యంలో మెళకువలు నేర్చుకొని అంచలంచెలుగా ఎదిగి సూర్య నృత్య నికేతన్ స్థాపించారు. కాకినాడలో నాలుగు బ్రాంచీలు, ద్రాక్షారామ, నడకుదురు, కరప, ఇంజరం ఇలా మొత్తం ఎనిమిది చోట్ల çసుమారు 300 మందికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. 1998–2000లో తిరుపతి శ్రీవిద్యా నికేతన్‌లో శిక్షకురాలుగా పని చేసిన మహాలక్ష్మి తన 21వ ఏటనే ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోమాన్బాబు జన్మదిన వేడుకల్లో అనేక మంది సినీ అర్టిస్టుల సమక్షంలో విద్యార్థులతో శివతాండవం చేయించి మన్నలు పొందారు. ఈ సందర్భంతో సినీ హిరో రజనీకాంత్, మోమాన్బాబు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కూచిపూడి గ్రామంలోను పలు చోట్ల విద్యార్థులతో ప్రదర్శనలు ఇచ్చి మన్నలు పొందారు. తాను జీవించినంత కాలం నాట్యం పదిమందికి నేర్పాలనే తపనతో జీవిస్తున్నానని వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డుల ప్రధానంతో తన బాధ్యత మరింత పెరిగిందని మహాలక్ష్మి చెబుతున్నారు. -
మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్లో శ్రీసూర్య నృత్య నికేతన్ నిర్వహాకురాలు కె.మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులను బుధవారం ప్రదానం చేశారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్టు వండర్ బుక్ ఆఫ్ రికార్డు(లండన్) ప్రతినిధి అలమండ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మహాలక్ష్మి తన విద్యార్థుతో దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి కాకినాడ ఖ్యాతిని ఖండాంతర వ్యాప్తి చేస్తోందన్నారు. ఈమె ప్రతిభకు ఫలితంగానే ప్రతిష్టాత్మౖమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు దక్కిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి పోటీలు సభికులను అలరించాయి. పెద్ద ఎత్తున కళాకారులు హాజరయ్యారు. -
జీజీహెచ్‌లో.. మరో అద్భుతం
-
జీజీహెచ్‌లో.. మరో అద్భుతం
* రెండోసారి గుండె మార్పిడి ఆపరేషన్ * చరిత్ర సృష్టించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం * జాతీయస్థాయిలో ఇనుమడించిన ఆస్పత్రి ప్రతిష్ట * సహకరించని ప్రభుత్వం.. సహృదయంతో ముందుకొస్తున్న దాతలు అరవయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర గల గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రతిష్ట మరోసారి ఆకాశమంత ఎత్తుకు వెళ్లింది. ఈ ఆస్పత్రిలో రెండోసారిగా మంగళవారం నిర్వహించిన గుండె మార్పిడి శస్త్రచికిత్స సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.20 లక్షల వ్యయం అయ్యే శస్త్రచికిత్సను పేద మహిళకు ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సత్కార్యానికి ప్రభుత్వం వీసమెత్తు సహకారం అందించకపోయినా.. దాతలు ముందుకొచ్చి సాయమందించారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మంగళవారం జరిగిన గుండెమార్పిడి ఆపరేషన్‌తో గుంటూరు జీజీహెచ్ మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే బృందం మరోసారి ఈ అద్భుతం సష్టించింది. ఒక్కపైసా ఖర్చు లేకుండా సుమారు రూ.20 లక్షలు ఖరీదు చేసే గుండె మార్పిడి ఆపరేషన్ రెండోసారి నిర్వహించింది. దేశంలోనే ఐదో ఆస్పత్రిగా ఖ్యాతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. దేశంలో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఐదో ఆస్పత్రిగా గుంటూరు ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరగడంతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 60 ఏళ్ల సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రికి 2015 మార్చికి ముందు గుండె ఆపరేషన్లు జరగడమే గగనంగా ఉండేది. ఈ తరుణంలో తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో నిరుపేద రోగులకు సేవ చేయాలనే స‘హృదయం’తో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఏడాది కాలంలో 250 వరకు నిరుపేద గుండెలకు ఊపిరిలూదారు. ప్రభుత్వం ఎలాంటి నిధులూ మంజూరు చేయకపోయినా దాతల సహకారం, సొంత ఖర్చులతో మే 20న గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. సన్మానాలకే పరిమితం.. నిధుల మంజూరు శూన్యం.. గుండెమార్పిడి ఆపరేషన్‌తో డాక్టర్ గోఖలేకు సన్మానాలు చేసిన సీఎం, మంత్రులు ప్రభుత్వం తరఫున గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. అయినా దాతలు ముందుకు రావడంతో ఎవ్వరూ ఊహించని విధంగా రెండో గుండె మార్పిడి ఆపరేషన్ సైతం చేపట్టారు. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న రోగికి నెల్లూరులో గుండెను సేకరించి ఏకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చి మరీ ఆపరేషన్ నిర్వహించడం గొప్ప విషయం. జీజీహెచ్‌లో డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, డాక్టర్ గొంది శివరామకృష్ణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్వీ సుందరాచారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్ట్రోక్ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. దాతల సహకారం... ఐ డొనేట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నవీన్ ఈ మహాయజ్ఞంలో తామూ భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో రెండు గుండె మార్పిడి ఆపరేషన్లకూ 15 మందితో రక్తదానం చేయించారు. హెలీప్యాడ్ నుంచి జీజీహెచ్‌కు గుండెను చేర్చేందుకు వేదాంత హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ ప్రత్యేక అంబులెన్స్‌ను సమకూర్చారు. దాతలు చేస్తున్న సహాయాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో గుండెమార్పిడి ఆపరేషన్లను చేర్చడమో లేదా, దీనికి సరిపడా నిధులను ప్రత్యేకంగా విడుదల చేయడమో చేయాలని వైద్య నిపుణులు, ప్రజలు కోరుతున్నారు. -
ఔరా.. బీర!
సాధారణంగా అడుగు, అడుగున్నరకు మించని బీరకాయ ఏకంగా మూడు అడుగుల పొడవు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టణంలోని ఉప్పరపాలెం రెడ్డినగర్‌కు చెందిన త్రిపురం కోటేశ్వరరావు తన 15 సెంట్ల స్థలంలో బీర తోటలు సాగు చేస్తున్నారు. తోటలో ఒక కాయ మూడు అడుగుల పొడవు ఉంది. విషయం తెలిసి అధిక సంఖ్యలో స్థానికులు వచ్చి బీరకాయను తిలకించారు. – బాపట్ల టౌన్ -
రెండు తలల లేగ దూడ
మండల కేంద్రమైన పాణ్యంలోని అయ్యపురెడ్డి కాలనీకి చెందిన జిన్ను రజాక్‌కు చెందిన బర్రె శనివారం వింత లేగ దూడ జన్మించింది. దూడకు రెండు తలలు ఉన్నాయి. పుట్టిన లేగ దూడ కోద్ది సేపటికే మృతి చెందింది. కోన్ని గంటలపాటు ఆ బర్రె దూడ వద్దకు ఎవరిని రానివ్వలేదు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పశువైధ్యాధికారి సకారం చనిపోయిన లేగ దూడను పరిశీలించారు. రజాక్‌కు మూడు బర్రెలు ఉన్నాయి. -
సృజన వీచిక
-
పాకిస్థాన్‌లో అద్భుతం..
ముస్లింల దృష్టిలో బైబిల్: ముస్లింల అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ఇబ్రాహీం (అబ్రహాం), మూసా(మోషే), ఈసా(యేసు క్రీస్తు) వంటి ప్రవక్తల కథలని వక్రీకరించి తమకి అనుకూలంగా రాసుకున్నారు. ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. దేవునిగా కాదు. క్రీస్తు తరువాత వచ్చిన ముహమ్మదే చివరి ప్రవక్త అని ముస్లింలు అంటారు. బైబిల్ అనేక మార్పులు చేర్పులకు గురైంది కనుక, దేవుడు ఖురాన్ ద్వారా జరిగిన తప్పుల్ని సరిచేశాడని నమ్ముతారు. బైబిల్ తరువాత వచ్చిన అంతిమ దైవగ్రంధం ఖురాన్ అని, యేసు తరువాత వచ్చిన చివరి ప్రవక్త ముహమ్మద్ అంటారు. క్రైస్తవుల దృష్ఠిలో ఖురాన్: ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని క్రైస్తవులు అంటారు. బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉన్నాయి. అవి యాకోబు సువార్త, తోమా సువార్త, బర్నబా సువార్త లు. ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని ముస్లిముల వాదనను క్రైస్తవులు నిరాకరిస్తారు. బైబిలే అంతిమ దైవగ్రంథమని, యేసు క్రీస్తే చివరి ప్రవక్త అని విశ్వసిస్తారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద మతాలైన క్రైస్తవం, ఇస్లాంల మధ్య స్థూలంగా తేడాలివి. ఈ అభిప్రాయ బేధాలు పవిత్ర గ్రంథాల పరిధిదాటి మనిషి మెదళ్లకు, సమూహాల కోపానికి, దేశాల ప్రతీకారం స్థాయికి చేరిందే.. ఇప్పుడు మనమున్న ప్రస్తుతం. 'అమెరికా నుంచి ముస్లింలను వెళ్లగొడతా'నంటూ అగ్రదేశంలో ఎన్నికల వాగ్ధానం చేస్తాడొకరు. 'క్రిస్టియన్ల నామరూపాలు లేకుండా చేయడమే మా లక్ష్యం' అని ప్రకటిస్తాడో ఇస్లామిక్(!) ఉగ్రవాది. చాలా దేశాల మాదిరే పాకిస్థాన్ లో అంతూపొంతూ లేకుండా కొనసాగుతున్న మతఘర్షణల పరంపరలో ఎట్టకేలకు శాంతి చిగురుటాశలా వికసించింది. ఈ ఏడాది ఈస్టర్ పండుగనాడు ఎక్కడైతే క్రైస్తవుల నెత్తురు ఏరులైపారిందో ఆ లాహోర్ ప్రాంతంలోనే ఓ అద్భుతం చోటుచేసుకుంది. అధికారిక ఇస్లామిక్ దేశంలో ఆధిపత్య ముస్లింలు.. మైనారిటీలైన క్రిస్టియన్లకు చర్చి కట్టించేందుకు ముందుకొచ్చారు. నేటి పరిస్థితుల దృష్ట్యా దీనిని 'పాకిస్థాన్ లో జరిగిన అద్భుతంగా' భావించడంలో తప్పులేదు. పాకిస్థాన్ లోని పంజాబ్ ఫ్రావిన్స్ ఆ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక. ప్రధానంగా వస్త్రాల తయారీ, ఇతర కర్మాగారాలకు నెలవైన ఫైసలాబాద్ నగరానికి 'మాంచెస్టర్ ఆఫ్ పాకిస్థాన్' అనే పేరు కూడా ఉంది. ఈ నగరానికి సమీపంలోనే గోజ్రా అనే గ్రామం ఉంది. ఊరిపేరు గోద్రా మాదిరే ఉన్నా అక్కడ మాత్రం ముస్లిం, క్రిస్టియన్లు గొడవలు పడరు. అన్నదమ్ముల్లా అన్యోన్యంగా కలిసి ఉంటారు. దాదాపు 150 కుటుంబాలున్న ఆ ఊరిలో 20 క్రైస్తవ కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. మరుగుదొడ్లు కడిగే వృత్తిలో ఉన్న ఆ క్రైస్తవులు కడు పేదలు. పండుగలు వస్తే అంతా కలిసి తమలోనే ఒకరి ఇంట్లో ప్రార్థనలు జరుపుకుంటారు. ప్రార్థనా మందిరం లేక ఏళ్లుగా వీరు పడుతోన్న బాధలు చూసి చలించిపోయిన ముస్లింలు చర్చిని నిర్మిస్తామని ముందుకొచ్చారు. 2016, మార్చి 28న ముస్లింలు తమ నిర్ణయాన్ని క్రైస్తవులకు తెలిపారు. ఆ రోజు ఈస్టర్. ఓ వైపు సింధ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లోని పబ్లిక్ పార్కులో ఉగ్రవాదులు బాంబులతో 60 మంది క్రిస్టియన్లను చంపగా, అదే ప్రావిన్స్ లోని గోజ్రా మాత్రం సరికొత్త నిర్ణయానికి వేదిక అయింది. చర్చి నిర్మాణం కోసం అవసరమైన రూ. 7 లక్షలు కూడా ముస్లిం కుటుంబాల నుంచే సేకరించారు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కరో ఇద్దరో చర్చి నిర్మాణం జరిగే చోటికి వెళ్లి ఇటుకలు అందించడమో, సిమెంట్, ఇసుకల్ని కలపడమో చేస్తున్నారు. 'మా మతాలు వేరు కావచ్చు, మేం చేస్తున్న పని కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ప్రపంచానికి ఒక విషయం తెలియజెప్పాలనుకుంటున్నాం.. పాకిస్థాన్ ఉగ్రదేశం కాదని నిరూపించాలనుకున్నాం. అందుకే క్రైస్తవులకు చర్చి కట్టించేందుకు ముందుకు వచ్చాం. మేమంతా అన్నదమ్ములం' అని చెబుతున్నాడు చర్చి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ముస్లిం మియా ఎజాజ్. ప్రజాస్వామ్య దేశంగా భారత్ లో మతసామరస్యం వెల్లివిరియడం కనిపించేదే. మతరాజ్యాలైన పాకిస్థాన్ లాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి ఘటనలు లేవు! అన్నట్లు పాక్ జనాభాలో క్రైసవ మైనారిటీల జనాభా 3 శాతం. వీరిలో 60 శాతం మంది పంజాబ్ ఫ్రావిన్స్ లోనే ఉన్నారు. చాలా మంది మరుగుదొడ్లు శ్రుభవ్రచేసే(శానిటేషన్) వృత్తిలో ఉండగా, చదువుకున్నవారు బోధనా రంగంలో రాణిస్తున్నారు. - మధు కోట -
హైదరాబాద్ మెట్రోరైల్ మహాఅద్బుతం
-
అద్భుత ద్వీపం
చుట్టూ సముద్రం.. మధ్యలో చక్కని ఇల్లు.. పక్కనే చిన్న తోట.. చూడడానికి ఈ ద్వీపం బాగుంది కదూ.. మన దగ్గర కాస్త దండిగా డబ్బులుంటే నీటిపై తేలియాడే ఇలాంటి ద్వీపాలు మీ సొంతం అంటోంది క్రిస్టీస్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ సంస్థ. చెప్పడమే కాదు.. అందుకోసం లొకేషన్‌ను కూడా రెడీ చేసేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి ద్వీపాలను నిర్మించనున్నారు. వీటిని తొలుత మాల్దీవుల్లో నిర్మిస్తామని.. తర్వాతి దశల్లో దుబాయ్, మయామీలకు విస్తరిస్తామని క్రిస్టీస్ తెలిపింది. దీని రేటు ఎంత అన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
ఆకాశంలో అద్భుతం..
సాయంత్రం 6.48 నిమిషాల సమయం.. నింగినిండా మబ్బులు.. అప్పుడప్పుడు మెరుపులు.. ఇంతలో ఆకాశంలో అద్భుతం. మార్తాండుడు మళ్లీ ఉదయిస్తున్న సన్నివేశం. తిమిర సంహారం జరుగుతోందా అన్నట్లు ఆకాశంలో ఒక్కసారిగా వెలుతురు వచ్చింది. దాదాపు నిమిషం పాటు ఆ కాంతి కనిపించింది. కాసేపటికి మళ్లీ చీకటి అలముకుంది. ఈ దృశ్యాన్ని చూసిన విశాఖ వాసుల్లో ఏం జరుగుతుందో తెలియని ఆశ్చర్యం.. మరికాసేపటికే మళ్లీ అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. దీనిపై వాతా వరణ నిపుణులు స్పందిస్తూ.. వాస్తవానికి ఉత్తర, దక్షిణ ధృవాల ప్రాంతాల్లో ఇలాంటి కాంతిని వెదజల్లే దృశ్యాలు (అరోరా బొరియాల్సిస్) సంభవిస్తాయని చెప్పారు. మన ప్రాంతంలో అలాంటివి ఏర్పడే అవకాశం లేదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంటున్నారు. గురువారం నాటి ఘటనపై తాము ఇదమిత్థంగా ఏమీ చెప్పలేమని తెలిపారు. - సాక్షి, విశాఖపట్నం -
వండర్ వరల్డ్ 14th Sep 2014
-
వీళ్లు పుడుతూనే సెలెబ్రిటీలు!
కొందరికి సాధన ద్వారా కళలు అలవడితే... మరికొందరు పుట్టుకతోనే కళాకారులుగా పుడతారు. లేదంటే చిన్న చిన్న పిల్లలు... అంత అద్భుతంగా ఎలా నటించగలుగుతారు! ప్రస్తుతం సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్టులకు డిమాండ్ ఎక్కువే ఉంది. సీరియళ్లన్నీ కుటుంబాల కథల చుట్టూ తిరుగుతాయి. కుటుంబమన్నాక పిల్లలు ఉంటారు కదా! హీరో హీరోయిన్ల చిన్ననాటి పాత్రలు ఎలానూ ఉంటాయి. వాటన్నిటి కీ చైల్డ్ ఆర్టిస్టులు అవసరం. ఈ అవసరం పిల్లల్లోని టాలెంట్‌ను వెలికి తీస్తోంది. ‘ముద్దుబిడ్డ’ చిన్నపిల్లల కథతోనే ప్రారంభమయ్యింది. ఆ తర్వాత తరాలు మారినప్పుడల్లా చిన్నపిల్లలు రంగ ప్రవేశం చేశారు. ‘రాధాకళ్యాణం’లో కళ్లతోనే సెంటిమెంటును కుమ్మరించిన బెంగళూరు అమ్మాయి శ్రేయను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక మాస్టర్ సాయి హరీష్ గురించి చెప్పనక్కర్లేదు. హైస్కూల్, శుభాకాంక్షలు, గోరంత దీపం లాంటి చాలా సీరియళ్లలో మంచి మంచి పాత్రలు చేసి సినిమాల్లోకి కూడా వెళ్లిపోయాడు. ఇంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా నటించగలడా అనిపిస్తుంది తనని చూస్తే. ఇంకా ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. అయితే పిల్లల చుట్టూనే తిరిగే సీరియళ్లు తక్కువే. అప్పుడెప్పుడో వచ్చిన ‘కిట్టిగాడు’ లాంటివి ఇప్పుడు రావడమే లేదు. హిందీవాళ్లు మాత్రం పిల్లలనే ప్రధాన పాత్రధారులుగా పెట్టి కొన్ని సీరియల్స్ తీస్తున్నారు. పిల్లలూ అదరగొడ్తున్నారు. ఝాన్సీ రాణిగా ఉల్కాగుప్తా, మహరాణా ప్రతాప్‌గా ఫైసల్‌ఖాన్, ‘జై శ్రీకృష్ణ’గా ధృతీ భాటియాల నటనకు జనం జేజేలు పలికారు. ‘బడే అచ్చే లగ్తే హై’లో ‘పీహూకపూర్’గా అమృతా ముఖర్జీ, ‘యే హై మొహొబ్బతే’లో ‘రూహీ భల్లా’గా రుహానికా ధావన్, ‘ఉతరన్’లో ‘ఇచ్ఛా’గా స్పర్శ్ ఖాన్‌చందానీ, ‘వీరా’లో అన్నాచెల్లెళ్లుగా భవేష్ బాల్చందానీ, హృశితా ఓఝాల నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. దేవత పాత్రలు పోషించడంలో సిద్ధహస్తురాలైన అన్షూర్ కౌర్ అయితే ఇప్పటికే ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక సాధిల్ కపూర్, శివాంశ్ కోటియా లాంటి చిచ్చర పిడుగుల గురించి చెప్పనక్కర్లేదు. సీరియళ్ల షూటింగ్ అంటే... ఒక్కరోజులో బోలెడన్ని సీన్లు తీసేస్తుంటారు. తమ షాట్ వచ్చే వరకూ ఓపిగ్గా ఉండాలి. పెద్ద పెద్ద డైలాగులు బట్టీ పట్టాలి. కానీ ఇవేవీ బుజ్జిగాళ్లని భయపెట్టడం లేదు. పెద్దవాళ్లతో సమానంగా పని చేసేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇంకా ప్రపంచం గురించి సరిగ్గా తెలియకముందే యావత్ ప్రపంచాన్నీ కట్టి పడేస్తున్నారు ఈ బుల్లి స్టార్స్. వాళ్ల ముద్దొచ్చే మోములను, చిలిపి అల్లర్లను, సమ్మోహితపరిచే వారి అద్భుత నటనను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. పది కాలాలు పచ్చగా ఉండమంటూ దీవిస్తున్నారు! -
తిరుమలలో మూగకు మాటలు
-
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్‌కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే....లండన్‌కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్‌కు లండన్‌లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు. కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. -
త్రీ ఇన్ వన్ అద్భుతం
సింగపూర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్.. ఆసియాలోనే క్లీనెస్ట్ సిటీగా పేరుపొందిన దేశం సింగపూర్. అలాంటి దేశాన్ని ఒక్కసారన్నా చూడాలన్న కోరిక ఇటీవలే తీరింది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న మా మిత్రుణ్ణి కలవడానికి ముగ్గురు స్నేహితులం కలిసి 12 రోజులకు టూర్ ప్లాన్ చేసుకున్నాం. కౌలాలంపూర్ నుంచి సింగపూర్ వెళ్లాలనేది మా ప్లాన్. ముందుగా చెన్నై నుంచి కౌలాంపూర్ వెళ్లి, తిరిగి చెన్నై రావడానికి మూడు నెలల ముందు ఆఫర్లో బుక్ చేసుకుంటే రూ.14 వేల రూపాయలకు టికెట్ లభించింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఏషియా విమానమెక్కి కౌలాలంపూర్ చేరుకున్నాం. స్నేహితుణ్ణి కలిసి, అటు నుంచి కౌలాలంపూర్ నుండి సింగపూర్ బయల్దేరాం. సింగపూర్‌కు విమానాలు, ఓడల సదుపాయాలు ఉన్నాయి. అయినా మేం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నాం. కౌలాలంపూర్ - సింగపూర్: మా స్నేహితుడు ముందుగా బుక్ చేసిన డబుల్ డెక్కర్ బస్సులో (రూ. 4 వేలు ఒక్కొక్కరికి) కౌలాలంపూర్ నుంచి సింగపూర్‌కి చేరుకున్నాం. ఎటు చూసినా ఎత్తై బిల్డింగ్లు అబ్బురపరుస్తూ ఆహ్వానం పలికాయి. ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, ఇండియా.. దేశాలకు సింగపూర్ అతి పెద్ద జంక్షన్. సింగపూర్ సిటీ నుంచి లోకల్ ట్రైన్లో ‘సెంటోసా ఐలాండ్’కి బయల్దేరాం. అబ్బురపరిచే ట్రాఫిక్ వ్యవస్థ... దారంతటా విశాలమైన రోడ్లు, పకడ్బందీగా ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ, పౌరుల క్రమశిక్షణ.. మెచ్చుకోకుండా ఉండలేం. వెహికిల్స్ అన్నీ క్రమప్ధతిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినట్లుగా వెళుతుండటం చూసి ముచ్చటేసింది. ఇక్కడ మన బడ్జెట్‌కు అనుగుణంగా మూడు రకాల టాక్సీలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల సందడి సెంటోసా ఐలాండ్: నగరంలోని ఆకాశ హర్మ్యాలను తిలకిస్తూ ‘సెంటోసా ఐలాండ్’కు చేరుకున్నాం. అందమైన దీవులు ఈ దేశపు స్పెషల్ అట్రాక్షన్. అన్ని వయసుల వారిని అలరించేలా రకరకాల గేమ్స్ ఉంటాయిక్కడ. ఒకే షెల్టర్ కింద వేలాదిమంది క్యాసినో ఆడుతూ కనిపిస్తారు. ఇక్కడ జరిగే గాంబ్లింగ్ అంతా చట్టబద్ధం కావడంతో ఎలాంటి మోసాలకు తావుండదు. మేమూ కాసేపు క్యాసినో ఆడి, సరదా తీర్చుకున్నాం. సెంటోసా ఐలాండ్ క్యాంపస్‌లోనే గల యూనివర్సల్ స్టూడియో ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సింగపూర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇదో ముఖ్యమైన స్టూడియో. ‘సెంటోసా ఐలాండ్’లో మిస్ కాకుండా చూడాల్సినది ఈవెంట్ లేజర్ షో. సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేసిన సెట్లో జరిగే ఈ షో చూసి తీరాల్సిందే. లిటిల్ ఇండియా: సింగపూర్ పొరుగు దేశం కావడం వల్ల ఇండియా ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ తమిళియన్స్ పెద్దసంఖ్యలో సెటిల్ అయ్యారు. సింగపూర్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా వీళ్ళు కనిపిస్తారు. ఇండియా నుంచి వెళ్లినవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. అక్కడి వాతావరణం చూస్తే మనం ఉన్నది సింగపూర్లోనేనా అన్న అనుమానం కలుగుతుంది. ముస్తఫా షాపింగ్ మాల్: షాపింగ్ అంటే ఆసక్తి ఉన్న పర్యాటకులకు సింగపూర్ స్వర్గధామం. సింగపూర్‌లో షాపింగ్ చేయాల్సిన ప్రదేశాల్లో ‘ముస్తాఫా షాపింగ్ మాల్’ ఒకటి. ఇక్కడ గుండుసూది నుంచి ఫర్నీచర్ వరకు అన్నీ లభ్యమవుతాయి. ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రతిరోజూ 24 గంటలు ఈ షాపింగ్‌మాల్ పనిచేస్తూనే ఉంటుంది. మూడురోజులు సింగపూర్‌లో ఉండి, తిరిగి కౌలాలంపూర్ చేరుకున్నాం. అటు నుంచి ఫిబ్రవరి 8న చెన్నై, అటు నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చాం. ఒక దేశం, ఒక ద్వీపం, ఒక నగరం.. ఈ మూడూ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ఒక్క సింగపూర్‌ని చూస్తే చాలు. ఈ మూడింటిని చూసిన అనుభూతి ఏకకాలంలో కలుగుతుంది. - కె.ప్రేమ్‌కుమార్, హైదరాబాద్ -
ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం
నవల పుట్టిన క్షణాలు... మధురాంతకం నరేంద్ర ఇటీవల ‘ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం’ అనే నవల వెలువరించారు. ఇద్దరు పరిచిత వ్యక్తులు ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో చిక్కుబడి ఎదుర్కొనే అనుభవాల సంచయం ఇది. పైకి చూడ్డానికి ఇదో తిరుగు ప్రయాణపు ఎదురుచూపుగా కనబడినా పాత్రల అంతర్లీన ప్రయాణం కూడా జరుగుతుంటుంది. మతం ఆధారంగా మనిషి ఏర్పరచుకునే అంచనాలు, జాతి ఆధారంగా ఏర్పడే విశ్వాసాలు ఒకరిని మరొకరు బాధించడానికి, అవమానించడానికి, ద్వేషించడానికి కారణభూతం కావడాన్ని ఈ నవలలో రచయిత జాగ్రత్తగా విశ్లేషిస్తారు. తెలుగులో ఇటువంటి నవలలు తక్కువ. ఈ నవల వెనుక నేపథ్యం రచయిత మాటల్లో... ‘ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం’ అనే ఈ నవల ఆత్మకథగాని చరిత్రగాని కాదు. కేవలం కల్పనా సాహిత్య రచనే. అయితే ఈ నవలలో కొంత ఆత్మకథా, చాలా వరకూ చరిత్రా ఉన్నాయి. కల్పనా సాహిత్యం పైన ఉన్న గౌరవంతో చివరి దాకా చదివిన పాఠకులు ఈ రచనలో ఆత్మకథ, చరిత్ర యే నిష్పత్తిలో చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలనుకోవడం సహజమే. ప్రతి రచనలోనూ రచయిత ఆత్మకథ యెంతో కొంత, యేదో వొక రూపంలో ఉండనే ఉంటుంది గనుక ఆ విషయాలేవో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను వార్తా పత్రికల్లోనూ టీవీల్లోనూ పరిశీలిస్తున్న వాళ్లకు ఈ నవల్లోని చారిత్రక నేపథ్యాన్ని వివరించాల్సిన అవసరమూ లేదు. అయితే అలా గమనించని పాఠకుల కోసం మాత్రమే ఈ చిన్న మాట రాస్తున్నాను. 2006 ఆగస్టు 22వ తేదీన కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్లు మెక్సికో దేశానికి పంపిన తొలి సాహిత్య ప్రతినిధి వర్గంలో సభ్యుడుగా నేనూ ఆ దేశానికి బయల్దేరాను. నాతోబాటూ లక్నో నుంచి అఖిలేశ్వర్ కుమార్ అనే హిందీ రచయిత కూడా వచ్చారు. తిరుగు ప్రయాణంలో నేనూ, అఖిలేశ్వర్ ఆగస్టు 28వ తేదీన ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో 22 గంటలు వేచి ఉండవలసి వచ్చింది. మెక్సికోలోని భారత యెంబసీ వాళ్లు మాకు సహాయం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసినా మా ప్రయాణాయాసంలో మార్పు రాలేదు. ఆమ్‌స్టర్‌డాంలో 22 గంటల నిరీక్షణ తర్వాత విమానమెక్కాం. యేదో సాంకేతిక సమస్య వల్ల మరో ఆరుగంటల సేపు విమానం కదల్లేదు. అలా మేము దాదాపు 30 గంటలు ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో కట్టుబడి పోయాం. మేము మెక్సికోలో ఉన్న సమయంలో ఆగస్టు 23వ తేదీన ఆమ్స్టర్డాం విమాశ్రయంలో కొందరు భారతీయుల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. వాళ్లు అదే రోజున నార్త్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ముంబాయికి బయల్దేరినవాళ్లు. విమానం ఆకాశంలో ప్రయాణం చేస్తూండగా వాళ్లల్లో కొందరు సీటు బెల్టులు పెట్టుకోమని హెచ్చరించినా వినలేదట. పైగా సెల్ఫోన్లు మార్చుకోసాగారట. ఎయిర్ మార్షల్స్ వాళ్లను బలవంతంగా అదుపులోకి తీసుకుని విమానాన్ని అది బయల్దేరిన అరగంటలోనే తిరిగి ఆమ్స్టర్డాం విమానాశ్రయానికి తీసుకొచ్చేశారు. అప్పుడు ఆ విమానంలో 149 మంది ప్రయాణికులున్నారట. మరునాడు ఉదయం అనుమానితులుగా కనిపించిన 12 మందిని తప్ప మిగిలిన ప్రయాణికులందరినీ మరో విమానంలో ముంబైకి పంపేశారు. నిర్బంధించిన 12 మంది ప్రయాణికుల్ని ఆ తరువాత విచారణ చేసి హింసాత్మకమైన విధ్వంసం సృష్టించబోతున్నారనడానికి కావాల్సిన సాక్ష్యమేమీ దొరకలేదని పోలీసులు తేల్చేశారు. ఈ విషయానికి స్పందించిన ఆసియన్ యేజ్ పత్రిక ఇలా భారతీయులను నిర్బంధించడానికి కారణం డచ్ వాళ్లకుండే జాత్యహంకారమేనని విమర్శించింది. అయితే ఇలా వొకరిద్దరు రక్షణాధికారులు చేసిన పనికి మొత్తం డచ్ ప్రజలనంతా నిందించడం భావ్యం గాదని డచ్ పత్రికలు సమాధానం చెప్పాయి. ఆ పన్నెండు మంది భారతీయులూ నిర్దోషులే అయినా తమ అమాయకత్వానికి తగిన మూల్యం చెల్లించారని తేల్చిపారేశాయి. విచారణ ముగిసే వరకూ అంటే వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు కారని తెలిసే వరకూ అప్రమత్తతతో వాళ్లకు బేడీలు వేయక తప్పదని ప్రకటించాయి. ఇదే పని ముంబై విమానాశ్రయంలో జరిగితే అక్కడి పోలీసులు కూడా యే దేశపు ప్రయాణికులైనైనా ఇలాగే నిర్బంధిస్తారని డచ్ పత్రికలు వాదించాయి. ఆమ్‌స్టర్‌డాంలో ఈ గొడవ జరిగినప్పుడు మేము మెక్సికోలోనే ఉన్నాం. తిరుగు ప్రయాణంలో ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో జాగ్రత్తగా ఉండమని మమ్మల్ని హెచ్చరించినవాళ్లు ఈ ఉదంతాన్ని గురించి మాకు స్పష్టాస్పష్టంగానే చెప్పారు. మరింతగా తరచి అడిగితే యేం వినవలసి వస్తుందోనన్న భయంతో మేమూ యేమీ అడగలేదు. ఆమ్స్టర్డాం విమాశ్రయంలో 22 గంటలు మాకైతే ప్రశాంతంగానే గడచిందిగానీ లోలోపల అలజడులు చెలరేగుతూనే ఉన్నాయి. భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఇంటర్నెట్ సహాయంతో జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాను. విమానాశ్రయాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలన్నీ వొకదానివెంట వొకటిగా తెలిసి వచ్చాయి. రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను. ఇందులో జరిగిన సంఘటనలన్నీ యేదో వొక రూపంలో యేదో వొక చోట యథార్థంగా జరిగినవే. వొక చారిత్రక నేపథ్యంలో జరిగిన కాల్పనిక రచనే ఈ నవల. అయితే ఈ కల్పనకు గూడా స్పష్టమైన చారిత్రక భూమిక ఉందన్న విషయాన్ని సహృదయ పాఠకులకు గుర్తు చేయడం యిప్పుడు నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. - మధురాంతకం నరేంద్ర