సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్ గుండెను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది.
1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది.
¿SABÍAS QUÉ?
— Énfasis Comunica (@EnfasisComunica) June 17, 2023
EL PRIMER TRANSPLANTE DE CORAZÓN
En el año de 1971 se dió un paso gigante en la historia de la medicina, pues se realizó con éxito el primer trasplante de corazón.
La operación fue llevada por el Doctor Christiaan Barnard en la Ciudad del Cabo, capital de #Sudáfrica. pic.twitter.com/5T24TACYmF
ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్ నార్మన్ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్ గుండెను అమర్చారు. డెనిస్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్‌లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రామ్‌నాయక్ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్ పి వేణుగోపాల్ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది.
ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు!
Comments
Please login to add a commentAdd a comment