Heart Transplant Surgery
-
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్‌లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58) అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు. 'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్‌తో కార్డ్స్ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో టెక్నీషియన్‌గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. ఇదీ చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం -
అమెరికాలో మనిషికి పంది గుండె
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. మరణానికి దగ్గరయ్యాడు. ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మారి్పడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు కష్టతరమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. లారెన్స్ ఫాసెట్‌కు ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది. ఇదే ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ వైద్యులు గత ఏడాది పంది గుండెను డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి అమర్చారు. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే జీవించాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తాను నిండు నూరేళ్లు జీవిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికాలో మానవ అవయవాలకు కొరత ఏర్పడింది. దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. -
ప్రేమకు రోగాలు అడ్డుకావని నిరూపించారు
తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్ఆర్ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన రామకృష్ణ
అనకాపల్లి: తమ కుమారుడు బతకాలని ఎంతో మంది దేవుళ్లను కొలిచారు. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. చివరికి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోరారు. ఇంతలో మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అతడు కన్నుమూశాడు. దాంతో తన తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. హృద్రోగి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు విరాళాలు సేకరిస్తున్న వారికి నిరాశ ఎదురైంది. ఈ చేదు వార్త తెలియడంతో మునగపాకలో విషాదం అలుముకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన దొడ్డి శ్రీను గణేష్, పార్వతి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు రామకృష్ణ ఆర్నెల్ల క్రితం నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. నయం చేయడానికి తల్లిదండ్రులు పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరకు అతడికి గుండెమార్పిడి చికిత్స చేయాలని గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడని వైద్యులు తేల్చిచెప్పారు. ఇందుకోసం రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సూచించారు. అంత పెద్ద మొత్తం సమకూర్చి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని రామకృష్ణ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే 20 రోజులుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేర్ ఆస్పత్రిలో రామకృష్ణకు వైద్యం అందిస్తున్నారు. ఎలాగైనా అతడిని బతికించుకునేందుకు గ్రామ యువత, పెద్దలు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే నగదును సమకూర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో విధి వక్రించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మద్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామస్తులు, యువకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి రామకృష్ణ ఆరోగ్య సమస్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ప్రాణంతో కొట్టుమిట్టాడిన రామకృష్ణ ఇక లేరన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. -
తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..
సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్ గుండెను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది. 1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది. ¿SABÍAS QUÉ?EL PRIMER TRANSPLANTE DE CORAZÓNEn el año de 1971 se dió un paso gigante en la historia de la medicina, pues se realizó con éxito el primer trasplante de corazón.La operación fue llevada por el Doctor Christiaan Barnard en la Ciudad del Cabo, capital de #Sudáfrica. pic.twitter.com/5T24TACYmF— Énfasis Comunica (@EnfasisComunica) June 17, 2023 ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్ నార్మన్ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్ గుండెను అమర్చారు. డెనిస్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్‌లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రామ్‌నాయక్ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్ పి వేణుగోపాల్ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు! -
బాలుడి అవయవదానం.. ఇద్దరికి ప్రాణదానం
శ్రీకాకుళం రూరల్/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్ డెడ్ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్‌చంద్(16)కు బ్రెయిన్ డెడ్ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు. కిరణ్‌చంద్ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్‌చంద్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్‌చంద్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు. మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖలోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు. యువకుడికి కిడ్నీ, లివర్ కిరణ్‌చంద్ అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లో విశాఖకు చేర్చారు. ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్‌ను అమర్చి ప్రాణం పోశారు. దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్‌చంద్ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 27 నిమిషాల్లో శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు. వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
పద్మావతి హృదయాలయం మరో రికార్డ్
-
చిన్నారికి పునర్జన్మ.. పద్మావతి హృదయాలయం అరుదైన చికిత్స
తిరుపతి (తుడా): ఏడాది బిడ్డకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించింది తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (చిన్న పిల్లల గుండె ఆస్పత్రి). గత నెలలో 15 సంవత్సరాల బాలుడికి గుండె మార్పిడి చేసిన ఇక్కడి వైద్యులు నెల రోజుల వ్యవధిలోనే 13 నెలల పసిబిడ్డకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాప అనారోగ్యం బారిన పడగా.. తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డను చూపించారు. పాపకు గుండె మార్చాల్సి ఉందని, తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను హృదయాలయంలో చేర్చగా.. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేశారు. అప్పటినుంచి ఆస్పత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆ బిడ్డకు వైద్యం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. కాగా, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం అందటంతో ఏపీ జీవన్‌దాన్ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని డాక్టర్ శ్రీనాథరెడ్డి సమన్వయం చేయించారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2గంటల 15 నిమిషాల్లో గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండె చేరుకోవడంతో డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స రూ.30 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్ర చికిత్సను టీటీడీ ప్రాణదానం, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వైద్యుల బృందం కృషి అభినందనీయమని కొనియాడారు. 3 నెలల జార్ఖండ్ చిన్నారికి శస్త్ర చికిత్స జార్ఖండ్ రాజధాని రాంచీ ప్రాంతానికి చెందిన లుక్సార్ పరీ్వన్ (మూడు నెలలు)కు శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఇటీవల గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం కోలుకున్న ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో చిన్నారి తల్లి పరీ్వన్ ఇటీవల వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బిడ్డకు గుండె శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించి వైద్యులు తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆ పసికందును ఆస్పత్రిలో చేర్చుకున్న పద్మావతి వైద్యులు 15 రోజుల క్రితం గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేశారు. బిడ్డ కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి సమక్షంలో సోమవారం డిశ్చార్జ్ చేశారు. తన బిడ్డకు పునర్జన్మనిచి్చన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని పర్వీన్ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని ప్రధానమంత్రి ఆరోగ్య బీమా కార్డు ద్వారా పూర్తి ఉచితంగా అందించి తన కుటుంబాన్ని నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. అవయవ దానానికి ముందుకు రావాలి ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ ద్వారా గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. పలువురి ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ జీవన్‌దాన్ కింద రిజి్రస్టేషన్ చేసుకుని అవయవదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ -
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్‌కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త పుంతలు
గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. మానవుల నుంచి మానవులకు గుండెమార్పిడి ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ... ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకే జంతువుల నుంచి కూడా గుండె సేకరించి, మనుషులకు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఓ చింపాంజీ నుంచి గుండె సేకరించి, ఓ చిన్నారికి అమర్చగా ఆమె18 నెలలు బతికింది. అలాగే ఇటీవల పంది నుంచి గుండె సేకరించి అమర్చిన వ్యక్తి రెండు నెలల పాటు జీవించాడు. ఇది కొద్దిపాటి పురోగతే. కానీ మరింత ప్రగతి సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్తపుంతలు చోటు చేసుకుంటున్నాయి. అవేమిటో చూద్దాం. గుండెమార్పిడి అనే మాట వినగానే భయాందోళన కలిగే రోజులు పోయాయి. గుండె పూర్తిగా విఫలమైన తర్వాత... ఇక అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు అత్యుత్తమ చివరిప్రయత్నంగా గుండె మార్పిడి చికిత్సను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారుగా మూడువేల గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే డిమాండ్‌కు అనుగుణంగా దాతలు అందుబాటులో లేనందున అనేకమంది బాధితులు గుండె మార్పిడి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గుండెమార్పిడి శస్త్రచికిత్సల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్ల అవసరమైనప్పుడు గుండె మార్పిడిని ఆశ్రయించడానికీ లేదా అవయవ దాతలుగా నమోదు కావడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు. గుండెమార్పిడి పురోగతిలో రకరకాల మైలురాళ్లివి... ∙డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్: మామూలుగా అవయవ దానం చేయాలంటే మెదడు చనిపోయినప్పటికీ గుండె కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కొన్నిసార్లు మెదడు చనిపోయిన తర్వాత అవయవాల్ని దానం కోసం బయటకు తీసే లోపలే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మాత్రం ఆ అవయవాలు దానానికి పనికిరావు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అమల్లోకి వచ్చిన ప్రక్రియే ‘డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్’! దీనివల్ల అవయదానం చేసేటప్పటికి గుండె ఆగిపోయినప్పటికీ అవయవాల్ని దానం కోసం వినియోగించుకోగలుగుతారు. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్: గుండెమార్పిడి అవసరమైన వ్యక్తులలో గుండె బాగా బలహీనంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె మార్పిడి తర్వాత కూడా గుండె తప్ప మిగతా అవయవాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ముందుగా... గుండెకి మరింత ఆలంబనగా ఉండేందుకు కొన్ని ఉపకరణాలు ఉపయోగపడతాయి. ఇవే‘మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్’ పరికరాలు. వీటిలో ఐ.ఏ.బి.పి., ఇంపెల్లా, ఎక్మో, ఎల్ వాడ్లు వంటివి ప్రధానమైనవి. వైఫల్యం చాలా ఎక్కువగా ఉన్న గుండెలకు మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ పరికరాలు గుండె మార్పిడి ప్రక్రియ సఫలమయ్యే అవకాశాన్ని మరింత పెంచుతాయి. ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్: సాధారణంగా గుండెమార్పిడికి ముందు డోనార్ వయసు, జెండర్, బరువు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వీటితోపాటు బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా దాతను ఎంపిక చేసుకోవడం అవసరం. అయితే ఇప్పుడిప్పుడే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం ఉందని వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రయాణంలోనూ బ్రతికి ఉండే గుండె: సాధారణంగా దాత నుంచి తీసుకున్న గుండెను స్వీకర్త దగ్గరికి తీసుకు వెళ్లడానికి ఐస్ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ఇందులో స్వీకర్తకు అమర్చేందుకు 6 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్గాన్ కేర్ సిస్టమ్’ అనే కీలక ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. దాంతో దాత నుంచి బయటకు తీసిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పాటు గుండె బతికే ఉంటుంది. ఇతర జీవజాతుల నుంచి గుండె మార్పిడి: మనుషుల నుంచి సేకరించే అవయవాలు గుండె మార్పిడికి సరిపోకపోవడంతో ఇతర జీవజాతుల నుంచి స్వీకరించిన గుండెని మనిషికి అమర్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు: అవసరాన్ని బట్టి కొంతమంది రోగుల్లో గుండెతోపాటు ఊపిరితిత్తులనూ మార్చాల్సి రావచ్చు. మరికొంతమందిలో గుండెతోపాటుగా కిడ్నీ లేదా లివర్ మార్చాల్సిన అవసరం పడవచ్చు. గతంలో పేషెంట్స్‌కి ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు చేయడం చాలా కష్టసాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు కలిసి పనిచేయడంతో ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లూ సులువవుతున్నాయి. రిజెక్షన్ నివారణకు కొత్త పద్ధతులు సాధారణంగా బయట నుంచి వచ్చిన కొత్త గుండెను స్వీకర్త శరీరం అంత తేలిగ్గా అంగీకరించదు. అది తన సొంత అవయవం కాదంటూ నిరాకరిస్తూ ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘రిజెక్షన్’ అంటారు. దీన్ని నివారించడానికి ఇప్పుడు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సీఎస్ఐ ( సైరోలిమస్, టాక్రోలిమస్ వంటివి), ఎంటార్ ఇన్హిబిటార్స్, వాటితోపాటు స్టెరాయిడ్స్ కూడా ముఖ్యమైనవి. ఈ మధ్యనే చెక్–పాయింట్ మాలిక్యూల్స్ కూడా ‘ట్రాన్ప్లాంట్స్ రిజెక్షన్’ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా థైమస్ గ్రంథి పనిచేయని పిల్లల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్తోపాటు అదే దాత నుంచి సేకరించిన థైమస్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేసినట్లయితే రిజెక్షన్ తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. రిజెక్షన్‌ని గుర్తించడానికి తేలిక మార్గాలు: గతంలో గుండెమార్పిడి తర్వాత రిజెక్షన్‌ని గుర్తించడానికి... దాత గుండె బయాప్సీ మాత్రమే ఒకే ఒక మార్గం. అయితే ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్ (జీఈపీ) ద్వారా ఓ మామూలు రక్తపరీక్షతోనే రిజెక్షన్‌ను గుర్తించవచ్చు. అది మాత్రమే కాకుండా దాత మూత్రం, రక్తంలో ‘సెల్ ఫ్రీ డిఎన్ఏ’ గుర్తించడం ద్వారా కూడా రిజెక్షన్‌ని తెలుసుకోవచ్చు. ఇమ్యూన్ టాలరెన్స్: మన రోగనిరోధక శక్తే... మనలోకి వచ్చిన కొత్త అవయవాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా చూసేందుకు ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులేమీ వాడకుండానూ, అలాగే రిజెక్షన్ కూడా రాకుండా చూసే పద్థతులను ‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’ అని పిలుస్తారు. దీన్ని సాధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాత తాలూకు బోన్ మ్యారోను కూడా గుండెతో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల కూడా‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’కి అవకాశముంటుందని ఇటీవలి కొన్ని కొత్త పరిశోధనల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు సక్సెస్ రేటూ ఎక్కువే... అందుకు కారణాలివి... మన దేశంలోనూ గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సలో జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత దాదాపు 88 శాతం మంది మొదటి ఏడాది బతికే అవకాశం ఉంటుంది. అంతేకాదు గుండెస్వీకర్తల్లో దాదాపు 75 శాతం మంది ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. ఈ సక్సెస్ రేటు ఇంత మెరుగ్గా ఉండటానికి అనేక కారణాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి... గతంలో పోలిస్తే మరింత మెరుగైన రీతిలో జరుగుతున్న శస్త్రచికిత్స ప్రక్రియలూ, అలాగే శస్త్ర చికిత్సల తరువాత వాడే కొత్త మందులు ప్రధానమైన కారణాలు. తగ్గుతున్న ఖర్చులు: గతంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స అంటే... దాదాపు 35 నుంచి 40 లక్షలు అయ్యేవి. ఇప్పుడీ ప్రక్రియ అనేక ఆసుపత్రుల్లోకి అందుబాటులో రావడంతో రూ. 20 లక్షలకే చేయడం సాధ్యపడుతోంది. దీంతోపాటు ట్రాన్స్‌ప్లాంట్ అనంతర చికిత్స తాలూకు ఖర్చులూ కొంతమేర తగ్గడంతో... ఇది మరింత ఎక్కువమంది బాధితులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలా కొత్తపురోగతులు వస్తుండటంతో ఖర్చు తగ్గుతుండటం అనేది చాలామంది బాధితులకు కనిపిస్తున్న ఓ భవిష్యత్ ఆశారేఖ. -డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
ప్రాణం నిలబెట్టిన ఆరోగ్యశ్రీ.. రూ.25 లక్షల చికిత్స ఉచితంగా
సాక్షి, అమరావతి: గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పునర్జన్మ ప్రసాదించింది. రూ. 25 లక్షల వరకూ ఖర్చయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (గుండె మార్పిడి) చికిత్సను ప్రభుత్వం ఉచితంగా చేయించింది. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల బుడ్డె రాంబాబు విజయవాడలోని ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తాడు. అతనికి భార్య శిరీష, ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు రిషి ఉన్నారు. ప్రస్తుతం శిరీష 8 నెలల గర్భిణి కూడా. గతేడాది జూన్‌లో రాంబాబు గుండెల్లో నొప్పిగా అనిపించి విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె 70 శాతం పనిచేయడం లేదని నిర్ధారించారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యానికి రూ. 25 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో.. అంత ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు రాంబాబును ఇంటికి తీసుకువచ్చేశారు. అయితే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సంప్రదించగా ఆయన ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అధికారులు రాంబాబును బెంగళూరులోని వైదేహీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను ఈ నెల 10న వైద్యులు రాంబాబుకు అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు తమను ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా ఆదుకుందని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా పాలిట వరం కూలి పనులు చేసుకునే కుటుంబం మాది. రాంబాబు నా పెద్ద కుమారుడు. గుండె సరిగా పని చేయడం లేదని వైద్యులు చెప్పినప్పుడు నా కుమారుడు దక్కడేమో అని ఇంటిల్లిపాది ఎంతో ఆందోళన చెందాం. వాడికి ఏమైనా అయితే మనవడు, కోడలు, ఆమె కడుపులోని బిడ్డ అనాథలుగా మారతారని భయపడ్డాం. గుండెమార్పిడి శస్త్రచికిత్సకు రూ. 25 లక్షలు ఖర్చు చేయడం మా వల్ల కాని పని. ఆరోగ్యశ్రీ మా పాలిట వరంగా మారింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా గుండె మార్పిడి చేయించింది. నా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించారు. సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేం. – జమ్మయ్య, రాంబాబు తండ్రి -
25 ఏళ్ల కిందే పంది గుండె అమర్చిన అస్సాం డాక్టర్
గువాహటి: అమెరికాలో గుండె పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చడం, ఆ సర్జరీ విజయవంతమై సదరు వ్యక్తి సొంతంగా ఊపిరిపీల్చుకోగలగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవయవ మార్పిడికోసం ఎదురుచూస్తున్నవారిలో భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారన్న ప్రశంసలను కురిపిస్తోంది. కానీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే.. పెద్దగా సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే.. మన దేశానికి చెందిన ఓ వైద్యుడు ఈ సర్జరీ చేశాడు. ఓ 32 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చగలిగాడు. కానీ తాను చేసిన కొన్ని పొరపాట్లతో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పైగా పోలీసు కేసులు, జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. లేకుంటే ప్రపంచంలో తొలి ‘హార్ట్ జెనో ట్రాన్స్‌ప్లాంట్ (జంతువుల అవయ వాలను మనుషులకు అమర్చడం)’ చేసిన వైద్యుడిగా నిలిచేవాడు. ఇంతకీ ఆ వైద్యుడు ఎవరో తెలుసా.. అస్సాంలోని సోనాపూర్‌కు చెందిన వైద్యుడు ధనిరామ్ బారువా. ప్రస్తు తం 68 ఏళ్ల వయసున్న ఆయన అప్పట్లో ఏం చేశారు, ఏం జరిగిందో తెలుసుకుందామా.. ప్రపంచస్థాయి వైద్యుడాయన.. అస్సాం రాజధాని గువాహటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు పట్టణం సోనాపూర్. ‘టైం కంటే ముందుండే డాక్టర్’గా పేరుపొందిన డాక్టర్ ధనిరామ్ బారువా అక్కడ సొంతంగా ‘ధనిరామ్ హార్ట్ ఇనిస్టిట్యూట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్ ఇంజనీరింగ్’ వైద్య కళాశాలను నడుపుతుండేవారు. 1980వ దశకంలోనే ఆయన ప్రపంచంలోని గొప్ప గుండె వైద్య నిపుణుల్లో ఒక రిగా పేరు పొందారు. గుండెలో దెబ్బతిన్న వాల్వ్‌ల స్థానంలో అమర్చేందుకు 1989లోనే కృత్రిమంగా ‘బారువా హార్ట్ వాల్వ్’లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాల్వ్‌లను ఇప్పటికీ వినియోగిస్తున్నారు కూడా. ఇదేకాదు సొంతంగా మరెన్నో పరిశోధనలూ చేశారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ కూడా ధనిరామ్‌ను పలుమార్లు ప్రశంసించారు కూడా. కానీ 1997లో ఆయన చేసిన ప్రయోగంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అనైతికం, ప్రమాదకరమంటూ.. ధనిరామ్ బారువా 1997 జనవరిలో హాంగ్‌కాంగ్‌కు చెందిన జోనాథన్ హోకీ షింగ్ అనే హార్ట్ సర్జన్‌తో కలిసి సంచలన ప్రయోగం చేశారు. గుండెకు రంధ్రంపడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేసి.. పంది గుండెను అమర్చారు. ఇప్పుడున్నంతగా వైద్య వసతుల్లేని ఆ కాలంలో, అదీ తన వైద్య కళాశాల లోనే ధనిరామ్ విజయవంతంగా ఈ సర్జరీ చేయ డం విశేషం. పంది గుండెతో వారం రోజుల పాటు బతికిన ఆ పేషెంట్.. పలు రకాల ఇన్ఫెక్షన్ల కార ణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఇది ఒక్కసారిగా ఆందోళనలు రేపింది. మనుషులకు పంది గుండె అమర్చడం అనైతికమని, సదరు పేషెంట్ మరణానికి ధనిరామ్ కారణమంటూ విమర్శలు వచ్చాయి. ఆ పొరపాటుతో కేసులు, జైలు.. అప్పటికే ప్రపంచస్థాయి హార్ట్ సర్జన్ అయిన ధని రామ్ ‘జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్’కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. అంతే కాదు.. తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్ష లకు పంపకుండానే, నేరుగా పంది గుండె అమర్చే సర్జరీ చేశారు. దీంతో ఆయనపై, ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయి. 40రోజులు జైల్లో ఉన్నాక బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ అప్పటికే ఆందో ళనకారులు ఆయన ఆస్పత్రిని, ఆస్తులను ధ్వంసం చేశారు. నీళ్లు, కరెంటు అందకుండా చేశారు. ఆ సమయంలో సుమారు ఏడాదిన్నర పాటు ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా గడపాల్సి వచ్చింది. ‘వివాదాస్పద’ ఆవిష్కరణలతో.. తన ఆస్పత్రి దెబ్బతిన్నా, తనపై ఎన్నో ఆరోపణలు చేసినా.. ధనిరామ్ తన పరిశోధనలు కొనసాగిం చాడు. కొన్ని ఆవిష్కరణలు చేసినట్టుగా ప్రకటిం చాడు. కానీ వాటిపై పలు వివాదాలు తలెత్తాయి. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను సరిచేసే జన్యు మార్పిడి వ్యాక్సిన్‌ను రూపొందించినట్టు 2008లో ధనిరామ్ ప్రకటించారు. హిమాలయాల్లోని ఔషధ మొక్కల నుంచి హెచ్ఐవీని నియం త్రించే జన్యువు లను సేకరించామని..86మందిలో హెచ్ఐవీని నిర్మూలించగలిగామని 2015లో ప్రకటించారు. ముందుచూపున్న మేధావి డాక్టర్ ధనిరామ్ బారువా ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని, కానీ తగిన జాగ్రత్తలు, నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని అస్సాంకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గోస్వామి చెప్పా రు. ధనిరామ్ 25 ఏళ్ల కింద అంతంత మాత్రం సదుపాయాలతో గుండె మార్పిడి చేశారని.. అదే ఇన్నేళ్లలో అభివృద్ధి చెందిన సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చారని గుర్తు చేశారు. తన పరిశోధనలను పూర్తిస్థాయి సమీక్షలకు పంపక పోవడంతో అధికారిక గుర్తింపు పొందలేకపోయారని పేర్కొన్నారు. -
అమ్మో! ఆ సర్జరీ చేయించుకుంటే....ఇన్ని సమస్యలా!
-
ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!
అత్యధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విధానంలో మనం చాలా రకాల సర్జరీలు గురించి వినే ఉంటాం. కానీ కొన్న సర్జరీల వల్ల జరిగే దుష్పరిణామాలు గురించి ఇటీవలకాలంలో తరుచుగా వింటున్నాం. కానీ అత్యవసర పరిస్థితిలో రోగిని రక్షించే నిమిత్తం తప్పనిసరై అలాంటి శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఇటీవలకాలంటో గుండె మార్పిడికి సంబందించిన శస్త్ర చికిత్సలు గురించి వింటున్నాం. కానీ ఇక్కడొక అమ్మాయి అలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవడం ఎలా దుష్పరిణామాలను ఎదుర్కుందో చూడండి. గుండె మార్పిడి అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలలో ఒకటి. ఇది వైద్య విధాంలో అత్యద్భుతమైన శస్త్ర చికిత్స. అయితే సిసిలియా-జాయ్ అడమౌ అనే 22 ఏళ్ల మహిళ గుండెకు సంబందించిన ఎడమ కర్ణిక ఐసోమెరిజంతో అట్రియో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్(గుండెకు ఎడమవైపు రంధ్రాలు ఏర్పడటం)తో జన్మించింది. దీంతో ఆమెకు గుండె మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చింది. (చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి) ఈ మేరకు ఆమెకు 2010లో 45 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు గుండె మార్పిడి జరిగింది. దీంతో ఆమె తర్వాత ఆరునెలలకే మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఆమెకు 11 ఏళ్ల ప్రాయంలో జరిగిన ఈ రెండు శస్త్ర చికిత్స ఆమె జీవితాన్నే మార్చేశాయి. తదనంతరం నాలుగేళ్లకే బ్రెయిన్లో ఏర్పడిన కణుతులు కారణంగా మరో ఆపరేషన్ చేయించుకుంది. ఈ సర్జరీల కారణంగా ఆమె రకరకాల దుష్పరిణామాలను ఎదుర్కొంది. అయితే ఆమెకు జరిగిన గుండె మార్పిడి సర్జరీ కారణంగా ఆమె గుండె కొట్టుకుని తీరు అందరికి కనిపించేలా కొట్టుకుంటింది. ఈ శస్త్ర చికిత్సతల తాలుకు మచ్చలు ఆమె శరీరం మీద గుర్తులుగా మిగిలిపోయాయి. ఏది ఏమైన ఒక శస్త్ర చికిత్స చేయిస్తే ఇంకో దుష్పరిణామం ఎదుర్కొవ్వడం మళ్లీ మరో చికిత్సా ఇలా ఆమె మూడు ప్రమాదరకరమైన శస్త్ర చికిత్సలు చేయించుకుంది. ఈ మేరకు ఆమె టిక్‌టాక్‌లో తాను ఈ శస్త్ర చికిత్స వల్ల తాను ఎదర్కొన్న సమస్యలను గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
రాష్ట్రం వెలుపలా ఆరోగ్యశ్రీ ఆదుకుంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో మొదటిసారి చేసిన గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున తెలిపారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామానికి చెందిన ఎ.ఆనంద్ (26)కు బెంగళూరులో గత నెల 28న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించగా అది విజయవంతమై అతను కోలుకున్నట్టు తెలిపారు. ► నాలుగేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్న ఆనంద్కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నిర్ధారించింది. ► దీంతో బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించారు. ► ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ బెంగళూరు సమన్వయకర్త డాక్టర్ ఉష నిరంతరం పర్యవేక్షించారు. ► గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీ రూ.11 లక్షల మొత్తాన్ని వైదేహి ఆస్పత్రికి అందిస్తాం. ఆనంద్‌కు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఈ శస్త్రచికిత్స అందించాం. ► ఆపరేషన్ జరిగిన ఐదో రోజున ఆనంద్ కోలుకొని తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కార్పొరేట్ ఆస్పత్రుల్లోని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందించడాన్ని 2019 నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగానే తొలిసారి ఆనంద్‌కు బెంగళూరులో చికిత్స చేయించగా, అది విజయవంతమైంది. -
‘సహృదయ’ ఆవేదన!
సాక్షి, గుంటూరు: సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసి జాతీయస్థాయిలో జీజీహెచ్‌కు గుర్తింపు తీసుకొచ్చారు. వైద్యరంగంలో సుమారు 65 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీజీహెచ్‌లో తొలిసారిగా బైపాస్ సర్జరీలు చేసి చరిత్ర సృష్టించారు. సేవా భావంతో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందించి దేశంమొత్తం జీజీహెచ్ గురించి చర్చించుకునేలా చేసిన సహృదయ ట్రస్ట్ వైద్య సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ఆస్పత్రి అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాతృ సంస్థకు సేవ చేయాలని.. సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను 2007లో ప్రారంభించిన డాక్టర్ గోఖలే జీజీహెచ్‌లో 2015 మార్చి నుంచి 2019 మార్చి వరకు ట్రస్ట్ ద్వారా సేవలను అందించారు. తాను చదువుకున్న మాతృసంస్థకు తన వంతు సేవ చేయాలని ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ముందుకొచ్చారు. ప్రభుత్వ పెద్దల వరకు తానే తిరిగి వైద్యసేవలు అందించేందుకు అవకాశం ఇవ్వాలని 2014లో కోరారు. ఈ లోగా రాష్ట్రం విడిపోవటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యాలు లేకపోవటంతో నాటి ప్రభుత్వం సహృదయ ట్రస్ట్‌కు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు మూడేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. దీంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 2015 మార్చి నుంచి 2019 మార్చి వరకు సుమారు 580 మందికి గుండె ఆపరేషన్లు చేసి వారి ప్రాణాలు కాపాడారు. నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు.. బైపాస్ సర్జరీలో ఆస్పత్రికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవటమే కాకుండా 2016 మే 20న గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన డ్రైవర్ ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌తో జాతీయస్థాయిలో గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన ఐదో ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. తదుపరి 2016 అక్టోబర్ 4న హీరామతిభాయ్కి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. 2018 ఏప్రిల్ 1న విజయవాడ క్రిష్ణలంకకు చెందిన డిగ్రీ విద్యార్థి గుంటూరు సురేష్‌కు గుండె మార్చారు. నెల్లూరుకు చెందిన హరిబాబుకు 2018 నవంబర్‌లో గుండె మార్పిడి చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. సేవల కొనసాగింపునకు గత ప్రభుత్వం విముఖత.. టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్ట్‌తో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో మూడేళ్లపాటు 2015లో ఒప్పందం చేసుకుంది. 2018 మార్చితో ప్రభుత్వంతో ట్రస్ట్ చేసుకున్న ఒప్పందం గడువు ముగియటంతో తిరిగి తమ వైద్యసేవలను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ట్రస్ట్ వారు ప్రభుత్వాన్ని లిఖిత పూర్వకంగా కోరారు. ప్రభుత్వం హామీ ఇవ్వకపోటంతో ట్రస్ట్ వైద్యులు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి గుంటూరు జీజీహెచ్ వైద్యులే గుండె ఆపరేషన్లు చేస్తామని ప్రకటించారు. వేతనాలు ఇవ్వని ఆస్పత్రి అధికారులు.. కాగా సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిక్రూట్ అయిన 45 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నాల్గోతరగతి ఉద్యోగులు ఇతర వైద్య సిబ్బంది ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల పాటు గుండెజబ్బుల వైద్య విభాగంలో డాక్టర్ గోఖలే వద్ద శిక్షణ తీసుకుని పనిచేసిన వైద్య సిబ్బందిని నేడు ఇతర వార్డులకు విధులు నిర్వహించేందుకు పంపిస్తున్నారు. జీజీహెచ్ వైద్యులు ఆపరేషన్లు చేయటం ప్రారంభించి మూడునెలలు గడిచినా నలుగురికి మాత్రమే గుండె ఆపరేషన్లు జరిగాయి. దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగులు వైద్య సేవల్లో తీవ్ర జాప్యాన్ని తట్టుకోలేక గుండె జబ్బు ముదిరిప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పోతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై దృష్టి సారించి పేద రోగుల గుండెలు గాల్లో కలిసి పోకుండా గుండె ఆపరేషన్లు సకాలంలో జరిగేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. నిధులు ఇవ్వని గత ప్రభుత్వం.. గుండె మార్పిడి ఆపరేషన్లు నాలుగు చేసినా గత ప్రభుత్వం ట్రస్ట్‌కు నిధులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయిస్తున్నామని పలుమార్లు ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రసారం చేసింది. దీంతో సుమారు 25 మందికి పైగా నిరుపేదలు గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకునేందుకు తమ పేర్లు నమోదు చేయించుకుని సిద్ధంగా ఉన్నారు. నాటి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోటంతో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు లేక ట్రస్ట్ వారు ఆపరేషన్లు నిలిపివేశారు. -
పునర్జన్మనిచ్చారు
‘అందరి దృష్టిలో ఈ నవంబర్ 14 బాలల దినోత్సవం. కానీ నాకు మాత్రం పునర్జన్మను పొందిన రోజు. ఆస్పత్రికి, వైద్య సిబ్బందికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది’ – నాగ శ్రీకాంత్ సాక్షి, హైదరాబాద్: గుండె పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండెమార్పిడి చికిత్సతో మళ్లీ జీవితాన్ని ప్రసాదించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు, కార్డియాలజిస్ట్ పవన్ పోద్దర్ శుక్రవారం ఆస్పత్రిలో మీడియాకు ఈ చికిత్స వివరాలు వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితునికి ఈ చికిత్సను ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ శ్రీకాంత్(48) ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంటున్నారు. కొంత కాలంగా ఛాతీలో తీవ్ర అసౌకర్యం, గుండె దడ సమస్యలతో బాధపడుతున్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. రక్త ప్రసరణలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినా ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దీంతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావును ఆశ్రయించారు. పలు వైద్య పరీక్షలు చేసిన తరువాత గుండె ఎడమ జఠరిక సిస్టోలిక్ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించి, గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని సూచించారు. చికిత్సకు అంగీకరించడంతో గుండె దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆర్థిక సహకారం కోసం ఆరోగ్యశ్రీలో దరఖాస్తు చేశారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నవంబర్ 13న ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయాలు తగలడం, అప్పటికే అపస్మారకస్థితిలోకి చేరుకోవడం తో వైద్యులు బ్రెయిన్‌డెడ్ డిక్లేర్ చేశారు. అవయ వాలను దానం చేసేందుకు యువకుని తరఫు బంధువులు అంగీకరించడంతో వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని చికిత్స కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌తో పాటు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందజేశారు. రెండు బృందాలుగా ఏర్పడి.. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండు బృందాలుగా విడిపోయారు. దాత నుంచి గుండెను సేకరించేందుకు ఓ బృందం సిద్ధం కాగా, గుండెను తరలించే లోపు స్వీకర్త ఛాతీ తెరచి ఉంచేందుకు మరో బృందం సిద్ధమైంది. నవంబర్ 13న రాత్రి ప్రత్యేక గ్రీన్‌చానల్ ద్వారా ఏడు నిమిషాల్లో సోమాజిగూడ నుంచి మలక్‌పేట ఆస్పత్రికి గుండెను తరలించారు. రాత్రి 3.30 గంటలకు గుండె మార్పిడి చికిత్స ప్రారంభమైంది. సర్జరీ సమయంలో తలెత్తిన అధిక రక్తస్రావం సమస్యను నిరోధించడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. నవంబర్ 14 ఉదయం 9.30 గంటలకు సర్జరీ ముగిసింది. 24 గంటల పాటు వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తర్వాత వెంటిలేటర్ తొలగించి... రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ జీఎస్‌రావు ప్రకటించారు. -
పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్ గుండె(లైవ్ హార్ట్)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానల్’ఇచ్చారు. ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా.. కేర్ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల సహకారం మరువలేం మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్ ఇచ్చిన లైవ్ హార్ట్ ఆపరేషన్ థియేటర్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె ఇదీ గుండె ప్రయాణం.. మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో ఉన్న అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఉదయ్ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్ రోడ్, తాజ్ ఐలాండ్, గాంధీభవన్ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్‌కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు గ్రీన్ చానల్ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. -
29 ఏళ్ల యువకుడికి..16 ఏళ్ల కుర్రాడి గుండె!
కేర్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కేర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ రాజశేఖరరావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బీకేఎస్ శాస్త్రి శుక్రవారమిక్కడ వివరాలు వెల్లడించారు. బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ సుధీర్ సంఘవీకర్ (29) ఏడాదిన్నరగా హృద్రోగంతో బాధ పడుతున్నారు. విపరీతమైన ఆయాసంతో పాటు 4 అడుగుల దూరం కూడా నడవలేని పరిస్థితి. చికిత్స కోసం 6 మాసాల క్రితం నాంపల్లి కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. గుండె కండరాలు బలహీనంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే స్టంట్ వేసి ఉండటంతో గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. నిజామాబాద్ విద్యార్థి గుండె దానం: ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నల్లగండ్ల కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు విద్యార్థి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. 26 కిలోమీటర్లు..13 నిమిషాల్లో : జీవన్‌దాన్ ద్వారా సమాచారం అందుకున్న కేర్ వైద్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. 26 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రి నుంచి దాత గుండెను అంబులెన్స్‌లో తరలించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో 13 నిమిషాల్లోనే నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం 20 మంది వైద్యుల బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గుండెను సేకరించిన 76 నిమిషాల్లోనే రక్త సరఫరాను పునరుద్ధరించినట్లు డాక్టర్ కేవీ రాజశేఖరరావు తెలిపారు. 2004 జూన్‌లో తొలిసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన తరువాత ఆస్పత్రిలో ఈ తరహా శస్త్రచికిత్స చేయడం మళ్లీ ఇదేనన్నారు. ప్రస్తుతం సంతోష్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
ఇక ఇక్కడా... కృత్రిమ గుండె
హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చిన కిమ్స్ పరికరం ఖరీదు రూ.60 లక్షలు హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితులకు శుభవార్త. ఇక నుంచి బ్రెయిన్‌డెడ్ బాధితుని నుంచి సేకరించే సహజమైన గుండె కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కృత్రిమ గుండెను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఢిల్లీ, చెన్నైలో మాత్రమే ఈ తరహా వైద్యసేవలు అందుబాటులో ఉండగా, తాజాగా హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. వైద్య పరిభాషలో హార్ట్‌వేర్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ (హెచ్వీఏడీ)గా చెప్పుకునే 160 గ్రాముల బరువున్న ఈ కృత్రిమ గుండెను ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ యాజమాన్యం సోమవారం ఆస్పత్రిలో ఆవిష్కరించింది. గోల్ఫ్ బంతి సైజులో ఉన్న ఈ పరికరాన్ని రోగి ఛాతిలోపల ఉన్న గుండెకు కింది భాగంలో అమర్చుతారు. లెఫ్ట్ వెంట్రికల్ (ఎల్వీఏడీ) ఫెయిల్యూరైతే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా, రైట్ వెంట్రికల్ (ఆర్వీఏడీ) పనిచేయకపోతే కుడి భాగానికి సపోర్టుగా, రెండు వెంట్రికల్స్ విఫలమైతే రెండి ంటికీ సపోర్టుగా దీన్ని అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన ఈ గుండె నిమిషానికి పది లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్‌కు అనుసంధానిస్తారు. చిన్న కేబుల్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. ఆరు గంటలకోసారి బ్యాటరీ మార్చుకోవాలి. దీని ఖరీదు రూ.60 లక్షలు. శస్త్రచికిత్స, వైద్యుడి ఫీజు, ఆస్పత్రి ఖర్చు అన్నీ కలిపి రూ.80-90 లక్షలవుతుంది. కిమ్స్ ఎండీ, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు హృద్రోగులకు మాత్రమే ఈ పరికరాన్ని అమర్చారని, దీంతో వారి జీవితకాలం మెరుగుపడిందన్నారు. ప్రముఖ గుండెమార్పిడి నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ నందగిరి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతుండగా, 7.25 మిలియన్ల మంది మరణిస్తున్నారని చెప్పారు. వీరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైన సమయంలో సహజమైన గుండె దొరక్క రోగులు చనిపోతున్నారని, సహ జ గుండెకు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాన్ని అమర్చి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. -
ట్రాఫిక్ ఆపి.. ప్రాణం పోసి..
ట్రాఫిక్ పోలీసుల సహకారంతో విజయవంతమైన గుండెమార్పిడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి గుండె సేకరణ.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపేసి, సిగ్నళ్లను నిలిపేసి.. ప్రత్యేక మార్గం ఏర్పాటు 12.7 కిలోమీటర్లు, 9 కూడళ్లు.. దాటింది ఎనిమిది నిమిషాల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సమయం రాత్రి 9.30.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి ప్రాంతం నుంచి ఒక వాహనం బయలుదేరింది.. జూబ్లీహిల్స్ వైపు దూసుకెళుతోంది.. నిరంతరం ట్రాఫిక్‌తో కిటకిటలాడే మార్గమది.. కానీ, ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ ఆపేశారు.. కూడళ్లన్నింటి వద్ద సిగ్నళ్లను నిలిపేశారు.. ఈ వాహనం వెళుతున్న దారిలో ఉన్న వాహనాలన్నింటినీ వేగంగా పంపించారు.. మరికొన్నింటిని దారి మళ్లించారు.. ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక మార్గాన్ని కల్పించారు.. రాష్ట్రపతి వంటివారు ప్రయాణిస్తుంటే తీసుకునే ముందుజాగ్రత్తల్లా ఉన్నాయా చర్యలు... ఇదంతా ఒక యువకుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి చేసిన అద్భుతం. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న ఒక యువకుడికి అమర్చేందుకు.. ఇలా అసాధారణ ట్రాఫిక్ అప్రమత్తత మధ్య తీసుకువెళ్లారు. ఈ ఆస్పత్రుల మధ్య 12.7 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది కూడళ్లను దాటుకుని వెళ్లేందుకు ఆ సమయంలో సాధారణంగా 45 నిమిషాలకు పైగా పడుతుంది. కానీ, ఈ గుండెను తీసుకువెళుతున్న అంబులెన్సు కేవలం 8 నిమిషాల్లో దూసుకుపోగలిగింది. ‘డైలేటెడ్ కార్డియోపతి (గుండె కండరాలు, రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడం)’తో బాధపడుతున్న గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు (19) కొద్ది నెలల కింద అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరాంజనేయులుకు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పిన వైద్యులు.. బాధితుడి సమాచారాన్ని నిమ్స్ జీవన్‌దాన్ కేంద్రానికి చేరవేశారు. నవంబర్ 11న సాయంత్రం 6.30 గంటల సమయంలో యశోదా ఆస్పత్రిలో ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లినట్లు ‘జీవన్‌దాన్’కు సమాచారం అందింది. జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానానికి ఆ వ్యక్తి బంధువుల అంగీకారం తీసుకుని.. సమాచారాన్ని అపోలో ఆస్పత్రికి చేరవేశారు. వయసు, రక్తం గ్రూపు వంటివి మ్యాచ్ కావడంతో అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నారు. యశోద ఆస్పత్రిలోని వ్యక్తి నుంచి సేకరించిన గుండెను పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పద్మనాభరెడ్డి సహాయంతో 8 నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో గుండెను తరలించడం వల్ల శస్త్రచికిత్స విజయవంతమైనట్లు అపోలో వైద్యుడు విజయ్ దీక్షిత్ చెప్పారు. తరలింపులో పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘జీవన్‌దాన్’ పథకం కింద హైదరాబాద్‌లో తొలిసారి ఉచితంగా జరిగిన గుండెమార్పిడి శస్త్రచికిత్స ఇది కావడం గమనార్హం. నాలుగు గంటల్లోపే.. గుండె మార్పిడి చేయాలంటే.. దాత వయస్సు, రక్తం గ్రూపు బాధితుడికి మ్యాచ్ కావాలి. సేకరించిన గుండెను పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచి తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అందులో ఆక్సిజన్, గ్లూకోజ్ శాతాలు తగ్గకుండా చూడాలి. బాధితుడి దెబ్బతిన్న గుండె స్థానంలో అమర్చాలి. గుండెను తీయడం నుంచి బాధితుడికి అమర్చడం వరకూ అంతా కూడా నాలుగు గంటల లోపుగా జరగాలి. లేకపోతే అది పనిచేయదు. కాగా, విదేశాల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు రూ. కోటిన్నరకుపైగా ఖర్చు అవుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 15 లక్షల వరకు మాత్రమే అవుతుందని అపోలో ఆస్పత్రి ఎండీ సంగీతారెడ్డి చెప్పారు.