తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్‌ఆర్‌ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.
కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది.
ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment