
అద్భుత ద్వీపం
చుట్టూ సముద్రం.. మధ్యలో చక్కని ఇల్లు.. పక్కనే చిన్న తోట.. చూడడానికి ఈ ద్వీపం బాగుంది కదూ..
చుట్టూ సముద్రం.. మధ్యలో చక్కని ఇల్లు.. పక్కనే చిన్న తోట.. చూడడానికి ఈ ద్వీపం బాగుంది కదూ.. మన దగ్గర కాస్త దండిగా డబ్బులుంటే నీటిపై తేలియాడే ఇలాంటి ద్వీపాలు మీ సొంతం అంటోంది క్రిస్టీస్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ సంస్థ. చెప్పడమే కాదు.. అందుకోసం లొకేషన్‌ను కూడా రెడీ చేసేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి ద్వీపాలను నిర్మించనున్నారు.
వీటిని తొలుత మాల్దీవుల్లో నిర్మిస్తామని.. తర్వాతి దశల్లో దుబాయ్, మయామీలకు విస్తరిస్తామని క్రిస్టీస్ తెలిపింది. దీని రేటు ఎంత అన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.