32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే.. | Italian Man Who Spent 32 Years Alone on Island Dies Three Years After | Sakshi
Sakshi News home page

32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..

Published Wed, Jan 15 2025 2:13 PM | Last Updated on Wed, Jan 15 2025 2:25 PM

Italian Man Who Spent 32 Years Alone on Island Dies Three Years After

ఒంటరితనంతో బాధపడుతుంటారు చాలామంది. దీన్నుంచి బయటపడేలే స్నేహితులు లేదా బంధువుల వద్దకు వెళ్లిపోతారు. కానీ ఓ వ్యక్తి ఏరికోరి మరి ఏకాంతంగా ఉండాలని మనిషే కానరాని ఓ దీవిలో ఉంటాడు. అక్కడే అలా ఒకటో, రెండో ఏళ్లు కాదు ఏకంగా ముప్పై ఏళ్లకు పైగా గడిపేశాడు. అయితే అకస్మాత్తుగా ఉన్నపళంగా జనాల మధ్యలోకి వెళ్లక తప్పలేదు. పాపం సడెన్‌గా అలా జనాల మధ్యలో జీవించాల్సి రావడంతో మనుగడ సాగించలేక అల్లాడిపోయాడు. చూస్తుండగానే ఆరోగ్యం క్షీణించి  చనిపోయాడు. ఎవరా వింత వ్యక్తి అంటే..

రాబిన్సన్ క్రూసోగా పిలిచే ఇటాలి(Italy)కి చెందిన మౌరో మొరాండి(Mauro Morandi,) ముప్పైళ్లకు పైగా ఒంటిరిగా బుడెల్లి ద్వీపంలో ఒంటిరిగా ఉండేవాడు. ఈ ద్వీపం ఇటలీకి  రెండొవ ప్రపంచ యుద్ధ సమయం(World War II)లో ఆశ్రయంగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఏ వ్యక్తి ఇక్కడ జీవనం సాగించ లేదు. అలా ఈ ద్వీపం జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశంగా మారింది. 

అయితే రాబిన్సన్ క్రూసోగా పిలిచే మౌరో మొరాండి 1989లో పాలినేషియాకు చెందిన ఒక మిషన్‌ కోసం వచ్చి..ఈద్వీపంలోని ఉండిపోవాలని నిర్ణయించకుంటాడు. అలా ఈ ద్వీపంలోనే ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ ద్వీపం సమీపంలోని బీచ్లను శుభ్రంగా ఉంచేవాడు. అక్కడకు వచ్చే పర్యాటకులు పర్యావరణ వ్యవస్థ గురించి అవగాన కల్పించేవాడు. 

అతను అక్కడ ఒక ఇంటిని నిర్మించి తాత్కాలికి సౌర విద్యుత్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. చలికాలంలో ఒక సాధారణ పొయ్యితో ఇల్లు వెచ్చగా ఉండేలా చేసుకునేవాడు. అతనిని రాబిన్సన్ క్రూసోగా ఎందుకు పిలిచేవారంటే..  రాబిన్సన్ క్రూట్జ్‌నేర్ నవలలో ఓ పాత్ర పేరు. ఆ కథలో రాబిన్సన్ అనే వ్యక్తి ఓడ ధ్వసం కావడంతో వెనిజులా నుంచి ట్రినిడాడ్‌ తీరంలోని నిర్మానుష్య ఉష్ణమండలం దీవికి వస్తాడు. అక్కడే 28 ఏళ్లు గడుపుతాడు.

అచ్చం అలాగే ఈ ఇటాలియన్‌ వ్యక్తి మౌరో మొరాండి ఒంటిరిగా ఈ దీవిలో గడపడంతో అంతా ఆ పాత్ర పేరుతో పిలచేవారు. అయితే 2021లో, లా మాడలీనా జాతీయ ఉద్యానవన అధికారులు ఆ దీవిని పర్యావరణ కేంద్రంగా మార్చాలని ప్లాన్‌ చేశారు. దీంతో మౌరో మొరాండిని ఆ దీవి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో అతను ఇటలీలో సావర్డినియాలోని ఓ నగరంలో అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని జీవించడం ప్రారంభించాడు. 

అయితే అప్పటి వరకు ఏకాంతం అలవాటై నగరంలో ఈ రణగొణ ధ్వనుల మధ్య ఉండలేక అల్లాడిపోయాడు. అదీగాక వయసు రీత్యా వార్ధక్య రుగ్మతలు కూడా ఇబ్బంది పెట్టడంతో ఎంతకాలం జీవిచలేకపోయాడు. ఆ దీవి నుంచి వచ్చిన మూడేళ్లకే 85 ఏళ్ల వయసులో మరణించారు మౌరో మొరాండి.

(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌, ఫోటోగ్రఫీ వదిలి మరీ..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement