ఇది ఇటలీలోని పోవెలియా దీవి. పైనుంచి చూస్తే రెండు జంటదీవుల్లా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది ఒకటే దీవి. ఒక సన్నని కాలువ ఈ దీవిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఇక్కడ మనుషులు ఉండేవారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్నాలుగో శతాబ్దిలో యుద్ధం జరిగినప్పడు ఇక్కడి ప్రజలు దీవిని విడిచిపెట్టి పారిపోయారు.
తర్వాత చాలాకాలానికి 1776లో మళ్లీ మనుషులు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని, దాదాపు శతాబ్దానికి పైగా ఉన్నారు. దుష్టశక్తులు ఉన్నాయనే భయంతో ఈ దీవిని జనాలు ఖాళీ చేసేశారు. అయితే, ఇటలీ ప్రభుత్వం ఈ దీవిని క్వారంటైన్ సెంటర్‌గా వాడుకుంది. ప్లేగు, కలరా వంటి మహమ్మారి వ్యాధులు సోకిన వారిని ఇక్కడకు తరలించి చికిత్సలు చేయించేది. ఇక్కడొక మానసిక చికిత్స కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడటంతో ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది.
(చదవండి: గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..)
Comments
Please login to add a commentAdd a comment