Haunting
-
Rajasthan Haunted Places: రాజస్థాన్‌లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
మనుషులు వదిలేసిన దీవి
ఇది ఇటలీలోని పోవెలియా దీవి. పైనుంచి చూస్తే రెండు జంటదీవుల్లా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది ఒకటే దీవి. ఒక సన్నని కాలువ ఈ దీవిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఇక్కడ మనుషులు ఉండేవారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్నాలుగో శతాబ్దిలో యుద్ధం జరిగినప్పడు ఇక్కడి ప్రజలు దీవిని విడిచిపెట్టి పారిపోయారు. తర్వాత చాలాకాలానికి 1776లో మళ్లీ మనుషులు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని, దాదాపు శతాబ్దానికి పైగా ఉన్నారు. దుష్టశక్తులు ఉన్నాయనే భయంతో ఈ దీవిని జనాలు ఖాళీ చేసేశారు. అయితే, ఇటలీ ప్రభుత్వం ఈ దీవిని క్వారంటైన్ సెంటర్‌గా వాడుకుంది. ప్లేగు, కలరా వంటి మహమ్మారి వ్యాధులు సోకిన వారిని ఇక్కడకు తరలించి చికిత్సలు చేయించేది. ఇక్కడొక మానసిక చికిత్స కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడటంతో ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. (చదవండి: గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..) -
ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు
దట్టమైన అడవి మధ్యలో నల్ల కాళ్ల జెర్రి లాంటి తారు రోడ్డుమీద వెళుతుంటే హఠాత్తుగా భారీ వర్షం రావడం, మార్గమధ్యంలో కారు చెడిపోవడం, అందులో ప్రయాణిస్తున్న నలుగురైదుగురు మిత్రులు ఆ రాత్రికి ఆశ్రయం వెతుకుతూ ఓ పాడు పడిన బంగళా వద్దకు వెళ్లడం, ఆ రాత్రికి భయం భయంగా అక్కడే పడుకోవడానికి ప్రయత్నించడం, అర్ధరాత్రి దాటాక భూత, ప్రేత, పిశాచాల అరుపులు, కేకలు వినిపించడం.... పాత్రలతోపాటు ప్రేక్షకులుగా మనమూ జడసుకోవడం చాలా ‘కైమ్ త్రిల్లర్’ చిత్రాలను చూడడం ద్వారా అనుభవించే ఉంటాం. అలాంటి భయానక అనుభవాలను సినిమాల్లోని పాత్రలకే కాకుండా మనకు కూడా అంతటి అనుభవాలను కలిగించేందుకు అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ‘మ్యాక్ కామే మానర్’ పేరిట ఓ ‘హారర్ హౌజ్’ను ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లి పది గంటలు గడిపి వచ్చిన వాళ్లకు 20 వేల డాలర్లు ( 14,20,000 రూపాయలు) బహుమతిగా అందజేస్తామని ‘మాక్ కామే మానర్’ యజమాని రస్ మాక్ కామే సవాల్ చేస్తున్నారు. ఇందులోకి వెళ్లి రావాలనుకుంటున్న సాహసికులకు చాలా షరతులు కూడా ఉన్నాయి. వారు సంపూర్ణ ఆరోగ్యంతోనే కాదు, 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. శారీరకంగా, మానసికంగా బలిష్టంగా ఉన్నట్లు కుటుంబ వైద్యుడి నుంచి సర్టిఫికెట్ తీసుకరావాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వచ్చాక కూడా హారర్ హౌజ్ నిర్వాహకులు సొంత వైద్యుల చేత ‘ఫిట్నెస్’ పరీక్షలు చేయిస్తారు. అందులో పాస్ కావాలి. ఓ డ్రగ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దాన్ని కూడా తట్టుకోవాలి. లోపలికి వెళితే ఎలాంటి దశ్యాలు ఉంటాయో వెళ్లాలనుకుంటున్న సాహసికులకు ముందుగానే వీడియోల ద్వారా చూపిస్తారు. లోపలికి వెళితే ఏం జరుగుతుందో కూడా వివరిస్తారు. ఇంతకు ముందు అందులోకి వెళ్లిన వారి అనుభవాలను కూడా చూపిస్తారు. ఆ తర్వాతనే ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తారు. కొన్నేళ్లుగా ఈ హారర్ హౌజ్‌ను నిర్వహిస్తున్నా ఇంతవరకు ఎవరు కూడా పది గంటల పాటు ఆ ఇంట్లో గడిపి వచ్చిన వారు, 20 వేల డాలర్లు అందుకున్న వారు లేరని రస్ మాక్ కామే తెలిపారు. ఇందులో వెళ్లి వచ్చిన వారికి ఎక్కడా చిన్న గాయం కూడా కాదని గ్యారంటీ కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యలోనే భయపడి బయటకు రావాలని కోరుకుంటున్న వారు నోటితో చెప్పినా, సైగలు చేసినా సురక్షితంగా భయటకు తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ భయానక హౌజ్‌ను నిర్వహించడం వెనక తమకు మంచి లక్ష్యమే ఉందని, ఈ అనుభవం కలిగిన వారు భవిష్యత్తులో సమాజంలోనే కాకుండా ప్రకృతిపరంగా ఎదురయ్యే ఎలాంటి భయానక అనుభవాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని రస్ మాక్ తెలిపారు. హౌజ్‌లోకి వెళ్లిన వారిని కొన్ని నీళ్లు మాత్రమే ఉన్న చిన్న బాత్ టబ్‌లో కూర్చోబెట్టి ఆ నీటిలో ఓ పెద్ద షార్క్ ఉందని చెబుతామని, నిజంగానే అది ఉన్నట్లు భ్రమించి భయపడతారని ఆయన తెలిపారు. కానీ ఆ ఇళ్లంతా రక్తసిక్తమైన గోడలతో, పుర్రెలతో ఉంటుంది. దెయ్యాల మాస్క్‌లు ధరించి వచ్చే మనుషులు గొంతులు పట్టుకొని తలలు కోస్తున్నట్లు, చేతులు నరికేస్తున్నట్లు, రక్తం నిండిన బాత్ టబ్బుల్లో ముంచేస్తున్నట్లు నటిస్తారు. అలా మనుషులే నటిస్తారా? అవన్నీ వీడియో దశ్యాలా ? తెలియవు. అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఈ ‘హారర్ హౌజ్’ నడుస్తున్నప్పటికీ అంతగా ప్రజలకు దృష్టికి రాలేదు. ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్’, హంటర్స్–ఆర్ట్ ఆఫ్ ది స్కేర్’ పేరిట ఈ హౌజ్ గురించి చూపించడంతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. -
బురారీ ఉదంతం : ఆత్మలు తిరుగుతున్నాయి
న్యూఢిల్లీ : అహ్మద్ అలీ, అస్ఫర్ అలీల వృత్తి కార్పెంటర్ పని.. ప్రవృత్తి హాంటెడ్ హౌస్(దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరిగే ఇళ్లు)ల్లో నివసించడం. సాధరణంగా ఇలాంటి వారి గురించి ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూంటాం. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో విలువైన ఇంటిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడం.. ఈ క్రమంలో హీరో అక్కడ కొన్ని రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లే అని నిరూపిస్తుంటారు. సరిగా అలీ బ్రదర్స్ పని కూడా ఇదే అన్నమాట. ప్రస్తుతం వీరు ఇద్దరు బురారీ కుంటుంబ సభ్యుల ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బురారీ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఉదంతాన్ని అంత తొందరగా మర్చిపోలేం. (చదవండి : తండ్రి కాపాడుతాడని...) అతీత శక్తుల భ్రమలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మరణాంతరం గత ఏడాది అక్టోబర్‌లో దినేష్ చుంద్వాత్ అనే వ్యక్తి ఈ ఇంటిని కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో.. ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఈ ఇంటిలో ఆత్మలు తిరుగుతున్నాయనే పుకార్లు వ్యాపించాయి. దాంతో కోటిన్నర పెట్టి కొన్న ఇంటిని కొనడానకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇంటి మీద వచ్చిన పుకార్లు నిజం కాదని నిరూపించి.. మంచి రేటుకు ఇంటిని అమ్మాలని భావించిన దినేష్, అలీ సోదరులకు కబురుపెట్టాడు. కొన్ని రోజులు పాటు తన ఇంట్లో ఉండాల్సిందిగా దినేష్ వారిని కోరాడు. రెంట్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పాడు. దినేష్ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడంతస్థుల భవనంలో కింది ఫ్లోర్‌ను తమ కార్పెంటర్ విధుల కోసం వాడుకుంటుండగా.. మిగతా రెండంతస్థుల్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ విషయం గురించి అలీ సోదరులు మాట్లాడుతూ.. ‘తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నాం. మాకేం తేడగా అన్పించలేదు. తరువాత మేం ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూంల్లో ఒంటరిగా పడుకుంటున్నాం’ అన్నారు. అయితే తాము బురారీ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండటం తమ ఇంట్లోవారికి కూడా ఇష్టం లేదని తెలిపారు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాము అందుకు ఒప్పుకోలేదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు అధికంగా ఉంటాయని.. కానీ తాము వాటిని నమ్మమని తెలిపారు అలీ సోదరులు. అయితే అర్థరాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతుంటాయని తాము బలంగా విశ్వసిస్తామన్నారు. ఈ విషయం గురించి ఓ ప్రాపర్టీ డీలర్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవరైనా కొందామని భావించిన చాలా తక్కువ రేటుకు కొందామనే భావిస్తారు. బురారీ ఇళ్లు రోడ్డుకు దగ్గర్లో ఉంది. పెయింట్ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే.. మంచి ధర పలుకుతుంది. కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతోన్న పుకార్లు అవాస్తవమని తెలాలి’ అన్నారు. -
'ఆత్మలను తరిమికొడితే సెక్రటేరియట్‌కు వస్తాం'
సాక్షి, జైపూర్ : దెయ్యాలు, ఆత్మలు రాజస్థాన్ సెక్రటేరియట్లో హల్ చల్ చేస్తున్నాయట. ఇవి వదంతులు కాదు. ఈ మాటలు చెబుతున్నది స్వయంగా రాజస్థాన్ ప్రభుత్వ ఎమ్మెల్యేలే. ఇటీవల కాలంలో చనిపోయిన ఇద్దరు రాజస్థాన్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో వారు చనిపోయి దెయ్యాలుగా మారి తిరుగుతున్నారంటూ వారే స్వయంగా చెబుతున్నారు. వెంటనే భూత వైద్యులు, వివిధ మతాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించకపోతే తాము సెక్రటేరియట్లో అడుగు కూడా పెట్టబోమంటూ వారు కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సెక్రటేరియట్ భవనంలో ప్రత్యేక పూజలు జరిపించాలని, చుట్టుపక్కల ఏమీ రాకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రహ్మాన్ తెలిపారు. ఒకప్పుడు శ్మశానంగా ఉన్న ప్రాంతంలో సెక్రటేరియట్ నిర్మించారని, దాంతో అందులో దెయ్యాలు తిరుగుతూ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయని ఆయన అన్నారు. 2001లో ఈ భవనం నిర్మించారు. -
పిల్లులు.. కుక్కలను తింటున్నారు!
ఐసిస్ అధీనంలోని నగరాల్లో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించినవారు కూడా ఎముకల గూడుల్లా తయారయ్యారు. కడుపు నిండని తల్లులు.. తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని దీనావస్థకు చేరుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనలేక, కడుపు మాడ్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. అన్నం స్థానంలో గడ్డి, మూలికలు, వేళ్ల వంటి వాటితో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి పిల్లులను, కుక్కలను చంపి తినేందుకూ వెనుకాడటం లేదు. సిరియా ముట్టడి ప్రాంతంలో శిశువులు వేలాది మంది పస్తులతో మరణిస్తున్నారు. నెలల వయసులోనే పోషకాహారం అందక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన డైర్ అజోర్ ప్రాంతం ఇప్పుడు మహిళలు, పిల్లల మరణాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మధ్య ప్రాంతం నుంచి తప్పించుకొని డీర్ ఎజోర్ లో చిక్కుకున్న వేలాదిమంది శరణార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. బషర్ అల్ అస్సాద్ అందించే చాలీచాలని సరుకుల పంపిణీ.. శరణార్థులను చిక్కిశల్యమయ్యేలా చేస్తోంది. ఆహారధాన్యాలు అందించాలంటే సైన్యాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కార్గో విమానాలు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పిల్లలు.. తిండిలేక ఆకలితో మరణిస్తున్నారు. ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుగా మారిపోతున్నారు. వేలాదిమంది చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అతిసారం వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని శిశువుల చిత్రాలను చూస్తే అక్కడి వాస్తవిక పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. 11 నెలల నుంచి ఐసిస్ ముట్టడిలో ఉన్న డైర్ అజోర్లో చిక్కుకున్న సుమారు లక్ష మందికి పైగా శరణార్థులు ఆకలి, అనారోగ్యాలతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బషర్ అల్ అస్సద్ అధీనంలోకి డైర్ అజోర్ జిల్లాలు చేరిన 8 నెలలకు ఆ బిడ్డలు పుట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి దీనావస్థలో ఉన్న సమయంలో శుక్ర్ అల్ అఫ్రే. పుట్టాడు. అతని తల్లి మన్నార్ కస్సర్ అల్ డఘిమ్ ఆహారం లేక కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో పోషకాహారం లేని ఆ చిన్నారి తీవ్ర రక్తహీనతకు లోనయ్యాడు. బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు దుఖసాగరంలో జీవిస్తున్నారు. చావైనా తమను కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తిండిలేక, బతికేందుకు ఆసరా లేక శరణార్థులు చావే శరణ్యంగా జీవిస్తున్నారు. ముట్టడి ప్రాంతంలో సాధారణ జీవన పరిస్థితులు చిన్నాభిన్నమైపోయాయని, శరణార్థులు తిండిలేక.. ఆకలి తట్టుకోలేక ఏం కనిపించినా తినే స్థితికి చేరారని చెప్తున్నారు. స్థానిక జనజీవనం స్తంభించిపోయి, ఆస్పత్రుల్లో రోగులు, బయట సైనికులను మాత్రమే చూడగలిగే పరిస్థితి దాపురించిందని స్థానిక దుకాణదారుడు అబుల్ ఖాసిం చెప్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా తిండి కోసం జనం ఎదురు చూస్తున్నారని, పిల్లలను బతికించుకునేందుకు వేడినీటిలో ఉప్పు కలిపి, బ్రెడ్ తో పెడుతున్నారని అంటున్నాడు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా, భయంకరంగా మారుతోందని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు పిల్లల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొందరు ఆహారం కోసం ఇంట్లోని వస్తువులు, ఇళ్ళూ అమ్మేసిన దాఖలాలున్నాయి. కొందరు గడ్డి, మూలికలు, ఆకులు తింటుంటే.. మరి కొందరు కుక్కలు, పిల్లులను చంపి తినడం శోచనీయంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు వంద రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ ముగ్గురికి మాత్రమే తిండి దొరుకుతోంది. ఒకటి సైన్యం, మరొకరు విదేశాల్లో బంధువులు ఉన్నవారు, ఇంకొకరు సంపన్నులు. మిగిలినవారంతా కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. ఆహారం అందే మార్గం లేక, ధరాఘాతాన్ని తట్టుకోలేక పొట్ట చేత పట్టుకొని, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని నిర్జీవంగా బతుకుతున్నారు.