
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కార్ రేసింగ్ అంటే విపరీతమైన క్రేజ్. ఎక్కడా రేసింగ్ జరిగినా సరే తన టీమ్‌తో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇటీవలే ఓ రేసింగ్‌లో గెలిచిన అజిత్ టీమ్.. తాజాగా మరోసారి ఛాంపియన్‌గా నిలిచారు. తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసింగ్-12 హెచ్ ఛాంపియన్‌షిప్‌లో అజిత్ కుమార్ బృందం మూడో స్థానంతో నిలిచి సత్తా చాటారు. ఈ విజయాన్ని తన టీమ్‌తో కలిసి అజిత్ సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పోడియం సందడి చేశారు. కాగా.. ఇటీవలే దుబాయ్- 24 హెచ్ రేసులో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ చివరిసారిగా విదాముయార్చిలో కనిపించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం అజిత్ మరో యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Victory in style! 🏆🔥 Team @Akracingoffl shines at the 12H Mugello, Italy, celebrating a fantastic podium finish! 🏁
Kudos to @fabian_fdx89, @mathdetry, and @BasKoetenRacing for their stellar performance on the track! 🚀🏎️#AKR #AjithKumar | #AjithKumarRacing #24HSeries… pic.twitter.com/1ug9mohbTr— Suresh Chandra (@SureshChandraa) March 23, 2025