మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
Published Wed, Dec 7 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్‌లో శ్రీసూర్య నృత్య నికేతన్ నిర్వహాకురాలు కె.మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులను బుధవారం ప్రదానం చేశారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్టు వండర్ బుక్ ఆఫ్ రికార్డు(లండన్) ప్రతినిధి అలమండ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మహాలక్ష్మి తన విద్యార్థుతో దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి కాకినాడ ఖ్యాతిని ఖండాంతర వ్యాప్తి చేస్తోందన్నారు. ఈమె ప్రతిభకు ఫలితంగానే ప్రతిష్టాత్మౖమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు దక్కిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి పోటీలు సభికులను అలరించాయి. పెద్ద ఎత్తున కళాకారులు హాజరయ్యారు.
Advertisement