of
-
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
రూట్స్ అఫ్ లైఫ్ ఫోటో గ్యాలరీ
-
మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్లో శ్రీసూర్య నృత్య నికేతన్ నిర్వహాకురాలు కె.మహాలక్ష్మికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులను బుధవారం ప్రదానం చేశారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్టు వండర్ బుక్ ఆఫ్ రికార్డు(లండన్) ప్రతినిధి అలమండ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మహాలక్ష్మి తన విద్యార్థుతో దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి కాకినాడ ఖ్యాతిని ఖండాంతర వ్యాప్తి చేస్తోందన్నారు. ఈమె ప్రతిభకు ఫలితంగానే ప్రతిష్టాత్మౖమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు దక్కిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఈమె నృత్య రంగానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి పోటీలు సభికులను అలరించాయి. పెద్ద ఎత్తున కళాకారులు హాజరయ్యారు. -
డీర్ పార్కుకు 42 ఏళ్లు
పాల్వంచ రూరల్: కిన్నెరసాని ప్రాజెక్టు వద్దనుఏర్పాటు చేసిన డీర్ పార్కుకు గురువారంతో 42 ఏళ్లు నిండాయి. సింగరేణి కాలరీస్ సంస్థ ఏర్పాటు చేసిన దీనిని 1974 సెప్టెంబర్ 29న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించి, పర్యాటకులకు అంకితం చేశారు. నాటి నుంచి 2000 సంవత్సరం వరకు ఈ డీర్ పార్కును సింగరేణి నిర్వహించింది. 2000లో దీనిని వన్య మృగాల సంరక్షణ విభాగానికి సింగరేణి అధికారులు అప్పగించారు. 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కులో చుక్కల దుప్పులు (జింకలు) ఉన్నాయి. నాడు కేవలం 30 దుప్పులు మాత్రమే ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు 130కి చేరింది. వీటి సంరక్షణ కోసం వైల్డ్‌లైఫ్ శాఖ ఇనుప కంచె ఏర్పాటు చేసింది. వీటికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దాణాతోపాటు పౌష్టికాహారాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. డీర్ పార్కు సముదాయంలో వాచ్ టవర్, జింకలకు నీడ కోసం రెండు షెడ్లు నిర్మించారు. కిన్నెరసానికి వస్తున్న పర్యాటకులు ఇక్కడి డీర్ పార్కులోని చుక్కల దుప్పులను చూడకుండా వెళ్లరు. మనుషులు కనిపిస్తే దుప్పులు సహజంగానే దూరంగా పరుగెత్తుతాయి. ఇక్కడి దుప్పులు మాత్రం కంచె వద్దకు వచ్చి, పర్యాటకులు పెట్టే పండ్లను చక్కగా ఆరగిస్తాయి. వారిని అలరిస్తాయి. ------------------------------------------ ఏడాదికి రూ.ఐదు లక్షల వ్యయం ఎ.వెంకటేశ్వరరావు, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ ‘‘దుప్పుల సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ శాఖ అనేక చర్యలు చేపట్టింది. అరుదైన దుప్పులు ఈ జిల్లాలో మాత్రమే ఉన్నాయి. ఒక్కో దుప్పికి రోజుకు కేజీ చొప్పున పౌష్టికాహారం అందిస్తున్నాం. అన్ని జింకలకు కలిపి ఏడాదికి ఐదులక్షల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. పర్యాటకాభివృద్ధిలో భాగంగా డీర్ పార్కును మరింత సుందరంగా, కనువిందుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’. -
డ్రైవర్‌కు బదులు క్లీనర్..
అతివేగంతో వాహనం నడిపిన క్లీనర్ మతిస్థిమితం లేని వ్యక్తి మృతి మరో లారీ దగ్ధం తప్పిన పెను ప్రమాదం పెనుబల్లి: డ్రైవర్‌కు బదులుగా క్లీనర్ ట్యాంకర్ వాహనం అతివేగంగా నడపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్థరాత్రి పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వైజాగ్ నుంచి పెట్రోల్, డీజిల్‌తో కూడిన ట్యాంకర్ వాహనం నిజామాబాద్ వెళుతూ మార్గమధ్యలో పెను ప్రమాదానికి కారణమైంది. ట్యాంకర్ డ్రైవర్ వంగా హరిచందర్రావు నిద్రపోతుండగా క్లీనర్ బత్తిని కృష్ణ వాహనాన్ని నడపడం ప్రారంభించాడు. మండల పరిధిలోని టేకులపల్లి రిత్విక్ పవర్‌ప్లాంట్ నుంచి మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి మృతి చెందిన కంగారులో ట్యాంకర్‌ను ఎవరికి దొరకకుండా ఉండేందుకు క్లీనర్ మరింత వేగం పెంచాడు. కొద్ది దూరం వెళ్లేలోపలే రాజస్థాన్ హోటల్ సమీపంలో ఎదురుగా రేకుల లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. అయితే ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్ పది మీటర్లలోపే ఉంది. ఒక వేళ మంటలు ట్యాంకర్‌కు ఎగబాకితే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ మడతా రమేష్, ఎస్సై గజ్జల నరేష్, కల్లూరు ఎస్సై బి. పవన్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఖమ్మం-సత్తుపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ వర్దపోగు గోవిందరావు లారీ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో పోలీసులు రక్షించి పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహాన్ని పెనుబల్లి మార్చురీకి తరలించారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ క్లీనర్ బత్తిని కృష్ణ, డ్రైవర్ వంగా హరిచందర్రావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గజ్జల నరేష్ తెలిపారు. శనివారం ఉదయం రోడ్డుపై ఉన్న లారీ, ట్యాంకర్లను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు. ఫొటో నెంబర్-24ఎస్పిఎల్86: -
406.5 అడుగులకు కిన్నెరసాని నీటిమట్టం
పాల్వంచ రూరల్: ఎగువ నుంచి వస్తున్న వరదతో కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో సోమవారం నాటికి 406.5 అడుగులకు నీటిమట్టం చేరినట్లు కేటీపీఎస్ 5, 6 దశల సీఈ రత్నాకర్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో రెండు గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి 10 గంటలకు ఎత్తిన ఈ గేట్లను మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు దించుతామన్నారు. వరద ఉధృతిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. -
కొత్త కార్యాలయాలపై సమీక్ష
ఆఫీసు భవనాల ఎంపిక తేదీలు, ఫొటోలు వెబ్సైట్లో పొందుపర్చాలి కలెక్టర్ లోకేషకుమార్ ఆదేశం ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్తగా ఆవిర్భవిస్తున్న కొత్తగూడెం జిల్లాలో నూతనంగా వివిధ శాఖలకు అవసరమైన కార్యాలయాలను ఏ తేదీలోగా ఏర్పాటు చేసుకుంటారో తెలియజేయాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఙా సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశంలో మాట్లాడారు. సంబందిత శాఖ వెబ్సైట్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి శాఖల వారు ఎంపిక చేసిన కార్యాలయ భవనాలు, ఎప్పటికి అందుబాటులోకి తెచ్చుకుంటారనే వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది వివరాలు, క్యాడర్ నమోదు కాని పక్షంలో ఫైళ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లతో పునర్విభజనపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ స్థాయిలో శాఖలు, కావాల్సిన సిబ్బంది, అధికారుల ఏర్పాటుపై సమీక్షించారు. రెవెన్యూ, మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య, ఓఎస్డీ భాస్కరన్, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, బీసీ వేల్ఫేర్ అధికారి ఆంజనేయశర్మ, డీఈఓ రాజేష్, మెప్మా పీడీ వేణుమనోహర్, ఇండస్ట్రీ జీఎం శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్వంచ: జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే జిల్లాల పేర్లను కూడా ప్రకటించారని, సరైన నైసర్గిక స్వరూపాలు లేకుండానే విభజించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను ప్రకటిత మహబూబాబాద్ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కొన్ని నియోజకవర్గాలను మూడు ముక్కలు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని నినదిస్తూనే, మరోవైపు రక్షణ, రైల్వే, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రొత్సíß స్తోందని.. మున్ముందు వీటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రూ.10లక్షల కోట్లు రాయితీగా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు.. గద్దెనెక్కాక అదే కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షాలను జైళ్లల్లో పెడతామని కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. డబ్బు దండుకునేందుకే దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,500 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, బరిగెల సాయిలు, మండే వీరహన్మంతరావు, పూర్ణచందర్రావు, ఆదాం, దుర్గాఅశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలభివృద్ధికి కృషి
చిలుకూరు: గ్రామాలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి అన్నారు. బుధవారం చిలుకూరులో తన నిధులు నుంచి రూ. 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రాధాన్యత ప్రకారం పనులు చేస్తామన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు స్వామి ఇంట్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, మాజీ ఎంపీపీలు దొడ్డా నారాయణరావు, కొండా అన్నపూర్ణ, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచిందని స్థానిక ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పిలిచి తాను రాకముందుకే శంకుస్థాపన చేశారన్నారు. తాను బీసీ ఎంపీపీననే ఉద్దేశంతో కావలని అవమానపరిచిందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.