కిన్నెరసాని రిజర్వాయర్
406.5 అడుగులకు కిన్నెరసాని నీటిమట్టం
Published Mon, Sep 12 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
పాల్వంచ రూరల్: ఎగువ నుంచి వస్తున్న వరదతో కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో సోమవారం నాటికి 406.5 అడుగులకు నీటిమట్టం చేరినట్లు కేటీపీఎస్ 5, 6 దశల సీఈ రత్నాకర్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో రెండు గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి 10 గంటలకు ఎత్తిన ఈ గేట్లను మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు దించుతామన్నారు. వరద ఉధృతిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.
Advertisement
Advertisement