మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
-
ఆఫీసు భవనాల ఎంపిక తేదీలు,
-
ఫొటోలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి
-
కలెక్టర్ లోకేషకుమార్ ఆదేశం
ఖమ్మం జెడ్పీసెంటర్:
కొత్తగా ఆవిర్భవిస్తున్న కొత్తగూడెం జిల్లాలో నూతనంగా వివిధ శాఖలకు అవసరమైన కార్యాలయాలను ఏ తేదీలోగా ఏర్పాటు చేసుకుంటారో తెలియజేయాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఙా సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశంలో మాట్లాడారు. సంబందిత శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి శాఖల వారు ఎంపిక చేసిన కార్యాలయ భవనాలు, ఎప్పటికి అందుబాటులోకి తెచ్చుకుంటారనే వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది వివరాలు, క్యాడర్ నమోదు కాని పక్షంలో ఫైళ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లతో పునర్విభజనపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ స్థాయిలో శాఖలు, కావాల్సిన సిబ్బంది, అధికారుల ఏర్పాటుపై సమీక్షించారు. రెవెన్యూ, మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య, ఓఎస్‌డీ భాస్కరన్, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు, బీసీ వేల్ఫేర్ అధికారి ఆంజనేయశర్మ, డీఈఓ రాజేష్, మెప్మా పీడీ వేణుమనోహర్, ఇండస్ట్రీ జీఎం శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.