రఘునాథపాలెం : మండలంలోని వీవీ.పాలెంలో టి.దానయ్య అనే వ్యక్తి ఇంటి పెరడులోని వేపచెట్టుకు కల్లు పారుతోంది. సహజంగా తాటి, ఈత చెట్లకు కల్లును గీత కార్మికులు గీస్తారు. అయితే..ఇక్కడ వేపచెట్టు కాండం నుంచి కొన్ని రోజులుగా ద్రవం కారుతుండడంతో..ఇది కల్లు అని గుర్తించి ఇంటి యజమాని లొట్టిలోకి ఆ కల్లు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఇది తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి వెళుతున్నారని దానయ్య తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment