Kallu
-
కాటేసిన కల్తీ కల్లు
అనంతగిరి: కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 29 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలివి. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలోని ఒక దుకాణంలో 19వ తేదీ సోమవారం సాయంత్రం కల్లు తాగిన వారిలో.. ఎనిమిది మంది మంగళవారం వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధి తులను వారి కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించగా అర్ధరాత్రి తర్వాత దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయాన్నే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరానికి వచ్చిన మరో 22 మంది పరిస్థితి బాగా లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ప్రస్తుతం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారు డిశ్చార్జి అయ్యారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి, పీహెచ్సీ వైద్యుడు సుధాకర్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు. బాధితుల ఇళ్లు, నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ లక్షణాల్లేవని ఆ శాఖ సీఐ రాగవీణ స్పష్టం చేశారు. -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్‌ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
తాటికల్లు మస్తుగుంది..!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం జనగామ జిల్లా కొడకండ్లలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా గీత కార్మికుల కోరిక మేరకు తాటికల్లు టేస్ట్ చూసి చాలా బాగుందని అభినందించారు. కల్లుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నందున నీరా కేఫ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. -
తెలంగాణాలో.. కల్లు రాజకీయం
-
వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం!
దేవునికి సమర్పించేది నైవేద్యం, కాని దాన్ని తినేది మాత్రం మనిషే. మనుషుల ఆహార అలవాట్లే దేవునికి ఆపాదించబడ్డాయన్నది వాస్తవం. ఆచారాల్లో నిమగ్నం చేయడం వల్ల మనుషులను మంచి కర్మల వైపు మల్లించవచ్చునన్న భావనతో వేదకాలంలో వచ్చిన యజ్ఞయాగాదులు,పశుబలి,సూరాపానం పూర్వ మీమాంస ( prior study ) పద్దతి. దీని కర్త వేద వ్యాసుని శిష్యుడైన జైమిని అంటారు. ఆనాటి సమాజంపైనున్నబౌద్ధమత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వ మీమాంస కూడదని హైందవ పూజా విధానాన్ని 'ఉత్తరమీమాంస' ( posterior study) వైపు అనగా శాఖాహర క్రతువు వైపు, గోవధ నుండి గోసంరక్షణ వైపు మల్లించినవాడు శంకరాచార్యుడు. ఈ దెబ్బతో దైవపూజ యజ్ఞయాగాల్లో జరిగే పశుబలితో పాటు సూరాపానం /కల్లు వంటి మద్యపానాలను కూడా పక్కకు పెట్టినట్లయింది.అయితే గ్రామ దేవతల ఆరాధనలో కల్లు వినియోగం 'కల్లుసాక'గా ఇప్పటికీ విరివిగా జరుగుతున్నదే. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత చెట్ల నుండి తీయబడుతున్న ప్రకృతి సహజమైన పానీయం 'నీరా' వాడకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ప్రారంభించిన ఔట్లెట్లో దాని పేరు 'వేదామృతం 'గా పెట్టడం వివాదాస్పదం అయింది. ► నీర ఎంత మధురమైనదైనా అది మద్య సంబంధమైందే, దానికి 'వేద' పదాన్ని జోడించడం అపచారం అంటూ వాదిస్తున్నారు కొన్ని బ్రాహ్మణ సంఘాలవారు. ► అమృతం రుచి ఎలా ఉంటుందో దేవతలకే తెలుసు, మనుషులకు తెలిసింది మహా రుచికరమైంది, పైగా బోలెడన్ని ఔషద గుణాలున్నది నీరా కావాలంటే కాస్త తాగి చూడండి అంటున్నారు గౌడ సంఘాలవారు. ఈ గొడవలన్నీ దేనికి నీరా చెట్లు గీయడం ద్వారానే కదా లభిస్తున్నది దానికి 'గీతామృతం 'అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా!అని నాబోటి వారు సలహా ఇస్తే అందులో కూడా మతాన్ని చూసే మహానుభావులున్నారు అంటూ వారు 'వేద' వాక్కునే వల్లిస్తున్నారు. అయ్యా! ఏ పెరైనా పెట్టుకొండి మాకు కావాల్సింది నీరా,మీరు స్వచ్ఛమైన నీరా అందిస్తే అదే మహాభాగ్యం!అంటున్నారు భాగ్యనగరవాసులు. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి -
కర్ణాటకలో గీత వృత్తిని పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గౌడ, ఈడిగ సామాజిక వర్గాల అభివృద్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కల్లు, గీత వృత్తిని పునరుద్ధరించాలని మంగళూరు నుంచి బెంగళూరు వరకు జేడీఎస్ పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. గురువారం ఆయన కర్ణాటకలోని గుల్బర్గాలో పాదయాత్ర వాల్ పోస్టర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేశామని, గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. దేశంలో లేక్కడా లేని విధంగా తెలంగాణలో నీరా విధానాన్ని ప్రవేశపెట్టి, నీరాను ఒక్క గౌడ కులస్తులు మాత్రమే ఉత్పత్తి చేసేలా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈడిగ, గౌడ సామాజిక వర్గాల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదిగేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని వైన్ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగాని బాలరాజుగౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!
సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్‌ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ? -
వేములపల్లిలో వింత కల్లు..
-
బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు..
రఘునాథపల్లి: కల్లులో 15 రోగాలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు బెంజి కార్లలో తిరిగే వారు కూడా వచ్చి కల్లు తాగుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లులో కేన్సర్‌ను నాశనం చేసే గుణం ఉంటుందని, ఇటీవల ఈ అంశంపై ఓ పత్రికలో పరిశోధన వ్యాసం వచ్చిందని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 400 ఏళ్ల క్రితమే సామాజిక న్యాయం కోసం పోరాడిన పాపన్న, శివాజీకి సమకాలికుడని చెప్పారు. పాపన్న కోటలను పర్యాటక కేంద్రాలుగా మార్చి, చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. అనంతరం మంత్రి నర్మెట మండలంలోని బొమ్మకూర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్ నిఖిలతో కలసి చేపపిల్లలను వదిలారు. తర్వాత లింగాలఘణపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ కట్ట వద్ద ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో బీసీ సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేశ్‌రాథోడ్, ఈఎస్ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేఖ పట్టు.. కరోనాను తరిమికొట్టు!
యాదాద్రి భువనగిరి, నిడమనూరు (నాగార్జున సాగర్) : ప్రజలు కరోనా వైరస్ బారినపడకుండా ఉండడానికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అందరూ ఇళ్లకు పరిమితం కావాలని, బయట తిరగవద్దని సూచించింది. దీంతో నిత్యవసర వస్తువుల దు కాణాలు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు మిన హా అన్నీ బంద్ అయ్యాయి. మద్యం దుకాణా లు సైతం మూతపడ్డాయి. నిడమనూరు మండలంలోని శాఖాపురం, రాజన్నగూడెం, నిడమనూరు, వేంపాడు, గుంటిపల్లి, ఊట్కూర్, మారుపాక, వెంకటాపురం గ్రామాల్లో తాటివనాలు ఉన్నాయి. కాగా శాఖాపురంలో దోసపాటి అంజయ్య గౌడ్ అనే వ్యక్తి కల్లు కరోనా రాకుండా చేస్తుంది.. అనే సందేశం వచ్చేలా ‘రేఖ పట్టు–కరోనా పనిపట్టు’ అని బోర్డు పెట్టి పలువురిని ఆకట్టుకుంటున్నాడు. మద్యం దొరకకపోవడం.. కరోనా వైరస్ నివారణకు కల్లు అని ప్రచారం కావడంతో కల్లు తాగడానికి జనం పరుగులు తీస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికే కల్లు తాగుతున్నామంటూ వయోభేదం లేకుండా తాటి వనాల వైపు పరుగులు తీస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పలువురు తాటి వనాల్లో కన్పిస్తున్నారు. -
కల్లు చీప్ డ్రింక్ కాదు
హిమాయత్‌నగర్: కల్లు చీప్ డ్రింక్ కాదని, 25 జబ్బులను నయం చేయగలిగే శక్తి కల్లులో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్వరం తగ్గాలన్నా.. కిడ్నీలో రాళ్లు పోవలన్నా, బాలింత ఆరోగ్యంగా ఉండాలన్నా, అమ్మవారు సోకినా కల్లు ఔషధంగా ఉపయోగించేవారన్నారు. అలాంటి కల్లు వృత్తి చేస్తున్నామని చెప్పుకోవడంలో వృత్తిదారులు సిగ్గుపడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని గౌడ హాస్టల్ 67వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. వృత్తిదారులు చేసుకోవాల్సిన కల్లు వ్యాపారంలో ఇతరులు చొరబడటం వల్లే ఎక్సైజ్ అధికారు దాడులు చేయడం, కేసులు పెడుతున్నారని, ఈ కారణంగానే వృత్తి రోజు రోజుకూ నీరుగారిపోతోందన్నారు. ఈ వృత్తిని సంరక్షించుకొనేందుకు ఒక్కో విద్యార్థి పది నుంచి పదిహేను తాటి, ఈత చెట్లను గ్రామాల్లో నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు సుఖసంతోషాల కోసం ఇతర ప్రైవేటు రంగాలను కూడా ఎంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పోటీ పరీక్షలపై అధిక సమయం కేటాయించే కన్నా జీవితంలో త్వరగా స్థిరపడే మార్గాన్ని ఎంచుకోవలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ హాస్టల్స్‌ను విస్తరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఎ.సాయిబాబా గౌడ్, డాక్టర్ జి.జగదీష్‌గౌడ్, టి.రోహిణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్ప్రాజోలం దందా!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ దందా ఆగడం లేదు. రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ తయారీ ఆగిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ భావిస్తున్న తరుణంలో ఈ నిషేధిత డ్రగ్ పెద్ద ఎత్తున పట్టుబడడం ఆ శాఖను ఒకింత ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ (ఇండోర్), మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి రవాణా అవుతున్నట్లు తేలింది. కేం ద్ర రెవెన్యూ ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల బృందం ఇటీవల రూ. 2.40 కోట్లు విలువ చేసే 40 కిలోల ఆల్ప్రాజోలంను నాగ్‌పూర్ – హైదరాబాద్ రహదారిపై కామారెడ్డి వద్ద పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకుగుజరాత్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఈ నిషేధిత డ్రగ్ బయటపడింది. రూ. 2.40 కోట్లు విలువ చేసే డ్రగ్ అక్రమ రవాణా వెలుగుచూడడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. దీన్ని మెదక్ జిల్లాకు తరలించేందుకు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. ఒక్కో కిలో ఆల్ప్రాజోలం ప్రస్తుతం రూ. ఆరు లక్షల వరకు ఉంటుంది. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలోనూ మూడు ఆల్ప్రాజోలం కేసులు నమోదయ్యాయి. సుమారు ఐదు కిలోల ఈ నిషేధిత డ్రగ్‌ను ఎక్సైజ్‌శాఖ స్వాధీనం చేసుకుంది. -
ముప్పై ఏళ్ల వెలుగు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు. ఒక కన్ను ఎస్.డి. బర్మన్ ‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్‌గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది. ఇంకో కన్ను సీతారామశాస్త్రి ‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట. కళ్ల నిండా జ్ఞాపకాల తడి ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు. కంటికి కనిపించిన పాట అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్‌గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది. కంటిని నడిపించిన పాట మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు. ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్‌లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు. (‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘కళ్లు’
గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్లు నాటకం ఆధారంగా ఎం.వి.రఘు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కళ్లు’. 1988లో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించగా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాలోని రంగుడు పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గాత్రదానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ ఈ సినిమాలో ‘తెల్లరిందే’ పాట కోసం గాయకుడిగా మారారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న కళ్లు సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘కళ్లు’ సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు కొంత మందికి అవార్డ్ లని ఇస్తాయి, కొంత మందికి గుర్తింపు ని ఇస్తాయి, మరికొంత మందికి పేరును తీసుకొస్తాయి కొన్ని చిత్రాలు మాత్రమే గుర్తిండి పోతాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అయినా చాలా అద్భుతంగా తీశారు ఎం.వి.రఘు గారు. భిక్షు గారు ద్వారా ఈ సినిమా కి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ కావాలంటే నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అలా నేను కళ్లు సినిమా ద్వారా ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూశాను. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే, కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను నటించిన ‘కళ్లు’ సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వంశీ దర్శకత్వంలో కనకమహాలక్ష్మీ రికార్డింగ్ ట్రూప్ సినిమా అవకాశం చేజారిన బాధలో ఉన్న నాకు కళ్లు అవకాశం వరంలా దక్కింది. రఘు గారు ఈ సినిమాను చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను’అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఏడిద శ్రీరామ్, అనితా చౌదరి, బెనర్జీ, భిక్షపతి, కళ్లు కిష్టారావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు. -
వేపచెట్టుకు కల్లు..!
రఘునాథపాలెం : మండలంలోని వీవీ.పాలెంలో టి.దానయ్య అనే వ్యక్తి ఇంటి పెరడులోని వేపచెట్టుకు కల్లు పారుతోంది. సహజంగా తాటి, ఈత చెట్లకు కల్లును గీత కార్మికులు గీస్తారు. అయితే..ఇక్కడ వేపచెట్టు కాండం నుంచి కొన్ని రోజులుగా ద్రవం కారుతుండడంతో..ఇది కల్లు అని గుర్తించి ఇంటి యజమాని లొట్టిలోకి ఆ కల్లు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఇది తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి వెళుతున్నారని దానయ్య తెలిపాడు. -
యాదాద్రి జిల్లాలో విషాదం
- పురుగుల మందు కలిసిన కల్లు తాగి ఒకరి మృతి - మరొకరి పరిస్థితి విషమం ఆత్మకూరు(యం): యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్లు కుండలపై ఈగలు వాలకుండా చల్లిన పురుగుల మందు కల్లులో కలిసిపోవడంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అందులో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని ఆత్మకూరు(యం) మండలంలోని తుక్కాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దెయ్యాల పాండు(28), దెయ్యాల నగేశ్ ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ తాటిచెట్టు గీస్తున్న వ్యక్తి కల్లులో తేనటీగలు పడుతున్నాయని చెప్పడంతో వీరిద్దరు పురుగుల మందు తెచ్చిన కల్లు కుండలపై పోశారు. ప్రమాదవశాత్తు ఆ మందు కుండలోపల పడటంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం పాండు మృతిచెందగా, నగేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కల్లు తాగిన పాము
బెల్లంపల్లి: దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్‌కోబ్రా పాముకు నీళ్లు తాగించడం చూశాం.. అది మరవకముందే మరో అరుదైన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మండుతున్న ఎండలకు బేజారైందో.. కల్లు రుచి చూద్దామనుకుందో గానీ ఓ పాము ఈత కల్లు తాగింది. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పాము ఈత చెట్టుపై ఉన్న లొట్టి(కుండ)లోకి దూరి కల్లు తాగింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. -
వ్యక్తి దారుణ హత్య
కర్నూలు: కర్నూలు శివారులోని వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసముంటున్న మారుతీ ఆచారి (31) దారుణహత్యకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన ఈయన ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం కర్నూలుకు వలస వచ్చాడు. ఉంగరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి వ్యాపారం ముగించుకొని కల్లుతాగి ఇంటికి వెళ్తూ కాలనీలోని టీ బంకు దగ్గర ముళ్ల పొదల్లో మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే కాలనీకి చెందిన మద్దిలేటి అలియాస్ మధు, ఉమర్‌బాషా తదితరులు మూత్ర విసర్జన ఎక్కడ చేస్తున్నావంటూ ఆచారిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు అదే కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడు వీరేష్‌ను తీసుకొచ్చి వారిపై గొడవకు దిగడంతో మళ్లీ కాలుతో కొట్టి కిందపడవేసి గాయపరిచారు. కొద్దిసేపటికే మారుతీ ఆచారి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని గొడవకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కల్లు మత్తులో బోర్ల పడటంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు మద్దిలేటి, ఉమర్‌బాషలను ఉల్చాల జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. మంగళవారం నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరుచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నాల్గవ పట్టణ సీఐ నాగరాజు రావు, ఎస్ఐలు జీవన్, నాగలక్ష్మయ్య, శ్రీనివాసనాయక్, కిరణ్‌బాబు తదితరులను డీఎస్పీ అభినందించారు. -
కల్లు తాగిన ఈత చెట్టు
చేతనబడి చెట్టు కల్లు తాగడమేంటి వింతగా మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం వాలిపోయి రాత్రి పూట నిలబడుతుందంటే... తాగినట్టే కదా? ఈత కల్లు తాగితే మనుషులు వాలతారు కానీ చెట్టు వాలడమేంటి? అయితే ఏదో పూనే ఉంటుందిలే! గత ఏడాది వెంకమ్మ నిప్పార్పుకోవడానికి బావిలో దూకి చచ్చిపోయింది. ఆమే పూనిందంటావా? అయితే ఏం చేయాలి? శాంతి చేయాలి... కొద్దిగా ఖర్చవుద్ది. ఇదండీ వరస... మూఢనమ్మకాలతో మనుషులు కూడా కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుకుంటున్నారు. ‘ఎవరమ్మా నువ్వు?’ జుట్టు విరబోసుకుని తలను, కళ్లను వలయాకారంగా తిప్పుతూ ఊగిపోతున్న వెంకమ్మను అడిగింది సుశీలమ్మ. ‘ఎవరని అడగొద్దు... చెప్పేది వినండి’ ఊగిపోతూనే బదులిస్తోంది వెంకమ్మ. బదులివ్వడం అనేకంటే ఆదేశిస్తోందనడమే కరెక్ట్. ‘అలాగే వింటాం’ అంటూ చుట్టూ ఉన్న వాళ్లంతా తలలూపి వెంకమ్మ ఏం చెప్తుందోనని ఆసక్తిగా చెవులు రిక్కించారు. ‘పోలేరమ్మ చీర కాలింది, అమ్మ ఒంటికి సెగ తగిలింది. ఒళ్లు మంటలు తగ్గడానికి బావిలో దిగింది పోలేరమ్మ. బావిలో నుంచి వచ్చి సేద దీరడానికి ఈ చెట్టు మీద వాలింది. ఊరిని సల్లంగ సూడమని బ్రహ్మంగారిని మొక్కుతోంది. అదుగో చెట్టు తల అటుగా వాలింది. ఆ ఎదురుగా అత్తిచెట్టు తొర్రలో బ్రహ్మంగారి పావుకోళ్లున్నాయి’ అంటూ మాట పూర్తయేలోపు కూలబడి స్పృహ తప్పి పోయింది వెంకమ్మ. ఆమె మీద నీళ్లు చల్లి సాంత్వన చేకూర్చడానికి ముందుకొచ్చారు ఇద్దరు మహిళలు. ‘నిజమే పోయిన్నెలలో గుళ్లో వెలుగుతున్న దీపానికి అమ్మవారి చీర కొంగు తగిలి నిప్పంటుకుంది. అప్పుడే అనుకున్నాం ఏదో అనర్ధానికేనని’ సుబ్బమ్మ చెవిలో గుసగుసలాడుతోంది కనకమ్మ. ‘చెట్టు వంగుతోందని ముందు ఎవరు చూశారో’ సందేహాన్ని ఆశ్చర్యంతో మేళవించింది సుబ్బమ్మ. ‘ఇది సుబ్బారావు పొలం కదా, రోజూ మోటార్‌సైకిల్ ఈ చెట్టు కిందనే ఆపుతాడు. నెలా పదిహేను రోజుల వెనక ఓ రోజు బండి తీయబోయే సరికి సీటు మీద ఈతమట్టలు వాలి ఉన్నాయిట’. కొండ ముంజులూరు గ్రామం మీదుగా ఓ ట్రాక్టర్ వెళ్తోంది. దాని నిండుగా మహిళలున్నారు. కూలి పనులకు పొరుగూరికి వెళ్తున్నారంతా. ఊరి బయటి ఈత చెట్టు మీదుగా వెళుతుండగా హఠాత్తుగా నదియా బేగం లేచి ఊగిపోసాగింది. అందరిలో ఒకటే ఆందోళన. అంత ఆందోళనలోనూ అంతకు మించిన ఆసక్తి. ‘అమ్మోరు పూనింది. ఏం చెబుతుందో’ అని ఆత్రంగా చూస్తున్నారు. అరకిలోమీటరు వెళ్లగానే మనసు మార్చుకున్నారంతా. ట్రాక్టర్ వెనక్కు తిరిగి బొప్పూడి దారి పట్టింది. ముంజులూరు దాటుతుండగా మరొక మహిళకు పూనకం వచ్చింది. ‘‘అమ్మాయికి పూనకం వస్తే పోలేరమ్మకు పొంగలి పెట్టించకుండా తీసుకెళ్తారా’’ అంటూ రంకెలు వేసింది. అంతే... ట్రాక్టర్ ఈత చెట్టు ముందు ఆగింది. నిమిషాల్లో పొంగలి దినుసులు సమకూరాయి. నదియా ఈతచెట్టుకు దగ్గరలోనే ఉన్న పోలేరమ్మకు, ఈతచెట్టుకు పొంగలి పెట్టింది. అంతా భక్తిగా పోలేరమ్మను తలుచుకుంటూ చెట్టుకు మొక్కారు. ఊరిని చల్లంగా చూడమని వేడుకున్నారు. నెలరోజులు గడిచాయి. వంగుతున్న ఈతచెట్టుకు భక్తుల రద్దీ ఎక్కువైంది. వందల వాహనాలు బారులు దీరుతున్నాయి. కొబ్బరిచిప్పల రాసి పెరిగింది. మొక్కుల సందడి పెరిగింది. హుండీలో డబ్బులు గలగలమంటున్నాయి. ఈ ప్రదేశం మహిమాన్వితం అవబోతోందని ఇప్పటికే విశ్వాసం మొదలైంది. ఎండాకాలం కావడంతో భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ స్వచ్ఛందంగా జరుగుతోంది. చిట్కా వైద్యాలతో కాలం గడిపే మాయలోళ్లు జరిగేదంతా చూస్తున్నారు. ‘శాంతి చేయించుకుంటే మంచిది’ అనే సర్వసాధారణ ప్రచారమూ మొదలైంది. శాంతి ఎవరు చేయించాలి - శాంతి చేయించకపోతే అశాంతి ఎవరికి, ఏ పూజ చేస్తే అమ్మవారు శాంతిస్తుంది- ఆ పూజ ఎలా చేయించాలి... వంటి సందేహాలకు ఆస్కారం కలిగించేశారు లౌక్యంగా. వాటికి సమాధానం రూపంలో ఒక వ్యవస్థీకృతమైన చట్రం తయారవసాగింది. కానీ ‘చెట్టు వంగడం కంటే దృష్టాంతం మరింకేం కావాలి’ అని భక్తిగా మొక్కేవారికి కొదవలేదు. విశ్వాసం ముసుగులో మోసాలకు బీజం వేయడానికి మొలక కట్టడం షురూ అయినట్లే ఉంది. మోసాల వలలో పడొద్దని చెవినిల్లు కట్టుకుని పోరే వాళ్ల మాట పెడచెవిన పెట్టడమే జరిగిందిప్పటి వరకు. మన పూర్వికులు ‘చెట్టు కొట్టి గోడ కట్టరాదు’ అంటూ చెట్టును రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పారు. గుడికంటే ముందు ఆ చెట్టును రక్షించుకోవాలి. చెట్టును బతికించుకోవడానికి కొబ్బరి నీళ్లు కాదు, బావి నీళ్లు పోయాలి. అదంతా రేగడి మట్టి వల్లనే... ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్. సాధారణంగా ఏ చెట్టుకైనా ముఖ్యంగా ఎండాకాలంలో పగలు ఆకులు వాలిపోతాయి, రాత్రికి పుంజుకుంటాయి. భూగర్భంలో నీటి నిల్వలు, వాతావరణంలో తేమ వంటి అంశాలన్నీ ఇందులో ముడివడి ఉంటాయి. నేల విషయంలో... ఇసుక నేల అయితే తేమను త్వరగా విడుదల చేస్తుంది. రేగడి మట్టి తేమను నెమ్మదిగా, కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంది. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఆ పైన, రాత్రి ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు ఉంటోంది. దాదాపు పదిహేను డిగ్రీల తేడా ఉంటోంది. అంత వేడి కారణంగా పగలు మట్టి పొడిబారి వదులు కావడంతో వేళ్ల మీద ఒత్తిడి పెరిగి చెట్టు ఒరిగిపోతోంది. రాత్రికి తేమను పీల్చుకుంటూ తిరిగి యథాస్థితికి చేరుతోంది. నీళ్లు పోస్తే నిలబడుతుంది! ప్రకాశం జిల్లా, జె.పంగులూరు మండలం, కొండ ముంజులూరులో పగలు వంగుతున్న ఈతచెట్టును చూశాను. అది బావి ఒడ్డున మొలిచింది. నిటారుగా 90 డిగ్రీల కోణంలో పైకి పెరగలేదు. ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో పెరిగింది. పగలు 18 డిగ్రీల కోణంలో వంగుతోంది. అలా వంగినప్పుడు మట్టలు నేలను తాకుతున్నాయి. అయితే ఇలా చెట్టు వంగడం కొత్తేమీ కాదు. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం, గుంపెన గ్రామంలో 2002లో ఇలాగే జరిగింది. అక్కడ వేపచెట్టు పగలు నేలకు వంగుతూ రాత్రికి లేచి నిలబడేది. ఈతచెట్టుకి చేస్తున్నట్లు... అక్కడా వేపచెట్టుకు పూజలు చేశారు. గుడి కట్టాలని మూడు లక్షల డబ్బు కూడా జమచేశారు. నిజానికి చెట్టు అలా వంగడానికి ఎండలు, నీటి కొరతే కారణం. అలాగే కొనసాగితే ఆరు నెలల్లో చెట్టు చనిపోతుందని అప్పుడు ఖమ్మంలో చెప్పాం. అన్నట్లే జరిగింది కూడా. గడచిన రెండేళ్లుగా ప్రకాశం జిల్లాలో సరైన వర్షాల్లేవు. బోర్లు కూడా ఎండిపోయాయి. ఈ ఏడాది కూడా వర్షాలు పడకపోతే ఈ ఈత చెట్టు మనుగడ కష్టమే. అయితే ఈ లోపు పాదు చేసి నీరు పోస్తుంటే చెట్టు వంగదు. నిటారుగా నిలబడి, బతుకుతుంది. - డాక్టర్ కె. రఘుచంద్,జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పూనకమూ రోగమే! పూనకాలు ‘కల్చర్ బార్న్ సిండ్రోమ్స్’ అనే మానసిక రుగ్మతలలో ఒక రకం. పూనకం వచ్చిన వారిని దేవతగా ప్రత్యేక సపర్యలు, గౌరవాలు అందుతుండడంతో సబ్కాన్షియస్గానే పూనకాన్ని నేర్చుకుంటారు. సాధారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుంటుంది. మన దేశంలోనే కాదు... చాలా దేశాలలో అక్కడి సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి ఈ కల్చర్ బార్న్ సిండ్రోమ్ చాలా రకాలుగా వ్యక్తమవుతుంటుంది. దీనివల్ల లబ్ధి చేకూరనప్పుడు పూనకాలు వాటంతవే తగ్గుతాయి. అవిద్య, పేదరికం, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న సమూహాలలో పూనకాలు వస్తుంటాయి. తమ ప్రయోజనాలను సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే పూనకాలు తగ్గిపోతాయి. - డాక్టర్ ఎస్‌ఆర్‌ఆర్‌వై శ్రీనివాస్,సైకియాట్రిస్ట్ -
కల్లు అనుకుని ఫినాయిల్ తాగేశాడు..
నల్లకుంట: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కల్లు అనుకుని ఫినాయిల్ తాగి చనిపోయాడు. నల్లకుంట ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలివీ.. నల్లకుంట బాయమ్మలేన్లో శ్రీనివాస్(40) తన సోదరి నాగమణితో కలసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శ్రీనివాస్ వికలాంగుడు కాగా, నాగమణి కుషాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటుంది. ఏ పనీ చేయలేని శ్రీనివాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతడు శుక్రవారం సాయంత్రం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ బాటిల్ చూసి కల్లు అనుకుని తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ శనివారం చనిపోయాడు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
హుజూరాబాద్: గీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రావుల కొమరయ్య(55) కల్లు గీయడం కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పేద కుటుంబాల్లో ‘కల్లో’లం!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని గౌరిశంకర్ కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. ప్రతిరోజు సేవించే కల్లు లభించకపోయేసరికి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి మత్తెక్కించే కల్లు తాగే అలవాటుంది. అధికారుల దాడులతో ఆ మందు లభించకపోయేసరికి వింతగా ప్రవర్తిస్తూ ఇల్లాలిపైనే హత్యాయత్నం చేశాడు. అతడు జైలు పాలు కావడంతో కుటుంబం వీథినపడింది. సాక్షి నెట్వర్క్: తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు చాలదన్నట్లుగా.. ఇప్పుడు కల్లు బాధితుల బలవన్మరణాలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అనేక కుటుం బాలు వీధిన పడుతున్నాయి. వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఆ కుటుంబాల పోషణ భారమవుతోంది. ఈ మత్తు కల్లు కారణంగా తెలంగాణలో దాదాపు వంద మందికిపైగా మరణించారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో 80 మందికిపైగా మరణిస్తే.. ఎక్సైజ్, పోలీసుల లెక్కలు మాత్రం 42 మంది చనిపోయినట్లు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 11 మంది, ఆదిలాబాద్‌లో దాదాపు 15 మంది మరణించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఈ స్థాయి మరణాలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 7,574 దుకాణాలు రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొత్తం 7,574 కల్లు దుకాణాలు అధికారికంగా నడుస్తున్నాయి. మరో రెండు వేల వరకు అనధికారికంగా విక్రయాలు సాగుతున్నాయి. నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మినహా తాటి, ఈత చెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ మత్తు కలిపి అమ్మే కల్లు విక్రయాలు తక్కువే. మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్‌లకు సంబంధించి కల్లు వినియోగానికి అల్ఫాజోలమ్, చక్కెర, పిండి, డిటర్జంట్ పౌడర్ తదితర వాటిని కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్న ఘటనలు ఉన్నాయి. కౌన్సెలింగ్ ఏదీ?..: మత్తు కల్లుకు బానిసలైన వారు ఆ వ్యసనం నుంచి బయటపడలేక.. అది లేకుండా జీవించలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వం కల్లులో మత్తునిచ్చే డైజోఫామ్,అల్ఫాజోలమ్, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)తో పాటు ఇతర రసాయనాల వినియోగంపై పెద్దగా పట్టించుకోకుండా.. ఒక్కసారిగా దాడులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మత్తు అధికంగా ఉండే కల్లు తాగుతున్న వారికి.. ఆ మత్తు నుంచి బయటపడడానికి వీలుగా ఎక్కువ సంఖ్యలో కౌన్సెలింగ్ కేంద్రాలు, డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఏవీ చేపట్టలేదు. కల్లులో కలిపే మత్తు పదార్థాలు కాస్తా.. నాడి మండలంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మంచానికే పరిమితమయ్యా మూడు నెలల క్రితం కల్లులో మత్తు తగ్గడంతో నా ఆరోగ్యం మూడు నెలలుగా క్షీణించడంతో మంచానికే పరిమితమయ్యాను. గతంలో నా కుటుంబ పోషణ కోసం వడ్రంగి పనితో పాటు కమ్మరి పని చేసుకుంటూ పొట్టగడిపేవాడిని. ప్రస్తుతం కొడుకులు అన్నం పెడితే గానీ పూట గడవని పరిస్థితి ఉంది. - ఇనుగుర్తి నారాయణ, తిమ్మాపూర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా ఆగమైన కుటుంబం కల్లులో మత్తు తగ్గడం వల్ల వికృత చేష్టలతో భర్త నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయన జైలులో ఉన్నాడు. నేను నా ఇద్దరు పిల్లలతో బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కల్తీ కల్లుతో నా కుటుంబం ఆగమైంది. -బాస రాధ, తిమ్మాపూర్, జగిత్యాల పిల్లలను చదివించలేకపోతున్నాం.. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన బిట్ల అశోక్(35) సెప్టెంబర్ 25న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుం బం వీధిన పడింది. ప్రస్తుతం పిల్లలను చది వించలేక పోతున్నా. -బిట్ల సునీత, నిర్మల్ * కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన కోడూరి వైకుంఠం మృతితో ఆయన కుటుంబం అనాథగా మారింది. * జగిత్యాల డివిజన్లోని తిమ్మాపూర్‌లో 23, మోతెలో 18 మంది వికృత చేష్టలతో కుటుంబానికే దూరమయ్యారు. * తిమ్మాపూర్‌కు చెందిన ఇనుగుర్తి నారాయణ కల్తీ కల్లుతో అనారోగ్యం బారినపడి మంచానికే పరిమితయ్యాడు. * ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద కూలీలే. * బాసరలో ఆరుగురు, నిర్మల్‌లో ఏడుగురు బాధితులు మరణించారు. * మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లు లేని కారణంగా మరణించిన వారు 80 మంది దాకా ఉన్నారు. * రంగారెడ్డి జిల్లాలో తాండూరు, బషీరాబాద్ ప్రాంతాలకు చెందిన దాదాపు 11 మంది మరణించారు. * తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సుమారు 200మంది చికిత్స కోసం చేరారు. నాలుగు జిల్లాలోనే అధికం: అకున్ సబర్వాల్ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కల్లీకల్లు సమస్య ఎ క్కువగా ఉందని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు. ‘కల్లు సమస్య ఎక్కువగా ఉంది. మత్తు కోసం అల్పాజోలమ్ వినియోగిస్తున్నారు. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తోంది. ఈసారి కల్లు దుకాణాలపై దాడులు చేయడానికి ముందుగానే ఆసుపత్రులను సి ద్ధంచేస్తాం. గత సెప్టెంబర్‌లో దాడులతో ఒక్కసారిగా ఇబ్బందులు వచ్చాయి’ అన్నారు. -
రోజు రోజుకు పెరుగుతున్న కల్లు బాదితులు
-
కల్తీ కల్లుకు బానిసై బిడ్డను కూడా గుర్తుపట్టలేదు
-
కట్టేసి వైద్యం చేస్తున్నారు
కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్ అనే మందును వ్యాపారులు కలపటం మానేశారు. దీంతో డైజిపామ్ కల్లుకు అలవాటు పడిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సుమారు 56 మంది నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వీరిలో నిజామాబాద్ పట్టణం, నవీపేట, బోధన్, ఎడపల్లి తదితర ప్రాంతాల వారు ఉన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వింతగా ప్రవర్తిస్తుండడం.. జనంపై దాడికి ప్రయత్నిస్తుండడంతో రోగుల కాళ్లు చేతులు కట్టేసి.. వైద్యం చేస్తున్నారు. వీరిలో నలుగురికి ఫిట్స్ కూడా వచ్చాయని వైదులు తెలిపారు. డైజిపామ్కు అలవాటు పడటం వల్లే బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. -
కల్లులో మాదక ద్రవ్యాల కల్తీ
మాదక ద్రవ్యాల మాఫియా పనిగా అనుమానం సాక్షి, హైదరాబాద్: మనిషిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాలు, మత్తును కలిగించే అనస్థీషియా మందులు కల్లులో కలిపి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఇప్పటివరకు కల్లులో అల్ఫజొలం, డైజోఫాం వంటి మందులు మాత్రమే కలిపి విక్రయిస్తున్నట్లు భావించినా, అంతకన్నా ఎక్కువ మోతాదులో మత్తును కలిగించే మాదక ద్రవ్యాలను కల్లులో క లుపుతున్నారని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అనుమానిస్తోంది. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు విమానాల ద్వారా మాద క ద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న మాఫియానే కల్లు దుకాణాలకు కూడా హాని కలిగించే మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేసింది. డీసీఏ వాదనతో ఏకీభవించిన ఎక్సైజ్ శాఖ కూడా రాష్ట్రంలో కల్లు కల్తీ అవుతుందని తేల్చింది. కల్తీ కల్లును అరికట్టేందుకు, ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు కల్లు దుకాణాలకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఆబ్కారీ భవన్లో బుధవారం ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, డీసీఏ డెరైక్టర్ అకున్ సబర్వాల్, నార్కోటిక్స్ డీఐజీ వేణుగోపాల్, ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ దామోదర్, తెలంగాణ ఎక్సైజ్ అదనపు కమిషనర్ టి. ప్రసాద్, పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు సమావేశమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రధానంగా కల్లులో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలిందని సమావేశంలో తేల్చారు. -
కల్లు సేవించి పలువురికి అస్వస్థత
చేగుంట : కల్లు సేవించి పలువురికి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని భీంరావుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భీంరావుపల్లి గ్రామంలో వారం రోజులుగా దుర్గమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. పూజల సందర్భంగా గ్రామంలో కల్లు తాగడం మానేశారు. శనివారం జాతర ఉత్సవాలు ముగియడంతో ఆదివారం గ్రామంలో చాలా మంది కల్లు దుకాణానికి వెళ్లి కల్లు సేవించారు. ఆదివారం రాత్రి నుంచి కల్లు తాగిన వారంతా మత్తులోకి జారుకున్నారు. సోమవారం ఉదయం వరకు వారు మత్తు నుంచి తేరుకోక పోగా సోమవారం ఉదయం కల్లు తాగిన వారికి సైతం ఎక్కువ మత్తు ఆవహించింది. వారి ప్రవర్తనలో మార్పుతో పాటు అచేతనంగా కల్లు దుకాణం సమీపంలోనే పడి పోవడంతో స్థానికులు వారిని నార్సింగి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన లో 50 సంవత్సరాలు దాటిన వృద్ధులంతా అస్వస్థతకు గురైనారు. భీంరావుపల్లి గ్రామంలో రెడ్డిపల్లి నుంచి కల్లును విక్రయిస్తుండగా కల్తీ కల్లు సేవించడంతోనే గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని ప్రజలు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ యశ్వంత్ గ్రామానికి చేరుకుని బాధితుల వివరాలను సేకరించారు. అనంతరం కల్లు శ్యాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మళ్లీ కల్లు దుకాణాలు
-
కల్తీ కల్లు మాఫియా!
పొద్దంతా కష్టం చేసిన పల్లె జనం.. పొద్దుగూకిన వేళ ఇంత కల్లుతాగి కంటి నిండా నిద్రపోతారు. వెనుకటికి తల్లి లేని బిడ్డకు కల్లే తల్లై సాకింది. బొడ్డు గురిగిలో కల్లు పోసి చంటిబిడ్డ నోట్లో పెడితే తల్లిపాల వలే తాగి బతికేది. కల్లు అంత స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడా కల్లు సీసాల్లోకి ‘ఖల్ నాయకులు’ చొరబడ్డారు. కల్లును కల్తీ చేశారు. గీత కార్మికులను భయపెట్టి, ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టి దర్జాగా కల్లు సొసైటీలను కబ్జా చేశారు. ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ తదితర నిషేధిత మత్తు రసాయనాలను కలిపి ‘కృత్రిమ కల్లు’ సృష్టించారు. ఎక్సైజ్ అధికారుల అండతో జనం మీదకు వదిలారు. ఇప్పుడు కల్లు తాగే అలవాటున్న జనం ఒళ్లంతా విషమే. ఒక్క పూట కల్లు లేకుంటే పిచ్చిపట్టి చచ్చిపోయే స్థాయికి దిగజారిపోయారు. ఏళ్లకేళ్లుగా మెతుకుసీమలో జనం అలవాటుతో వ్యాపారం చేస్తున్న ‘కల్తీ కల్లు మాఫియా’పై ‘సాక్షి’ పరిశీలనాత్మక వరుస కథనాలు రేపటినుంచి.