యాదాద్రి జిల్లాలో విషాదం
Published Thu, May 11 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
- పురుగుల మందు కలిసిన కల్లు తాగి ఒకరి మృతి
- మరొకరి పరిస్థితి విషమం
ఆత్మకూరు(యం): యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్లు కుండలపై ఈగలు వాలకుండా చల్లిన పురుగుల మందు కల్లులో కలిసిపోవడంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అందులో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని ఆత్మకూరు(యం) మండలంలోని తుక్కాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దెయ్యాల పాండు(28), దెయ్యాల నగేశ్ ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ తాటిచెట్టు గీస్తున్న వ్యక్తి కల్లులో తేనటీగలు పడుతున్నాయని చెప్పడంతో వీరిద్దరు పురుగుల మందు తెచ్చిన కల్లు కుండలపై పోశారు. ప్రమాదవశాత్తు ఆ మందు కుండలోపల పడటంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం పాండు మృతిచెందగా, నగేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement